పులికాట్ కేంద్రంగా... ఎర్రల దందా!
ప్రతి రోజూ రూ.500 కేజీల అక్రమ రవాణా
రూ.లక్షలు సంపాదిస్తున్న దళారులు
చిల్లకూరు: పులికాట్ కేంద్రంగా వానపాముల అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రతి రోజూ సుమారు 500 కేజీల వరకు తరలిపోతున్నాయి. భూమిని తొలిచి పంటలకు ఆక్సిజన్ అందించడంలో వానపాములు(ఎర్ర లు) రైతుల కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో గిరాకీ పెరిగింది. ఇది ఎక్కవ శాతం పులికాట్‌ను ఆధారం చేసుకుని దాందా సాగుతోంది.
ఎందుకు వినియోగిస్తారంటే:
వానపాములు ఎక్కువగా రొయ్యలకు మేతగా వినియోగి స్తారు. ఇవి ఎంత తింటే అంత బలంగా రొయ్యలు పెరుగుతాయి. రొయ్యల గుంతలు సాగు చేసే వారు ఎర్రల కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. పులికాట్ ప్రాంతంలో దోరికే వాటికి మండి డిమాండ్ ఉండటంతో ప్రకాశం, తూర్పుగోదావరి ప్రాంతాల్లోని రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసేవారు పోటీ పడిమరీ కొనుగోలు చేస్తుండటంతో వాటికి మంచి గిరాకి ఏర్పడింది. తల్లి రొయ్యకు వానపామును ఆహారంగా వేస్తే లక్ష గుడ్లు పెట్టే రొయ్య అంతకు మించి గుడ్లు పెడుతుంది.
వివిధ మార్గాల్లో:
సాధారణంగా దొరికే వానపాముల కంటే పులికాట్‌లో దొరికేవి పుష్టిగా ఉండటమే కాకుండా రొ య్యలకు మంచి బలం చేకూర్చుతుండటంతో ఆ ప్రాం తంలోనే వాటి కోసం అన్వేషణ ఎక్కువైంది. దీంతో దళారులు ఆ ప్రాంతలోని గిరిజనులను మచ్చిక చేసుకుని వారికి డబ్బు ఆశచూపి ప్రతిరోజూ వానపాములను తవ్వి తరలిస్తున్నారు. వీటిని కొంత మంది కుండల్లో, టిఫిన్ బాక్సులు, ప్లాస్టిక్ కవర్లలో ఉంచి బస్సు, లారీలు, ప్రైవేట్ వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
కేజీ రూ.3 వేలు పలుకుతున్న ధర:
పులికాట్ ప్రాంతంలో సేకరించిన ఎర్రలకు కేజీ రూ.3 నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. పులికాట్‌లో గిరిజనులు సేకరించే వాటికి మాత్రం కేజీకి రూ.40 ఇచ్చి, దళారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.