నీటి కొరత తీర్చాలంటూ నల్లగొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపాడు క్రాస్‌రోడ్డు వద్ద స్థానికులు బుధవారం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. సుమారు 200 మంది బిందెలతో రహదారిపై బైఠాయించారు. దీంతో సూర్యాపేట - దంతాలపల్లి రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వారానికి ఒక్కసారి కూడా నీటిని అందించడం లేదని, ఈ పరిస్థితుల్లో ఎలా జీవించాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ నారాయణకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని, అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నీటి కోసం ధర్నా
Published Wed, Sep 23 2015 10:18 AM | Last Updated on Thu, Aug 30 2018 3:51 PM
Advertisement
Advertisement