అనపర్తి మండలంలో కొప్పవరంలో బుధవారం అర్థరాత్రి కొందరు ఆటో డ్రైవర్లు మహిళపై అత్యాచారానికి యత్నించారు. దాంతో ఆ మహిళ గట్టిగా అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆటో డ్రైవర్లను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొప్పవరం చేరుకుని ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆటో డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.