నగర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్ కూడళ్ల వద్ద 11 గంటలకు రెడ్ సిగ్నల్ పడనుంది.
హైదరాబాద్: నగర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్ కూడళ్ల వద్ద 11 గంటలకు రెడ్ సిగ్నల్ పడింది. రెండు నిమిషాల పాటు ఇది కొనసాగింది. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా అమరవీరులకు శనివారం దేశవ్యాప్తంగా నివాళులర్పిచారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో అమరులకు నివాళులు అర్పించారు. జంట నగరాల్లో ప్రతి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద 2 నిమిషాల పాటు రెడ్ సిగ్నల్ ను వేసి ట్రాఫిక్‌ను నిలిపి వేశారు. కాగా అమరవీరులకు నివాళిగా దేశవ్యాప్తంగా ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాలు మౌనం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.