పార్వతీపురంటౌన్: పట్టణవాసులపై త్వరలో ఆస్తిపన్ను భారం పడనుంది. పట్టణాలను బలోపేతం చేయాలనే నెపంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆస్తిపన్ను బాదుడుకు తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2002 నుంచి ఇప్పటి వరకు ఆస్తిపన్ను పెంచలేదని, అందుకే పెంచుతున్నట్లు ఈనెల 20న విజయవాడలో మున్సి పల్ శాఖామంత్రి నారాయణ ప్రక టించిచారు. దీంతో పట్టణవాసుల్లో పన్నుపోటు గుబులు ప్రారంభమైంది. ఇప్పటికే 12వేల మంది ఇళ్ల యజమానులు సంవత్సరానికి రూ.2.34 కోట్లు పన్ను రూపంలో మున్సిపాల్టీకి చెల్లిస్తున్నారు. నూతనంగా విధించే పన్ను వల్ల అదనంగా కోటి రూపాయల భారం పడనుంది.
అంతే కాకుండా మున్సిపల్ చైర్‌పర్సన్‌లకు ఆస్తిపన్ను పెంపుదలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు మూడు నెలల క్రితం మున్సిపల్ మంత్రి ప్రకటించారు. గతంలో ఉన్న ఆస్తిపన్ను కంటే నూతనంగా 20 నుంచి 40 శాతం పన్ను పెంచే అవకాశం ఉందని మున్సిపల్ రెవె న్యూ అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా మున్సిపాల్టీని అభివృద్ధి బాట లో నడిపించాలనే సాకుతో ఏటా 3 శాతం నుంచి 6 పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. ఆస్తిపన్ను పెంపునకు సంబంధించి త్వరలో ప్రభుత్వం జీవో విడుదల చేయనున్నట్లు మున్సిపల్ మంత్రి స్పష్టం చేశారు. ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం ఆస్తిపన్ను పెంచడమే సరైన మార్గమని ప్రభుత్వం భా వించడం సరికాదని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతో పాటు పలు పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
అధ్వానంగా తాగునీటి సరఫరా
గత 54 ఏళ్లుగా పార్వతీపురం మున్సిపాల్టీలో తాగునీటి సరఫరా అధ్వానంగా ఉందని అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలిసిన విషయమే అయినప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ ఏడాది వర్షాకాలంలో మూడు నెలల పాటు 30 వార్డుల్లో ఉన్న ప్రజలు కొళాయిల నుంచి వచ్చిన బురదనీరే తాగా రు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో స్థానికులు తాగు నీటికి నిత్యం యాతన పడుతున్నారు.
అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ
మున్సిపాల్టీలో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యింది. వీధీదీపాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణతో పాటు సిబ్బంది కొరతతో వీధులు అంధకారంలో మగ్గుతున్నాయి. దీంతో నివాసితులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మున్సి పాల్టీలో ఇన్ని సమస్యలు నెల కొని ఉండగా నూతనంగా పన్నులభారాన్ని వేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుండడంతో వైఎస్సార్ సీపీతో పాటు పలు ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి.
పట్టణ వాసులకు ‘పన్నుపోటు’
Published Mon, Nov 24 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM
Advertisement
Advertisement