Red signal
-
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే అంతే! రెడ్ సిగ్నల్ పడిందో..
సాక్షి, హైదరాబాద్: తాగి వాహనం నడుపుతూ తమతో పాటూ ఇతరుల ప్రాణాలను ముప్పు తెస్తున్న మందుబాబులను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు సమాయత్తమయ్యారు. పగటి పూట కూడా మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో 24 గంటలూ డ్రంకన్ డ్రైవ్ (డీడీ) టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు డీడీలు చేపట్టనున్నారు. రెడ్ సిగ్నల్ పడగానే.. ఇప్పటివరకు ప్రతి రోజూ సాయంత్రం సమయాల్లో, స్పెషల్ డ్రైవ్‌లలో మాత్రమే ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్‌లు చేసేవారు. ప్రధాన ప్రాంతాలు, జంక్షన్లు వద్ద ప్రత్యేకంగా డీడీ పాయింట్లను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేవారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) లెవల్ 30 దాటితే కేసులు నమోదు చేస్తుంటారు. బీఏసీ స్థాయిని బట్టి రూ.10 వేలు జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేవారు. చాలా మంది మందుబాబులు డీడీ టెస్ట్‌లు పూర్తయ్యాక ఇంటికి వెళ్లడం చేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్ల వద్దే డీడీలు నిర్వహిస్తే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. సిగ్నల్ పాయింట్ వద్ద డ్యూటీలో ఉండే ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ బ్రీత్ అనలైజర్‌తో రెడీగా ఉంటారు. రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారుల వద్దకు వెళ్లి డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. పెండింగ్ డీడీ కేసుల పరిష్కారానికి.. పెండింగ్‌లో ఉన్న డ్రంకన్ డ్రైవ్ (డీడీ) కేసులను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. డీడీలో చిక్కిన మందుబాబులకు రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుంది. ప్రస్తుతం తొలిసారి డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన మందుబాబులకు రూ.2,001 జరిమానా చెల్లించే వెసులుబాటును కల్పించారు. కేసులు పెండింగ్‌లో ఉన్న ఎప్పటికైనా ప్రమాదమేనని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా మంది డీడీ నిందితులు పెండింగ్ జరిమానాను చెల్లించేందుకు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో 70 వేలకు పైగా డీడీ కేసులుంటాయని అంచనా. గతేడాది ట్రాఫిక్ చలాన్ల సంఖ్య కమిషనరేట్ ఎంవీ కేసులు డీడీ కేసులు హైదరాబాద్ 70,03,012 25,453 సైబరాబాద్ 53,50,724 34,746 రాచకొండ 22,64,225 8,121 -
సాయానికి రెడ్‌సిగ్నల్
ప్రకృతి సృష్టించిన బీభత్సం పర్యవసానంగా సర్వం కోల్పోయిన కేరళ పౌరులు ఇప్పుడిప్పుడే బుర దతో నిండి ఉన్న తమ తమ ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. కొందరికైతే వెళ్లడానికంటూ ఇళ్లే లేవు. అవి నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. ఇప్పటికీ ఇంకా వరద ముంపులో ఉన్న ప్రాంతాలున్నాయి. ఈలోగా ఊహించని విధంగా వరద సాయం వివాదం మొదలైంది. కేరళలో జరి గిన నష్టం మొత్తం రూ. 21,000 కోట్ల పైమాటేనని, సాధారణ జీవనం మొదలు కావాలంటే కనీసం రూ. 2,200 కోట్లు అవసరమని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వం అంచనా వేస్తుండగా కేంద్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు గ్రాంటుగా మంజూరు చేసింది. ఇంత భారీ నష్టం సంభవించి నచోట ఇది ఏమూలకు సరిపోతుందన్న ప్రశ్నకు జవాబిచ్చేవారు లేరు. మరోపక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఇవ్వజూపిన రూ. 700 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం తిరస్కరించింది. 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. అంతేగాక ఏ దేశం సాయం చేయడానికి ముందుకొచ్చినా సున్నితంగా తిరస్క రించాలంటూ మన రాయబార కార్యాలయాలకు ప్రభుత్వం వర్తమానం పంపింది. ఇప్పుడు సంభవించిన నష్టం సాధారణమైనది కాదు. కేరళలోని అత్యధిక జిల్లాల్లోని ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలమంది ఇప్పటికీ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు అందిస్తున్న సాయంతో రోజులు వెళ్లదీస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థి తుల్లో మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్న దేశాలను తోసిపుచ్చటం సరైనదేనా అన్న సందే హం ఎవరికైనా తలెత్తుతుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాలు సాయం అందించటానికి ముందుకు రావటం, మన దేశం వద్దనడం ఇది మొదటిసారేమీ కాదు. కశ్మీర్ భూకంపం(2005), ఉత్తరాఖండ్ వరదలు(2013), కశ్మీర్ వరదలు(2014) ఉదంతాల్లో అమెరికా, జపాన్, రష్యాలు ఇవ్వ జూపిన ఆర్థిక సాయాన్ని మన దేశం తిరస్కరించింది. 2004కు ముందు ఇలా లేదు. 1991నాటి ఉత్తరకాశీ భూకంపం, 1993నాటి లాతూర్ భూకంపం, 2001నాటి గుజరాత్ భూకంపం, 2002నాటి బెంగాల్ తుఫాను, 2004నాటి బిహార్ వరదల సమయాల్లో విదేశాల నుంచి సాయం అందుకుంది. ఎందుకీ మార్పు? ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవిస్తున్న నష్టాన్ని స్వశక్తితో పూడ్చుకోవటం సాధ్యమని నిజంగా మన దేశం విశ్వసిస్తోందా? ఇంతవరకూ జరిగిన వేర్వేరు వైపరీత్యాలను మనం అలా ఎదుర్కొనగలిగామా? పూర్తిస్థాయి పునర్నిర్మాణాన్ని సుసాధ్యం చేసుకోగలిగామా? ఆత్మాభిమానం కొనియాడదగిందే. ఎలాంటి పరిస్థితులెదురైనా చేయిచాచరాదన్న సంకల్పం గొప్పదే. కానీ లక్షలాదిమంది బతుకులు రోడ్డున పడినప్పుడు, మౌలిక సదుపాయాల కల్పనకు మన శక్తి చాలనప్పుడు సైతం ఇలాగే ప్రవర్తించాలా? ఇది మధ్యతరగతి మనస్తత్వాన్ని ప్రతిబింబించటం లేదా? ఇలా సాయాన్ని తిరస్కరించటం ద్వారా తానొక ఆర్థిక శక్తిగా రూపుదిద్దుకున్నానని చాటి చెప్పాలన్న ఆరాటమే కనబడుతోంది. మన దేశం గతంలో ఎన్నో విపత్కర పరిస్థితుల్ని చవి చూసింది. 60వ దశకంలో ఆకలి చావులు సంభవిస్తున్నప్పుడు, ప్రజలకు తిండిగింజలు చాలనప్పుడు అమెరికా ఇచ్చిన గోధుమలు, బియ్యంపై ఆధారపడ్డాం. 1991లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) నుంచి అప్పు తెచ్చుకోవటానికి మన బంగారం నిల్వలను తాకట్టు పెట్టాం. ఇప్పటికి కూడా బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి విభాగం మొదలుకొని వేర్వేరు సంస్థల నుంచి పెద్ద మొత్తంలో సహా యాన్ని స్వీకరిస్తున్న దేశాల్లో మనం అగ్రస్థానంలో ఉన్నాం. 2004లో సునామీ సంభవించి 12,000 మంది మరణించి, దాదాపు పది లక్షలమంది నిరాశ్రయులైనప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తొలిసారి విదేశీ సాయాన్ని తిరస్కరించారు. దీన్ని స్వయంశక్తితో ఎదుర్కొనగలమని అప్పట్లో ఆయన ప్రకటించారు. పైగా మన సర్కారు శ్రీలంకకు 2 కోట్ల 25 లక్షల డాలర్లు, ఇండొనేసియాకు పది లక్షల డాలర్లు ఆర్థిక సాయం అందించింది. అత్యంత పేద దేశమైన హైతీ మొదలుకొని బాగా అభివృద్ధి చెందిన జపాన్ వరకూ మన సాయం పొందాయి. 2005లో భారత్, పాకిస్తాన్‌లు రెండూ భూకంపం ధాటికి తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఆ సమయంలో కూడా మన దేశం విదేశీ సాయాన్ని తిరస్క రించింది. కానీ పాకిస్తాన్‌ను ఒప్పించి దాని అధీనంలోని ఆక్రమిత కశ్మీర్‌కు దుప్పట్లు, మందులు, ఆహారం పంపింది. 2 కోట్ల 50 లక్షల డాలర్ల చెక్కు కూడా ఇచ్చింది. ఎవరిదగ్గరైనా సాయం తీసుకో వటమంటే వారికి సాష్టాంగపడటమేనన్న అభిప్రాయం ఉన్న పక్షంలో ఇవ్వడంలోనూ అదే విధానాన్ని పాటించాలి. వారికి కూడా ఆత్మాభిమానం ఉంటుందని గుర్తించాలి. కనీసం వారు అర్ధించే వరకూ ఆగాలి. యూఏఈ కేవలం ఒక దేశంగా మాత్రమే సాయపడటానికి ముందుకు రావటం లేదు. తమ ఆర్థిక పురోగతిలో కేరళ నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల పాత్ర ఉన్నదని గుర్తించి, వారి కుటుంబాలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం తమ ధర్మమని భావించింది. కేరళకొచ్చిన కష్టం జాతీయ వైపరీత్యంగా పరిగణించి కేంద్రం తగిన మొత్తంలో నిధులందిస్తే వేరే విషయం. ఇంత వరకూ వేర్వేరు రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు అంతంతమాత్రమే. సునామీ సమయంలో 10వేల కోట్ల నష్టం జరిగితే కేంద్రం అందించిన మొత్తం రూ. 500 కోట్లు. మహారాష్ట్ర వరదలు(2005)లో నష్టం రూ. 6,000 కోట్లయితే అందిన సాయం రూ. 700 కోట్లు. ఇలా ఎప్పుడైనా కేంద్రం నుంచి అందేది తక్కువే. నష్టానికీ, అందే సాయానికీ మధ్య ఇంత అగాథం ఉంటున్నప్పుడు ఏ దేశమైనా మన తిరస్కరణను చూసి పరిహసించదా? తోటి మనుషులు ఆపదలో పడినప్పుడు అండగా నిలబడటం మానవ నైజం. ఇవాళ వాళ్లు సాయ పడితే... రేపు మన వంతు రావొచ్చు. పరస్పరం సహకరించుకోవటం, సాయం చేసుకోవటంలో కించపడ వలసిందేమీ లేదు. -
రైల్వే రెడ్‌సిగ్నల్
తిరుపతి ప్రధాన రైల్వే స్టేషనుకు రోజూ ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. తిరుమలకు వచ్చే భక్తులలో ఎక్కువమంది రైళ్ల ద్వారానే చేరుకుంటారు. దీనివల్ల స్టేషను ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంది. ఈ తాకిడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా మరో రెండు స్టేషన్లను అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ ఐదారేళ్ల క్రితం సంకల్పించింది. అయినా నేటికీ ఈ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. ఫలితంగా తిరుపతి స్టేషనులో భక్తుల కష్టాలు తీరడం లేదు. తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషనులో రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా మరో రెండు స్టేషన్లను అభివృద్ధి చేయాలన్న రైల్వే శాఖ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. నాలుగైదేళ్ల క్రితమే ప్రతిపాదనలు, నిధుల అంచనాల ప్రణాళికలు సిద్ధం చేసి చేతులు దులిపేసుకుంది. దీంతో ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. పదేళ్ల క్రితం రోజుకు 10వేల మంది కూడా ప్రయాణించేవారు కాదు. ఇప్పుడు సగటున 80 వేల నుంచి లక్షవరకు వస్తూపోతున్నారు. భారీ రద్దీ ఉన్న స్టేషన్లలో తిరుపతి ఒకటి. నిధులేవీ అమాత్యా.. రైల్వేస్టేషన్‌కు తూర్పు దిక్కులోని తిరుచానూరు స్టేషన్‌ను కొత్త టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. కానీ ఇప్పుడీ కొత్త టెర్మినల్ పనులు అటకెక్కినట్లేనని రైల్వే వర్గాలే చెబు తున్నాయి. ఇంజినీరింగ్ అధికారుల ఉదాసీన నివేదికలు, డివిజన్లోని కొందరు తమదైన కమీషన్ల పర్వానికి తెరలేపడం ఇందుకు కారణంగా నిలుస్తోంది. 2016 బడ్జెట్లో ఈ టెర్మినల్ అభివృద్ధికి రైల్వేశాఖ చాలీ చాలని నిధులను విదిల్చింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు పలు పర్యాయాలు వచ్చినప్పుడు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పినా ఆచరణలో నెరవేరలేదు. ఆదిలోనే హంసపాదు పడేందుకు టీడీపీకి చెందిన టీటీడీ మాజీ చైర్మన్ స్వలాభ ఆలోచనలు తోడయ్యాయి. ఆయన తొందరపాటు ఒత్తిళ్ల వల్ల టెర్మినల్ పనులు ప్రారంభం కాలేదనే విమర్శ ఉంది. రైల్వే స్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ స్థాయికి అభివృద్ధి చేసేందుకు తగిన∙స్థలం లేదు. రైల్వే మంత్రిత్వ శాఖ, బోర్డు అత్యున్నతాధికారులు ప్రత్యామ్నాయ ప్రాంతా ల్లోనే అభివృద్ధి శరణ్యమని గుర్తించారు. ఇందుకోసం తిరుపతి వెస్ట్, తిరుచానూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లను వివిధ దశల్లో పరిశీలించారు. అందులో భాగంగానే తిరుచానూరుకు ముందుగా రూ.10కోట్లు మంజూరు చేసింది. కానీ ఈ నిధులు ఎటూ చాలవు. దీంతో కొత్త నిర్మాణానికి అడ్డుకట్ట పడింది. ఏడాది క్రితమే ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు ఢిల్లీకి పంపారు. రూ.10 కోట్ల బడ్జెట్‌కు అదనంగా మరో రూ.25 కోట్లు అవసరమవుతాయని అంచనాలు రూపొందించారు. అయినా పాత నిధులు రాలేదు. కొత్త నిధులకు మోక్షంలేదు. దీంతో టెర్మినల్ పనులు ముందుకు సాగడం లేదు. పత్తాలేని ‘పడమర’ అభివృద్ధి... మరో ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖ పడమర స్టేషన్‌ను ప్రతిపాదించింది. పశ్చిమాన 52 ఎకరాలతో పాటు 18 ఎకరాల ప్రైవేటు స్థలముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగేళ్ల క్రితం రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, అప్పటి జీఎం వెస్ట్‌పై ఆసక్తి చూపిం చారు. డిజైనింగ్‌లు, అంచనాల ప్రతిపాదనలు తయారు చేశారు. నిర్మాణాలు చేపట్టేందుకు ప్రైవేటు ఏజెన్సీలను గుర్తించారు. కానీ ప్రస్తుత స్టేషన్ పరిసర ప్రాంతాల హోటళ్ల నిర్వాహకులు, ఇతర వాణిజ్య సముదాయాల వారు రైల్వే బోర్డుపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా వెస్ట్ పనులకు బ్రేకు పడింది. ఈ దశలో కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. వెస్ట్ స్టేషన్ పనులూ నిలిచిపోయాయి. రాజకీయ పరంగా కేంద్రంపై సరైన ఒత్తిడి తెస్తే తప్ప ఈ రెండు స్టేషన్లకు కదలిక ఉండదని ప్రయాణికులంటున్నారు. ఈ మేరకు అధికారుల్లో కదిలిక వస్తుందో లేదో చూడాల్సి ఉంది. -
అమరులకు నివాళి: 2 నిమిషాలు రెడ్‌సిగ్నల్
హైదరాబాద్: నగర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్ కూడళ్ల వద్ద 11 గంటలకు రెడ్ సిగ్నల్ పడింది. రెండు నిమిషాల పాటు ఇది కొనసాగింది. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా అమరవీరులకు శనివారం దేశవ్యాప్తంగా నివాళులర్పిచారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో అమరులకు నివాళులు అర్పించారు. జంట నగరాల్లో ప్రతి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద 2 నిమిషాల పాటు రెడ్ సిగ్నల్ ను వేసి ట్రాఫిక్‌ను నిలిపి వేశారు. కాగా అమరవీరులకు నివాళిగా దేశవ్యాప్తంగా ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాలు మౌనం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి రెడ్ సిగ్నల్
విశాఖపట్నం: విశాఖ జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ నిర్మించ తలపెట్టిన విద్యుత్ ప్లాంట్‌కు పర్యావరణ శాఖ అనుమతి నిరాకరించింది. తీర ప్రాంతానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నందున సునామి తాకే ప్రమాదం ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక సమర్పించింది. పర్యావరణ పరంగా కూడా అనుకూలం కాదని పర్యావరణ అడవుల శాఖ హెచ్చరించింది. పూడిమడక వద్ద విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తే చిన్న నీటి వనరుల అనుసంధానం ప్రక్రియ దెబ్బతింటుందని పర్యావరణ శాఖ ఈ నివేదికలో పేర్కొంది. ఇప్పటికే 33 సంవత్సరాల లీజు ప్రాతిపదికన 1200 హెక్టార్ల భూమిని రాష్ట్రప్రభుత్వం ఈ ప్లాంటుకు కేటాయించింది. పూడిమడకలో 4వేల మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. -
రైల్వే ప్రాజెక్టులకు రెడ్ సిగ్నల్!
కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ, ఏపీకి ప్రత్యేక జోన్ లేనట్టే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ప్రకటించిన తాయిలాలు ఒక్కొక్కటిగా ఎండమావిలా తేలిపోతున్నాయి. ప్రజాగ్రహాన్ని చల్లార్చే క్రమంలో వాటిని పైపూతగా చెప్పారే తప్ప.. హామీలేవీ ఆచరణలో అమలయ్యే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో నాటి యూపీఏ ప్రభుత్వం ఆ ప్రాంతానికి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటిం చింది. ఒక్క ఏపీకే వరాలు కురిపిస్తే తెలంగాణను విస్మరించినట్టవుతుందనే ఉద్దేశంతో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీనిచ్చింది. అయితే ఇవి వాస్తవ రూపం దాల్చే పరిస్థితులు లేనట్టేనని తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. రైల్వే జోన్, కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నాడు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. తాజాగా రైల్వే బోర్డుకు నివేదిక సమర్పించింది. దక్షిణ మధ్య రైల్వేను విభ జించి ఏపీ పరిధిలో ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆ నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలి సింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ విషయంలోనూ కమిటీ వ్యతిరేకంగా స్పందించినట్టు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటు పూర్తి కానందున కాజీపేటలో మరో ఫ్యాక్టరీ అవసరమే లేదని నివేదికలో అభిప్రాయపడ్డారు. పైగా ఇటీవలే కర్ణాటకకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరైనందున దక్షిణాదిలో మరోటి ఇవ్వటం సబబుకా దని కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. సంయుక్తంగా కాకుం డా ఏడుగురు సభ్యులు విడివిడిగా అభిప్రాయాలను బోర్డు ముం దుంచారు. అంతా దాదాపు ఒకే మాటపై ఉన్నట్టు సమాచారం. గడువుకు మిగిలింది పక్షం రోజులే..: రైల్వేజోన్, కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు నాటి యూపీఏ ప్రభుత్వం కమిటీకి ఆరు మాసాల గడువు విధించింది. అపాయింటెడ్ డే (జూన్ 2 ) నుంచి ఆరు మాసాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇదే విషయాన్ని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చింది. దాని ప్రకారం డిసెంబర్ 2తో గడువు ముగుస్తుంది. అంటే మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. నివేదిక అందిన తర్వాత మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రైల్వే వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా స్పందిస్తారా అన్నది అనుమానంగా మారింది. కొత్త మంత్రి.. కొత్త ప్రాధాన్యాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ప్రకటించిన రెండు వరాలకు సంబంధించి గత రైల్వేశాఖ మంత్రి సదానందగౌడకు సంపూర్ణ అవగాహన ఉంది. ఆయనతో పలుమార్లు అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రాంత నేతలు కలిశారు. హామీలను అమలు చేయాలని కోరారు. కమిటీ నివేదిక రాగానే దాన్ని పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. ఇప్పుడు రైల్వే శాఖకు కొత్త మంత్రి వచ్చారు. మహారాష్ట్రకు చెందిన సురేశ్‌ప్రభుకు రైల్వేశాఖ అప్పగించారు. ఆయనకు ఈ విషయం పూర్తిగా కొత్త. ఇప్పటివరకు ఆయనతో రాష్ట్ర నేతలెవరూ భేటీ కాలేదు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రెండోరోజే ఆయన జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధానితో కలిసి విదేశాలకు వెళ్లి సోమవారమే ఢిల్లీకి వచ్చారు. ఇప్పటివరకు ఈ విషయంపై అవగాహన లేని ఆయనపై ఆ కమిటీ నివేదిక ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా.. రైల్వేను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఇటీవలే మరో ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు. దేశం మొత్తానికి సంబంధించిన విషయాన్ని పర్యవేక్షించే ఆ కమిటీపైనే మోదీ దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జోన్, కోచ్ ఫ్యాక్టరీలకు ఆయన ఎంతవరకు ప్రాధాన్యమిస్తారో చూడాలి. తెలుగు వారు లేని కమిటీ... యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మొత్తం ఏడుగురు ఉన్నారు. అందులో రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు దేవేందర్ సింగ్, అలోక్‌కుమార్, విజయ్‌కుమార్‌లతో పాటు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు చెందిన విభాగాధిపతి స్థాయి అధికారులు జీసీ రే, ఎస్పీ సమంత రే, అదే కేడర్‌కు చెందిన దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నరోత్తమ్ సింగ్ ఊకే, ఎస్కే గుప్త ఉన్నారు. వీరిలో తెలుగువారు ఒక్కరూ లేరు. అంతా ఒరిస్సా, బెంగాల్, ఉత్తర భారతీయులే! విశ్వసనీయ సమాచారం మేరకు కమిటీ సభ్యుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి ప్రత్యేక రైల్వే జోన్‌పై: సాధారణంగా రైల్వేజోన్‌కు రాష్ట్రాల భౌగోళిక పరిధులతో సంబంధం ఉండదు. ప్రస్తుత దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర పరిధిలో విస్తరించి ఉంది. దేశవ్యాప్తంగా అన్ని జోన్లు ఇలాగే ఉన్నాయి. రాష్ట్రం విడిపోతే రైల్వే జోన్‌ను విడదీయటం సరికాదు. - కొత్త జోన్ పరిధిలో కొత్తగా అధికారుల వ్యవస్థ, భవనాలను సమకూర్చాల్సి ఉంటుంది. దీనివల్ల రైల్వేపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. నష్టాల్లో ఉన్న రైల్వేకు ఇది శ్రేయస్కరం కాదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై: - కాజీపేటకు నాలుగేళ్ల క్రితం మంజూరైన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ పనులు ఇప్పటివరకూ మొదలు కాలేదు. ముందుగా దాన్ని ఓ కొలిక్కి తీసుకువస్తే సరిపోతుంది. - కర్ణాటకలో కోలార్ జిల్లాకు కొత్తగా మంజూరైన కోచ్ ఫ్యాక్టరీ పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఇప్పటికే తమిళనాడులో కోచ్ ఫ్యాక్టరీ ఉంది. ఇదే సమయంలో దక్షిణాదికి మరో కోచ్ ఫ్యాక్టరీ మంజూరు తప్పుడు సంకేతాలు పంపుతుంది. పర్యటనలేవీ లేకుండానే.. సాధారణంగా ఇలాంటి కీలక విషయాల్లో కమిటీ సభ్యులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి, సంబంధీకులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కమిటీ కేవలం ఒకేఒక్కసారి రెండు రాష్ట్రాల సీఎస్‌లతో భేటీ కావటం మినహా అంతకుమించి చేసిన కసరత్తేమీ లేదు. -
రైల్వే క్రాసింగ్ ప్రమాదాలకు రెడ్ సిగ్నల్..
విశాఖపట్నం: గేట్లులేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరుగుతున్న ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇటీవల మెదక్ జిల్లాలో పాఠశాల బస్సు ప్రమాదంలో చిన్నారుల మృతి అందర్నీ కలచివేసింది. అయితే విశాఖపట్నం ఉక్కునగరంలో నివసించే టీవీ మెకానిక్ సెంగుటువన్ మాత్రం ఈ ప్రమాదాలను చూస్తూ అయ్యోపాపం అని కూర్చోవాలనుకోలేదు. తన సృజనాత్మకతతో రైల్వే క్రాసింగ్ ప్రమాదాలకు రెడ్ సిగ్నల్ వేసే పరికరాన్ని కనిపెట్టాడు. అతితక్కువ ఖర్చయే ఈ పరికరం అత్యంత సమర్థంగా పనిచేస్తుందని, ఇలాంటి పరికరం దేశంలో ఇంతకుముందెన్నడూ ఎవరూ రూపొందించలేదని చెబుతున్నాడు. ఇక ఈ పరికరం పని తీరు ఎలా ఉంటుందంటే.. పూర్తిగా సోలార్ విద్యుత్ ఆధారంగా పనిచేసే ఈ పరికరానికి పసుపు, ఎరుపు ఎల్ఈడీ బల్బులను, వాటి కింద లూపర్ను అమర్చాలి. దానిపై రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్, బ్యాటరీ ఉంటుంది. ఈ పరికరాన్ని క్రాసింగ్‌కు ఇరువైపులా రోడ్డు పక్కన స్పీడ్ బ్రేకర్ వద్ద స్తంభానికి అమర్చాలి. ఇదేవిధంగా రైలు ఇంజిన్‌పై కూడా చిన్నసైజు సోలార్ ప్యానెల్, రేడియో ట్రాన్స్‌మీటర్‌ను బ్యాటరీతో పాటు అమర్చాలి. రైలు గేటుకు చేరడానికి మూడు నిమిషాల ముందు నుంచి ఎరుపు రంగు బల్బు వెలుగుతుంది. అప్పుడు ఆపరికరం నుంచి మొదలయ్యే హెచ్చరికలు రైలు వెళ్లిన నిమిషంన్నర వరకూ కొనసాగుతాయి. ఆ తర్వాత మరో రైలు వచ్చే వరకూ పసుపురంగు బల్బు వెలుగుతూ ఉంటుంది. 17 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి వచ్చి వైజాగ్‌లో స్థిరపడ్డ సెంగుటువన్ ఇంతకు ముందు గ్యాస్‌లీక్ సెన్సర్ కూడా కనుగొన్నాడు. -
మళ్లీ హుళక్కే
సాక్షి, కాకినాడ:అంతా అనుకున్నట్టే జరిగింది. జిల్లాకు మళ్లీ రిక్తహస్తమే మిగిలింది. మన వాళ్లు కోతల రాయుళ్లే తప్ప కూతలు పెట్టించగల మొనగాళ్లు కాదన్న విషయం స్పష్టమైపోయింది. బుధవారం పార్లమెంటులో రైల్వేమంత్రి మల్లికార్జునఖర్గే ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయే మిగిలింది. మన జిల్లా మీదుగా కొత్తగా వెళ్లే సికింద్రాబాద్-విశాఖపట్నం ఏసీ ఎక్స్‌ప్రెస్ మినహా ఒరిగిందేమీ లేదు. ఇది కూడా వారానికి ఒక్కరోజే వస్తుంది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటూ మంత్రిగారు ఆర్భాటంగా ప్రకటించారే తప్ప ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు కేటాయిస్తున్నామన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. మెయిన్‌లైన్ ఊసేలేదు కాకినాడ మెయిన్‌లైన్ మళ్లీ కలగానే మిగిలిపోయింది. కాకినాడ-పిఠాపురంల మధ్య రూ.140 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 21 కిలోమీటర్ల బ్రాడ్‌గ్రేజ్ లైన్‌కు మోక్షం లభించలేదు. గతేడాది కోటి రూపాయలు కేటాయించగా, ఈ ఏడాది కేటాయింపులేమీ ప్రకటించలేదు. పట్టాలెక్కని కోనసీమ రైలు ఉభయగోదావరి జిల్లాల చిరకాల స్వప్నమైన నరసాపురం-కోటిపల్లి లైన్‌కు మాత్రం ఈసారి ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ సర్వేకు 2012 బడ్జెట్లో ఆమోదం తెలిపినా నేటి బడ్జెట్లో నిధుల జాడ లేదు. కాకినాడ రాజమండ్రిల మీదుగా హైదరాబాద్, తిరుపతిలకు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లను ఏర్పాటు చేయాలన్న ఆశ ఫలించ లేదు. కాకినాడ నుంచి ఢిల్లీకి, కోల్‌కతాకు కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. భీమవరం మీదుగా కాకినాడ- వారణాశికి కొత్త రైలు వేయాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. విజయవాడ-అమరావతి మీదుగా ప్రయాణించే గోవా ఎక్స్‌ప్రెస్ కాకినాడలో ప్రారంభమై భీమవరం మీదుగా వెళ్లేలా ఏర్పాటు చేయాలన్న ఆశ ఫలించలేదు. మొత్తమ్మీద ఖర్గే బడ్జెట్ జిల్లావాసులకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ బడ్జెట్‌పై స్పందించేందుకు జిల్లాకు చెందిన ఎంపీలు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం ఈ ప్రాంత ప్రజల ఆశలపై వారి కున్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. -
రైళ్ల ఢీకి ఇక చెక్
తాండూరు, న్యూస్‌లైన్: భారతీయ రైల్వే సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీకాస్ (ట్రెయిన్ కొలిజన్ అవైడింగ్ సిస్టం) ప్రయోగం విజయవంతమైంది. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు.. రెడ్ సిగ్నల్ పడగానే ఆటోమెటిక్‌గా ఒక్కసారిగా ఆగిపోరుుంది. కెర్నెక్స్, హైదరాబాద్ బ్యాటరీ లిమిటెడ్, మేథా కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తాండూరు-మంతట్టి (బషీరాబాద్), కుర్గుంట (కర్ణాటక), నవాంద్గీ(బషీరాబాద్) రైల్వేస్టేషన్ల పరిధిలోని నాలుగు బ్లాక్ సెక్షన్లలో బుధవారం ఈ ప్రయోగాన్ని పరిశీలించారు. రైల్వే బోర్డు ఎలక్ట్రికల్ మెంబర్ కుల్‌భూషణ్, రైల్వే జీఎం శ్రీవాస్తవ్ తదితరులు రైలులో ప్రయాణించి టీకాస్‌తో అందుబాటులోకి రానున్న 35 రకాల ఫీచర్లను పరిశీలించారు. అనంతరం తాండూరు రైల్వేస్టేషన్లో కుల్‌భూషణ్ విలేకరులతో మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశాలు అవులుచేస్తున్న ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ (ఏటీపీ), యూరోపియన్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టం(ఈటీసీఎస్) టెక్నాలజీల కంటే టీకాస్ వురింత మెరుగ్గా పనిచేస్తుందని చెప్పారు. ఏటీపీ,ఈటీసీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక కిలోమీటర్ పరిధిలో అవులుచేయూలంటే రూ.10-12 లక్షలు అవుతుందన్నారు.