పెచ్చరిల్లుతున్న లైంగికదాడులు | Ramesh Ranganathan comments on Sexual assaults | Sakshi
Sakshi News home page

పెచ్చరిల్లుతున్న లైంగికదాడులు

Published Sun, Jul 16 2017 2:42 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

పెచ్చరిల్లుతున్న లైంగికదాడులు - Sakshi

పెచ్చరిల్లుతున్న లైంగికదాడులు

ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌ రంగనాథన్‌ 
 
విజయవాడ లీగల్‌: దేశంలో బాలికలపై లైంగికదాడులు పెచ్చరిల్లుతున్నాయని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌ రంగనాథన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ దాడులను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. విజయవాడ బందరు రోడ్డులోని, హోటల్‌ మురళి ఫార్చ్యూన్‌ పార్కులో జువెనైల్‌ జస్టిస్, పోస్కో చట్టాలపై శనివారం వర్క్‌షాపు జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌ మాట్లాడుతూ బాలికలు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. జువినైల్‌ కోర్టుల్లో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ పోస్కో చట్టం–2012లో అమలులోకి వచ్చిందని, అప్పటి నుంచి రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. 53 శాతం మంది బాలికలు లైంగిక వేధంపులకు గురవుతున్నారని వివరించారు. డీజీపీ ఎన్‌.సాంబశివరావు మాట్లాడుతూ బాల బాలికలపై జరిగే వేధింపులకు సంబంధించి పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోందన్నారు.  యూనిసెఫ్‌ ప్రతినిధి సోనీజార్జ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పోస్కో, జువినైల్‌ చట్టాలు బాగానే అమలవుతున్నాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైస్వాల్, జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు మాట్లడుతూ ఎన్‌జీవోలు, జువైనైల్‌ జస్టిస్‌ బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement