కళాక్షేత్రం (కడప కల్చరల్): సర్వమతాల సారం ఒక్కటేనని జిల్లా క లెక్టర్ కేవీ రమణ పేర్కొన్నారు. క్రైస్తవ మైనార్టీ ఆర్థిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ మంగళ వారం కడప నగరం వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో హైటి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దైవంపై విశ్వాసం గల వారికి భయమన్నదే ఉండదన్నారు. నేడు త్యాగాలుండాల్సిన చోట స్వార్థం చోటు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మనమంతా ఒకరి కోసం ఒకరున్నట్లు జీవించాలని, సత్యానిదే అంతిమ విజయమన్నారు. సీఎస్‌ఐ రాయలసీమ డయాసిస్ బిషప్ బిడి ప్రసాద్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటే లోకానికి వెలుగునిచ్చే పండుగ అని, మానవీయ విలువలు ప్రపంచమంతా విలసిల్లేందుకు క్రీస్తు జీవితాన్ని ఆర్పించారని, ఆయనను లోకంలోని ప్రజలంతా ప్రేమించారని తెలిపారు. సీఎస్‌ఐ నంద్యాల బిషప్ స్వర్ణలత మాట్లాడుతూ క్రైస్తవం ఒక మతం కాదని, ఉత్తమ మానవ జీవన విధానమని తెలిపారు. కృపా పరిచర్యలు దైవసేవకులు బ్రదర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ క్రీస్తు ప్రేమకు ప్రతి రూపమని, మానవుల్లో భయం పోగొట్టడానికే దేవుడు మానవ జన్మలో అవత రించారని తెలిపారు.
ఈ సందర్భంగా క్రి స్మస్ ట్రీని ఏజేసీ సుబ్బారెడ్డి వెలిగించగా, క్రిస్మస్ కేక్‌ను కలెక్టర్ కట్ చే సి అతిధులకు అందజేశారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో సులోచన, ఫాస్టర్ బెన్ హర్‌బాబు, కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు ఎంపీ సురేష్, బిషప్ సామ్యేల్‌బాబు తదితరులు కలెక్టర్‌తో కలిసి కొవ్వొత్తులు వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులు కలెక్టర్‌తో పాటు అతిధులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రార్థనా గీతాలను ఆలపించారు.
సర్వమత సారం ఒక్కటే!
Published Wed, Dec 24 2014 2:45 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
Advertisement