‘కరువు, చంద్రబాబు కవలలు’ | ready to discuss on nellore district development, says kakani govardhan reddy | Sakshi
Sakshi News home page

‘కరువు, చంద్రబాబు కవలలు’

Published Thu, May 25 2017 2:02 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

‘కరువు, చంద్రబాబు కవలలు’ - Sakshi

‘కరువు, చంద్రబాబు కవలలు’

నెల్లూరు: కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ఆంధ్రప్రదేశ్‌ సర్కారు విఫలమైందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కరువు, చంద్రబాబు కవల పిల్లలని పేర్కొన్నారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హాయంలోనే నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. కృష్ణా పోర్టుకు శంకుస్థాపన చేసి చంద్రబాబు చేతులు దులుపుకుంటే ఆ పనులను వైఎస్సార్‌ పూర్తి చేశారని గుర్తు చేశారు. సోమశిల జలాశయ సామర్థ్యాన్ని 72 టీఎంసీలకు పెంచింది వైఎస్సారేనని తెలిపారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement