ఓటర్ల నమోదులో జాగ్రత్త : కలెక్టర్ | Register voters care: Collector | Sakshi
Sakshi News home page

ఓటర్ల నమోదులో జాగ్రత్త : కలెక్టర్

Published Fri, Jan 3 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

Register voters care: Collector

పెనమలూరు, న్యూస్‌లైన్ : కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు గురువారం పెనమలూరు తహశీల్దార్  కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఓటర్ల నమోదు, వాటి సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓట్ల నమోదుకు ఎన్ని దరఖాస్తులు  అందాయని ప్రశ్నించారు.   మొత్తం 15,852 దరఖాస్తులు అందాయని డీటీ ఇస్మాయిల్  తెలి పారు. కలెక్టర్ స్వయంగా కంప్యూటర్ వద్ద ఉండి  డేటా నమోదు వివరాలు తెలుసుకున్నారు.

ఓట్ల  తొలగింపు, దరఖాస్తుల  తిరస్కరణ కు కారణాలు  తదితర విషయాలపై ఆయా గ్రామాల వీఆర్వోల వద్ద ఉన్న రికార్డులు తెప్పించి పరిశీలించారు. ఓటు దరఖాస్తులు తిరస్కరించిన  కారణాలను దరఖాస్తు దారుడికి తెలపాలని ఆదేశించారు. కంకిపాడు,ఉయ్యూరు మండలాలకు సంబంధించి డేటా నమోదు బాధ్యతను నియోజకవర్గ కేంద్రంగా ఉన్న పెనమలూరు అధికారులే పర్యవేక్షించాలని ఆదేశించారు. డేటా ఎంట్రీకి సంబంధించి సైట్ సక్రమంగా ఓపెన్  కావడం లేదని ఫిర్యాదులందుతున్నాయన్నారు.  

సైట్ ఓపెన్ అవుతుందో లే దో   స్వయంగా కంప్యూటర్ వద్దే చాలా సమయం ఉండి పరిశీలించారు. ఈ విషయంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.  ఎంపీడీవో జుజ్జవరపు సునీతను పిలిపించి పలు పథకాల కింద లభ్థిదారులకు రుణాల అమలు  ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు. వెంటనే గ్రౌండ్ చేయాలని ఆదేశించారు. తహశీల్థార్ విజయకుమార్, డీటీ సురేష్‌కుమార్,ఆర్‌ఐలు సలీం, భవానీ పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement