ramakrishnareddy
-
వీరజవానుకు కన్నీటి వీడ్కోలు
గిద్దలూరు: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని దుండగల్ సెక్టార్లో విధులు నిర్వహిస్తూ ఈనెల 12న పాక్ సైనికుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాను తల్లపురెడ్డి రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురంలో జరిగాయి. సైనికులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు వెళ్తున్న వాహనంపై పాక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్న రామకృష్ణారెడ్డి తలనుంచి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతను వెంటనే కుప్పకూలాడు. దగ్గరగా వచ్చిన ఉగ్రవాదులు వాహనంలో కూర్చుని ఉన్న మరో భారత జవాన్‌ను కూడా కాల్చేశారు. అనంతరం ఇద్దరి మృతదేహాలపై ఏకధాటిగా 11 బుల్లెట్లు దించారని సైనికోద్యోగి తెలిపారు. రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని శనివారం సైనికాధికారులు ఓబులాపురానికి తీసుకొ చ్చారు. వేలాది మంది ప్రజలు వీరజవానుకు నివాళులర్పించారు. కలెక్టర్ వినయ్‌చంద్, ఎస్పీ సత్య ఏసుబాబు, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి, జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం.అరుణ కుమారి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మృతుని తండ్రి పెద్ద వెంకట రెడ్డికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫోన్‌చేసి పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్మీ కల్నల్ ఆనంద్‌సింగ్ పర్యవేక్ష ణలో సైనిక లాంఛనాలతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
కేసులకు భయపడే ప్రసక్తే లేదు : ఆర్కే
అమరావతి : రైతుల తరఫున పోరాడుతున్నందుకే తనపై కేసులు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికినా కేసులుండవని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆర్కే అన్నారు. అభిప్రాయాలను మినిట్స్ బుక్‌లో రాయమన్నందుకు ఆర్కే సహా రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. ఆర్కే సహా 13 మంది రైతులకు సమన్లు అందాయి. నవంబర్7న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. -
ముమ్మాటికీ కక్షసాధింపే
– ప్రజా సమస్యలపై ధర్నాల్లో పాల్గొంటే రౌడీషీట్ బనాయిస్తారా? – వైఎస్సార్‌ఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ హిందూపురం అర్బన్ : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చేసిన ధర్నాల్లో పాల్గొన్న రామకృష్ణారెడ్డిపై రౌడీషీట్ బనాయించడం టీడీపీ కక్ష సాధింపు చర్యలేనని వైఎస్సార్‌ఎస్‌యూ జిల్లా ప్రధాన lకార్యదర్శి చంద్రశేఖర్ గురువారం విమర్శించారు. చిలమత్తూరు మాజీ విద్యార్థి నాయకుడు రామకృష్ణారెడ్డిపై రౌడీషీట్ పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు రెండేళ్ల క్రితం చేసిన ధర్నాలకు ఇప్పుడు కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నిరంతరం ప్రజాసేవ, విద్యార్థుల సమస్యల కోసం వైఎస్సార్సీపీలో చురుగ్గా పాల్గొంటున్నాడని టార్గెట్ చేసి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు రౌడీషీట్ బనాయించడం తగదన్నారు. అక్రమంగా బనాయించిన రౌడీషీట్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామని వివరించారు. -
చీకటి ఒప్పందాలను బహిర్గతం చేయాలి
ఏపీ రాజధాని భూములపై ఆళ్ల రామకృష్ణారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంతంలో విదేశీ సంస్థలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలన్నింటినీ బహిర్గతం చేయాలనీ, వెంటనే లావాదేవీలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను, ఇవ్వని రైతులను కూడా చంద్రబాబు దారుణంగా మోసం చేస్తున్నారని, ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సింగపూర్ సంస్థలైన సెమ్‌కార్ప్, సెమ్‌బ్రిడ్జి, అసెండాస్‌కు 1,700 ఎకరాల భూమిని దత్తం చేస్తూ సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు భూములిచ్చిన రైతులకు కచ్చితంగా ఈ 1,700 ఎకరాల్లోనే వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఒప్పందాలు చేసుకునేటపుడు ఎక్కడైనా ప్రైవేటు వాటా తక్కువగా ఉంటుందని కానీ చంద్రబాబు కొత్త పద్ధతికి తెరలేపుతూ తొలి దశ ఒప్పందంలో 58% ప్రైవేటుకు ఇచ్చి 42% ప్రభుత్వ సంస్థలు తీసుకుంటున్నాయని విమర్శించారు. పైగా ప్రైవేటుకు ఇస్తున్న 58% భూముల్లో 32% ఎవరికైనా అమ్ముకోవచ్చనడం దారుణమన్నారు. పాలనాపరమైన టైజం: వాసిరెడ్డి పద్మ చంద్రబాబు తన ఏకపక్ష విధానాలతో పరిపాలనలో టైజాన్ని సృష్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులందరూ టీడీపీ నేతలు చెప్పిన విధంగానే నడుచుకోవాలని బాబు ఆదేశాలివ్వడం దారుణమన్నారు. -
కేసు విచారణ నుంచి తప్పుకోండి
- మత్తయ్య పిటిషన్ వ్యవహారంలో జస్టిస్ శివశంకరరావుకు అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి - న్యాయమూర్తి తీరుపై సందేహముంటే ఇలా తప్పుకోవడం పరిపాటని నివేదన సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి తప్పుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావును రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి కోరారు. న్యాయమూర్తి తీరుపై ఆందోళన వ్యక్తమైన సందర్భంలో ఆ కేసు విచారణ నుంచి ఆ న్యాయమూర్తి తప్పుకోవడం పరిపాటని ఆయన నివేదించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ నిందితుడు మత్తయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావును ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని అభ్యర్థిస్తూ స్టీఫెన్సన్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగినప్పుడు... ఈ పిటిషన్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనం దువల్ల ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయ డం లేదని ఏజీ రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలి పారు. దాంతో న్యాయమూర్తి ఈ విషయాన్ని రికార్డ్ చేసుకుని తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. అయితే శుక్రవారం రేవంత్‌రెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిసిన వెంటనే ఏజీ నేరుగా జస్టిస్ శివశంకరరావు కోర్టుకు వెళ్లారు. స్టీఫెన్సన్ అనుబంధ పిటిషన్ గురించి ప్రస్తావించి, తన అభిప్రాయాన్ని తెలపాలనుకుంటున్నానని చెప్పారు. న్యాయమూర్తి అనుమతినివ్వడంతో... కేసు విచారణ నుంచి తప్పుకోవాలన్న స్టీఫెన్సన్ విజ్ఞప్తిని మన్నించాలని కోరారు. కేసు నుంచి తప్పుకోవాలని ఓ పార్టీ కోరడంతో సుప్రీం న్యాయమూర్తి ఒకరు కేసు నుంచి తప్పుకొన్నారని.. ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది ఒకరు తన పుస్తకంలో పేర్కొన్నారంటూ దానిని న్యాయమూర్తికి అందజేశారు. ఈ అభిప్రాయాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంటున్నానని, తీర్పులో దీనినీ ప్రస్తావిస్తానని న్యాయమూర్తి పేర్కొన్నారు.