కోనరావుపేట, న్యూస్‌లైన్ : అటవీ శాఖ అధికారులమని చెబుతూ ఇద్దరు యువకులు రేషన్ డీలర్‌పై దాడి చేశారు. బుధవారం రాత్రి మండలంలోని ఎగ్లాస్‌పూర్‌కు చెందిన మహేశ్, సుధాకర్ తాము అటవీ శాఖ అధికారులమని గ్రామ రేషన్ డీలర్ నాగరాజును డబ్బులు డిమాండ్ చేస్తూ దాడి చేశారు. రాత్రి 11 గంటల సమయంలో డీలర్‌ను లేపి డబ్బులు అడిగారు. ఆయన ఇవ్వకపోవడంతో దాడి చేశారు. దీంతో డీలర్ కేకలు వేయడంతో గ్రామస్తులు ఇద్దరు యువకులను పట్టుకొని నిలదీశారు.
వారు అదే గ్రామానికి చెందినవారమని చెప్పడంతో చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసుల కన్నుగప్పి వారు పారిపోయారు. గురువారం ఉదయం పోలీసులు నిందితులను వదిలిపెట్టారని ఆరోపిస్తూ సుమారు రెండు వందల మంది గ్రామస్తులు కోనరావుపేట ఠాణాకు చేరుకున్నారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. డీలర్‌పై దాడి చేసిన మహేశ్, సుధాకర్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై అశోక్ చెప్పడంతో ఆందోళన విరమించారు.
రేషన్ డీలర్‌పై దాడి
Published Fri, Aug 30 2013 6:28 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement