గ్రూప్-1 సర్వీసు తప్ప మిగిలిన అన్నింటికి నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీని నిలుపుదల చేయడంలో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, గ్రూప్-1 సర్వీసు తప్ప మిగిలిన అన్నింటికి నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
నోటిఫికేన్లు నిలిపివేయడంలో న్యాయం లేదని, ఉద్యోగాలొస్తాయనే ఆశతో దాదాపు 25లక్షల మంది నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఉద్యోగాలకు సెలవులు పెట్టి, వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్‌లు తీసుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో భర్తీకి సిద్ధంగా ఉన్నా ఉద్యోగాల నోటిఫికేషన్లు నిలిపివేయడం సరికాదని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.