– ప్రజా సమస్యలపై ధర్నాల్లో పాల్గొంటే రౌడీషీట్ బనాయిస్తారా?
– వైఎస్సార్‌ఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్
హిందూపురం అర్బన్ : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చేసిన ధర్నాల్లో పాల్గొన్న రామకృష్ణారెడ్డిపై రౌడీషీట్ బనాయించడం టీడీపీ కక్ష సాధింపు చర్యలేనని వైఎస్సార్‌ఎస్‌యూ జిల్లా ప్రధాన lకార్యదర్శి చంద్రశేఖర్ గురువారం విమర్శించారు. చిలమత్తూరు మాజీ విద్యార్థి నాయకుడు రామకృష్ణారెడ్డిపై రౌడీషీట్ పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు రెండేళ్ల క్రితం చేసిన ధర్నాలకు ఇప్పుడు కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నిరంతరం ప్రజాసేవ, విద్యార్థుల సమస్యల కోసం వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పాల్గొంటున్నాడని టార్గెట్ చేసి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు రౌడీషీట్ బనాయించడం తగదన్నారు. అక్రమంగా బనాయించిన రౌడీషీట్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామని వివరించారు.
ముమ్మాటికీ కక్షసాధింపే
Published Thu, Aug 4 2016 9:22 PM | Last Updated on Tue, May 29 2018 3:46 PM
Advertisement