రైల్వే బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెడుతున్నారు. ఏటా బడ్జెట్లో ఎలాంటి ప్రయోజనాలు పొందని ఈ జిల్లావాసులు మరోసారి ఆశగా నిరీక్షిస్తున్నారు. ఈసారైనా రైల్వే మంత్రి సురేష్ ప్రభు తమ ఆకాంక్షలను నెరవేరుస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాను ముక్కలు చేసి రేల్వేశాఖ విభజించి పాలిస్తోంది. బ్రిటీష్‌కాలం నాటి రైల్వే లైన్లే కొనసాగుతూ భద్రత తీరును ప్రశ్నిస్తున్నాయి. పగలూ రాత్రి విరామం లేకుండా ఎక్స్‌ప్రెస్‌లు సూపర్‌ఫాస్టుగా పరుగులు తీస్తున్నా ఆగేవి కొన్ని మాత్రమే. దీంతో ప్రయాణికులది ప్రేక్షక పాత్రే. దేశంలోని ఏ ప్రధాన నగరానికి వెళ్లాలన్నా కష్టపడి విశాఖ చేరుకోవల్సిందే. ఆఖరుకు తిరుపతి వెళ్లాలన్నా విశాఖ చూడాల్సిందే. తమ ప్రాంతానికి పొడిగించారని సంబరపడితే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్ వరకూ తీసుకుపోయి ఆశలపై నీళ్లు చల్లారు.
శ్రీకాకుళం టౌన్:
రైల్వే బడ్జెట్‌పై జిల్లా కోటి ఆశలను పెట్టుకుంది. ఈసారైనా తమపై రైల్వే మంత్రి కరుణ చూపుతారని ఆశపడుతోంది. చాలాకాలంగా నెరవేరకుండా పోతున్న డిమాండ్లను తీరుస్తారని ఆకాంక్షిస్తోంది. శ్రీకాకుళం పేరుతో ఉన్న ఆమదాలవలస రేల్వేస్టేషన్ మీదుగా ప్రయాణిస్తున్న 22రైళ్లకు ఇక్కడ హాల్ట్ లేదు. విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను అతికష్టం మీద పలాసవరకు పొడిగించారు.. కాని ఈ ఆనందం మిగలకుండా భువనేశ్వర్ వరకు పొడిగించారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ శ్రీకాకుళం వరకు పొడిగించాలనే దీర్ఘకాలిక కోరిక తీరడం లేదు. యశ్వంతపూర్,తిరుచ్చి వంటి రైళ్లకు ఇక్కడ హాల్ట్ లేకుండా చేశారు. ఆధునీకీకరణ నిధుల మంజూరు అరకొరే. శ్రీకాకుళం రేల్వేస్టేషన్లో వికలాంగులు, హృద్రోగులు రెలైక్కాలంటే అవస్థలే. ర్యాంపుల నిర్మాణం కలగానే మిగులుతోంద. పలాస నుంచి ప్రపంచ వాణిజ్య మార్కెట్‌లో గిరాకీ ఉన్న జీడిపప్పు రవాణా అవుతోంది. అయినా అదనపు ప్లాట్‌ఫారాల డిమాండ్ నెరవేరడం లేదు. లైన్‌పై ఒక రైలు
పట్టాలెక్కని హామీలు
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ జిల్లాలోనే పెద్దది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది. ప్రయాణికుల తాకిడి ఎక్కువ. ఆదాయం ప్రతినెల రూ.1.60 కోట్లు వస్తున్నట్టు రైల్వేశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇంత పెద్దమొత్తం లో ఆదాయం వస్తున్నా సౌకర్యాలు మృగ్యమే. నిత్యం ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. స్టేషన్‌లో నాలుగు ఫ్లాట్‌ఫాంలు ఉన్నాయి. ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంకు పూర్తిగా పైకప్పు లేదు. మిగతా మూడు ప్లాట్‌ఫాంలకు సగభాగం మాత్రమే పైకప్పు ఉంది. ప్రయాణీకులకు ఎండ, వాన కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి.
ఫ్లాట్‌ఫాంలపై ఉన్న తాగునీటి కుళాయిలు, మరుగుదొడ్ల నిర్వహణ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే సక్రమంగా నిర్వహిస్తారు. ఆ తరువాత ఆ సేవలు ప్రయాణుకులకు అందని ద్రాక్షగానే ఉంటున్నాయి. రైల్వేస్టేషన్‌ను మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చి దిద్దుతానని ఎంపీ కింజరావు రామ్మోహన్‌నాయుడు పలుమార్లు స్టేషన్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా హామీలు కార్యరూపం దాల్చలేదు.
విశాఖ పట్టణానికి అతి సమీపంలో ఉన్నప్పటికీ ఈ స్టేషన్ భువనేశ్వర్ జోన్‌లో ఉండడం వల్లే స్టేషన్ అభివృద్ధి మసకబారుతోందని స్థానిక రైల్వే అధికారులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. స్టేషన్‌లో అటు విశాఖపట్టణం వైపు, ఇటు పలాస వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు 29 (వీక్లీలతోపాటు), నాలుగు పాసింజర్‌లు నిలుపుదల చేస్తారు. మరో 13 రైళ్లకు ఇప్పటికీ హాల్ట్‌లేదు. దీంతో అటు విజయనగరం, ఇటు భువనేశ్వర్ వెళ్లి రైళ్లను ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది.
స్టేషన్‌లో ఆగని రైళ్లు వివరాలు....
భువనేశ్వర్-రామేశ్వరం, విశాఖపట్టణం-డిగా, చెన్నయ్-న్యూజయపూర్, మైసూర్-హౌరా, చెన్నయ్-హల్దియా, విల్లిపురం-పురీలియా, విల్లిపురం-ఖరగ్‌పూర్, ఎర్నాకులం-హౌరా, యశ్వంత్‌పూర్-భగల్‌పూర్, పూనే-భువనేశ్వర్, తిరుచునాపల్లి-హౌరా, ఇగ్మోర్- గౌహతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు నిలుపుదల చేయడం లేదు.
టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలికి సుమా రు 5 కిలోమీటర్ల దూరంలోని నౌపడ రైల్వే స్టేషన్‌ను పట్టించుకునే నాథుడే కరువయ్యా డు. గ్రానైట్ పరిశ్రమకు ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారు ల రాకపోకలు పెరుగుతున్నా రైల్వే అధికారు లు మాత్రం స్టేషన్‌పై నిర్లక్ష్యం చూపుతున్నారు. నౌపడ రైల్వే స్టేషన్‌లో ఫలక్‌నుమా, కోణార్క్, హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ సదుపాయం కల్పించాలని పలుమార్లు కేంద్రమంత్రి స్థాయి పాలకులకు విన్నవించినా ఫలితం శూన్యమే.
ఇక్కడ సాధారణ రిజర్వేషన్, తత్కాల్ రిజర్వేషన్లకు ప్రత్యేక కౌంటర్లు లేకపోవడం సమస్యగా మారింది. కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌లో సమస్యల కూత వినిపిస్తోంది. స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన విశ్రాంతి షెడ్లు లేవు.విశాఖ-గుణుపూర్ ప్యాసింజర్ రైలుతో పాటు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించాలని పలుమార్లు విన్నవించినా ఫలితం లేదు. మరుగుదొడ్లు, మంచినీటి కొరత ప్రయాణికులను వెంటాడుతున్నాయి.
ప్రభూ కరుణించవా...
Published Thu, Feb 25 2016 12:29 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement