రిజర్వు బ్యాంకు విడుదల చేసిన రూ.100 నోటు
విశాఖపట్నం, పరవాడ(పెందుర్తి): రిజర్వు బ్యాంకు ఈనెల 1 న మార్కెట్‌లోకి విడుదల చేసిన రూ.100 నోట్లను పరవాడ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కొరుపోలు గంగాధర్ సేకరించారు. ఈ నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ బొమ్మ, వెనుక భాగంలో సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ‘రాణికి వావ్’ ముద్రించి ఉంది. లావెండర్ కలర్‌లో ముద్రించిన కొత్త వంద నోటు 142 మిల్లిమీటర్ల పొడవు, 66 మిల్లీ మీటర్ల వెడల్పు ఉంది. నోటు ముందు భాగంలో గాంధీ, అశోకుడి నాలుగు సింహాలు, 100 సంఖ్య వాటర్ మార్కు ఉన్నాయి. నోటు వెనుక భాగంలో స్వచ్ఛభారత్ లోగో నినాదం ఉంది. పాత వంద నోట్లతో పాటు కొత్త నోట్లు చలామణిలో ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment