
అమరావతి :
రైతుల తరఫున పోరాడుతున్నందుకే తనపై కేసులు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికినా కేసులుండవని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులకు వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని చెప్పారు.
కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆర్కే అన్నారు. అభిప్రాయాలను మినిట్స్ బుక్‌లో రాయమన్నందుకు ఆర్కే సహా రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. ఆర్కే సహా 13 మంది రైతులకు సమన్లు అందాయి. నవంబర్7న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.