సాక్షి, కడప : గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంపుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా దీనిని ప్రకటించారు. గత నెల 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం చేసిన వెంటనే పింఛన్ల పెంపునకు సంబంధించి తొలి సంతకం చేశారు. జూన్ నెల నుంచి పింఛన్ మొత్తాన్ని పెంపుదల చేస్తూ జూలై నెల నుంచి వర్తింపజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ పి.రాజాబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8న పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పం చాయతీల్లో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహించి సామాజక పింఛన్లు ఇవ్వాలని సూ చిం చారు. ఈ ప్రకారం జిల్లాలో 3,01,691 మంది సా మాజిక పింఛన్‌దారులకు పెరిగిన మొత్తం ఇవ్వనున్నారు. వితంతువులకు, వృద్ధాప్య, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, ఏఆర్‌టీ తదితరులకు రూ.2250 చొప్పున, దివ్యాంగులకు రూ.3వేలు, డయాలసిస్ బాధితులకు రూ.10వేలు చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment