రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం | Red sandal wood logs worth Rs. Crore seized | Sakshi
Sakshi News home page

రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Fri, Oct 9 2015 7:49 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

Red sandal wood logs worth Rs. Crore seized

రైల్వేకోడూరు (వైఎస్సార్ జిల్లా) : పోలీసులు, అటవీ అధికారుల సంయుక్త దాడుల్లో రూ.కోటి విలువైన ఎర్ర చందనం దుంగలు పట్టుబడ్డాయి. రైల్వే కోడూరు మండల కేంద్రంలోని జ్యోతినగర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు.

అనుమానాస్పదంగా కనిపించిన వ్యానును సోదా చేయగా రూ. కోటి విలువైన 109 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాహన సంబంధీకులు సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. ఈ మేరకు వాహనాన్ని, దుంగలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి, పోలీసులకు అప్పగించనున్నట్లు అటవీ రేంజి అధికారి రెడ్డి ప్రసాద్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement