విశాఖపట్నం: పెండింగ్లో ఉన్న 92 ప్రాజెక్ట్లపై చర్చించడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో గురువారం సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, 2 రోజులుగా యూనివర్సిటీలోనే ప్రభుత్వం నియమించిన కమిటీ ఉండి ఆధారాలు సేకరించే పనిలో ఉందన్నారు. యూనివర్సిటీల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. హాస్టళ్లలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు అమలు పరిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. హాస్టళ్లలో ఉన్న ఔటర్స్ను నిరోధించేందుకు చర్యలు చేపడుతామన్నారు.