విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి రెడ్ సిగ్నల్
విశాఖపట్నం: విశాఖ జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ నిర్మించ తలపెట్టిన విద్యుత్ ప్లాంట్కు పర్యావరణ శాఖ అనుమతి నిరాకరించింది. తీర ప్రాంతానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నందున సునామి తాకే ప్రమాదం ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక సమర్పించింది.
పర్యావరణ పరంగా కూడా అనుకూలం కాదని పర్యావరణ అడవుల శాఖ హెచ్చరించింది. పూడిమడక వద్ద విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తే చిన్న నీటి వనరుల అనుసంధానం ప్రక్రియ దెబ్బతింటుందని పర్యావరణ శాఖ ఈ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే 33 సంవత్సరాల లీజు ప్రాతిపదికన 1200 హెక్టార్ల భూమిని రాష్ట్రప్రభుత్వం ఈ ప్లాంటుకు కేటాయించింది. పూడిమడకలో 4వేల మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.