సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ముస్లిం సోదరులు శుక్రవారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రం సంగారెడ్డితో పాటు పటాన్‌చెరు, సిద్దిపేట, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్‌లోని ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్ ప్రార్థనల్లో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. రంజాన్ వేడుకల్లో జిల్లా మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. జహీరాబాద్‌లో మంత్రి గీతారెడ్డికి ముస్లిం సోదరులు ఆమె నివాసంలో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి సునీతారెడ్డి నర్సాపూర్, దౌల్తాబాద్‌లో రంజాన్ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్దిపేటలో ఇక్బాల్ మీనార్ వద్ద ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్ష తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ శరత్, ఎస్పీ విజయ్‌కుమార్ సంగారెడ్డిలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో హాస్టల్ గడ్డ వద్ద ఉన్న ఈద్గాలో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎస్పీ విజయ్‌కుమార్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించటంతో పాటు ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మెదక్‌లో నవాబుపేట ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సిద్దిపేటలో ముస్లింలు ఇక్బాల్ మినార్ ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పటాన్‌చెరులో సైతం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేటల్లో సైతం రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. నర్సాపూర్‌లో మంత్రి సునీతారెడ్డి రంజాన్ వేడుకల్లో పాలుపంచుకున్నారు.
టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మదన్‌రెడ్డి, ైవె ఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం కన్వీనర్ శ్రీధర్‌గుప్తా రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు రంజాన్ ప్రత్యేక వంటకం షీర్ కుర్మాతో పాటు బిర్యాని తదితర వంటకాలను ఆరగించటంతో పాటు బంధువులు, మిత్రులకు షీర్ కుర్మా తినిపించి సంతోషంగా పండుగను జరుపుకున్నారు. ఇదిలా ఉంటే రామచంద్రాపురంలోని ఈద్గా వద్ద గురువారం రాత్రి టెంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేయటంతో ముస్లింలో శుక్రవారం రామచంద్రాపురంలో తొమ్మిదవ నంబరు జాతీయ రహదారిపై నిరసన తెలియజేశారు.
ఘనంగా రంజాన్ వేడుకలు
Published Sat, Aug 10 2013 12:35 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement