రైళ్ల ఢీకి ఇక చెక్ | Now Railway accidents to be stopped by Train Collision avoiding System | Sakshi
Sakshi News home page

రైళ్ల ఢీకి ఇక చెక్

Published Thu, Jan 30 2014 2:24 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Now Railway accidents to be stopped by Train Collision avoiding System

తాండూరు, న్యూస్‌లైన్: భారతీయ రైల్వే సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీకాస్ (ట్రెయిన్ కొలిజన్ అవైడింగ్ సిస్టం) ప్రయోగం విజయవంతమైంది. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు.. రెడ్ సిగ్నల్ పడగానే ఆటోమెటిక్‌గా ఒక్కసారిగా ఆగిపోరుుంది. కెర్నెక్స్, హైదరాబాద్ బ్యాటరీ లిమిటెడ్, మేథా కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తాండూరు-మంతట్టి (బషీరాబాద్), కుర్‌గుంట (కర్ణాటక), నవాంద్గీ(బషీరాబాద్) రైల్వేస్టేషన్‌ల పరిధిలోని నాలుగు బ్లాక్ సెక్షన్లలో బుధవారం ఈ ప్రయోగాన్ని పరిశీలించారు. రైల్వే బోర్డు ఎలక్ట్రికల్ మెంబర్ కుల్‌భూషణ్, రైల్వే జీఎం శ్రీవాస్తవ్ తదితరులు రైలులో ప్రయాణించి టీకాస్‌తో అందుబాటులోకి రానున్న 35 రకాల ఫీచర్లను పరిశీలించారు.
 
 అనంతరం తాండూరు రైల్వేస్టేషన్‌లో కుల్‌భూషణ్ విలేకరులతో మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశాలు అవులుచేస్తున్న ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ (ఏటీపీ), యూరోపియన్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టం(ఈటీసీఎస్) టెక్నాలజీల కంటే టీకాస్ వురింత మెరుగ్గా పనిచేస్తుందని చెప్పారు. ఏటీపీ,ఈటీసీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక కిలోమీటర్ పరిధిలో అవులుచేయూలంటే రూ.10-12 లక్షలు అవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement