న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ...రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం ఉదయం ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ ఆర్డినెన్స్పై రాహుల్ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. ప్రధానమంత్రి పదవి కోసం రాహుల్ గాంధీ పాకులాడకుండా హుందాగా ప్రవర్తించాలని చంద్రబాబు సూచించారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశ ప్రతిష్ట కాపాడేలా వ్యవహరించాలని.... ఇంత అవమానం జరిగినా తాను కుర్చీని వదలనని చెప్పటం ప్రధాని చెప్పటం దారుణమన్నారు. దేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, అందుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
'ప్రధానికి రాహుల్ క్షమాపణ చెప్పాలి'
Published Wed, Oct 2 2013 10:45 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement