ప్రేమించలేదని యువతి కిడ్నాప్ | Rejected in love,woman kidnapped in chittoor district | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని యువతి కిడ్నాప్

Published Sat, Nov 23 2013 10:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

ప్రేమించలేదని యువతి కిడ్నాప్

ప్రేమించలేదని యువతి కిడ్నాప్

'స్నేహితులతో కలసి అంబులెన్స్‌లో తీసుకెళ్లిన వైనం
 'బంగారుపాళెంలో చోటుచేసుకున్న ఘటన
 ' కిడ్నాప్‌ను పలమనేరులో ఛేదించిన పోలీసులు

 
పలమనేరు, న్యూస్‌లైన్: ప్రేమించలేదని యువతిని కిడ్నా ప్ చేసిన ఘటన శుక్రవారం పలమనేరులో వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పలమనేరు అర్బన్ సీఐ బాలయ్య కథనం మేరకు.. బంగారుపాళెంలోని జెండా వీధికి చాంద్‌బాషా కొన్ని ప్రయివేటు అంబులెన్స్‌లను నిర్వహిస్తూ, డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి ముందు ఉన్న యువతి(23)ని ప్రేమించాడు. ఇతనికి పెళ్లై పిల్లలూ ఉం డడంతో ఆమె అతని ప్రేమను అంగీకరించలేదు.

ఇదిలావుండగా ఆ యువతికి ఇటీవలే పెద్దలు వేరొకరితో పెళ్లిచేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న చాంద్‌బాషా శుక్రవారం ఉదయం ఆమె తన ఇంటి నుంచి పాఠశాల సమీపంలో వెళ్తుండగా తన స్నేహితులు సలీమ్, సన్నులతో కలిసి అంబులెన్స్‌లో బలవంతంగా ఎక్కించుకుని పరారయ్యేందుకు సన్నద్ధమయ్యాడు. ఆ యువతి కేకలు విన్న స్థానికులు బంగారుపాళెం పోలీసులకు సమాచా రం అందించారు.

ఇంతలో చాంద్‌బాషా అంబులెన్స్‌ను పలమనేరు వైపు మళ్లించాడు. స్థానిక పోలీసులూ ఆ వాహనాన్ని వెంబడిస్తూ పలమనేరు పోలీసులకు సమాచారం అందించారు. పలమనేరు అర్బన్ సీఐ బాలయ్య  తన సిబ్బందిని అప్రమత్తం చేసి పట్టణంలో ని ప్రధాన రహదారుల్లో నిఘా పెట్టారు. గంటావూరు, రంగబాబు సర్కిల్ ప్రాం తాల వైపు అంబులెన్స్ వస్తుందని ఊ హించారు. అదే ప్రాంతానికి రెండు అం బులెన్స్‌లు రావడంతో వాటిని వెంబ డించారు. ఆ రెండు వాహనాల్లో రోగు లు ఉండడంతో వెనుదిరిగారు.

ఈ నేపథ్యంలో పట్టణ పొలిమేర్లలోని గాంధీనగర్ మీదుగా ఓ అంబులెన్స్ వస్తోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు వాహనాలు కాకాతోపు ప్రాంతానికి చేరాయి. అక్కడ సుమారు గంట పాటు సినిమా షూటింగ్‌ను తలపించేలా అంబులెన్స్‌ను చేజ్ చేశారు. స్థానికులూ ద్విచక్రవాహనాలపై అంబులెన్స్‌ను వెంబడించారు. ఎట్టకేల కు పట్టణ సమీపంలోని చిన్నూరు రోడ్డు వద్ద అంబులెన్స్‌ను పోలీసులు పట్టుకున్నారు.

అప్పటికే ఆ వాహనంలో నుంచి సన్ను దూకి పరారయ్యాడు. అందులో ఉన్న చాంద్‌బాషా, సలీమ్, కిడ్నాప్‌నకు గురైన యువతిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఇంతలో బంగారుపాళెం నుంచి వచ్చిన బాధితురాలి బంధువులు స్టేషన్‌కు చేరుకున్నారు. కిడ్నాప్ ఘటన బంగారుపాళెంలో జరిగింది కాబట్టి నిందితులను అక్కడి పోలీసులకు అప్పగించి కేసు నమోదు అక్కడే చేయిస్తున్నట్లు సీఐ తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement