
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
శ్రీకాళహస్తి రూరల్/చంద్రగిరి : శ్రీకాళహస్తి, చంద్రగిరి మండలాల్లో సోమవారం ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. శ్రీకాళహస్తి వుండలంలోని గొల్లపల్లి సమీపంలో 2014 లో అక్రవుంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తుం డగా దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ సుదర్శన్‌ప్రసాద్ తెలిపారు. ఆ సమయం లో స్మగ్లర్ బాబ్జి(24) తప్పించుకున్నాడన్నారు. కేసు నమోదు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో తిరుపతి సమీపంలోని అటోనగర్‌లో ఉండగా సోమవారం అరెస్ట్ చేశామని వివరించారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా జడ్జి అతనికి రివూండ్ విధించారని చెప్పారు. అదేవిధంగా ముందుగా అందిన సమాచారం మేరకు మండలంలోని శ్రీనివాసం మంగాపురం సమీపంలోని నరశింగాపురం రైల్వేగేటు వద్ద కూంబింగ్ చేపట్టామని ఆర్‌ఎస్ వాసు తెలిపారు.
ఈ క్రమంలో 15 మంది ఎర్రకూలీలు దుంగలను మోసుకొస్తుండగా పట్టుకునేందుకు ప్రయత్నించామన్నారు. కూలీలు దుంగలను పడేసి అటవీ ప్రాంతంలోకి పారిపోయారని తెలిపారు. వారిలో తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన వెల్లయన్‌ను అదుపులోకి తీసుకుని, 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.