Ganta srinivas
-
గంటా శ్రీనివాస్ బంధువుల ఆస్తులు వేలం
-
గంటా సీక్రెట్ మీటింగ్ టీడీపీకి భారీ షాక్
-
‘గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకోం’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్ధితి లేదని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. గెలిచిన తర్వాత ప్రజలను మరిచిపోవడం గంటాకు అలవాటని, ఒకసారి గెలిచిన చోట మరల ఎన్నికల్లో పోటీ చేయరని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ ఉత్తరనియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో ఆదివారం సీతమ్మధార, బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని పార్టీ కార్యాలయంలో నాయిబ్రహ్మణులకు, కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ( ‘అధికారం కోల్పోయినా.. సీఎం అనే భ్రమలోనే..’) ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ‘గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకుంటున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలే. ఆయనను పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు. కేకే రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారు. మీరు గెలిపించిన గంటా మీకు అందుబాటులో లేకుండా ఉన్నారు. గెలిచిన గంటా ఎక్కడున్నారో తెలియదు... అదే ఓడిపోయిన కేకే రాజు మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.74కోట్ల స్వాహాకు టీడీపీ తిమింగలాల స్కెచ్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో జరిగిన అవినీతి విచ్చలవిడిగా సాగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేశ్, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పటి సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఎస్పీడీ (స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్) జి. శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు వర్ట్యువల్, డిజిటల్ తరగతుల ఏర్పాటు పేరిట రూ.74 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారు. భారీగా ముడుపులు దండుకునేందుకు రూ.2లక్షల నుంచి 2.5 లక్షలలోపు విలువ చేసే ఒక్కో యూనిట్ పరికరాలను రూ.6.19 లక్షలకు పైగా పెంచేసి ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టేలా పథకం పన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల ముందు ఈ తతంగాన్ని నడిపించారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్ల పంపిణీ పేరిట రూ.45 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులకు గండిపడేలా ప్రైవేటు సంస్థలకు ఆర్డర్లు ఇచ్చిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి మర్చిపోకముందే మరో బాగోతం బయటపడింది. రూ.50 కోట్లలోపు పరికరాలకు రూ.124 కోట్ల రేటు కాగా, బూట్ల దోపిడీని తలదన్నేలా ప్రభుత్వ పెద్దలు వరŠుచ్యవల్, డిజిటల్ తరగతుల పేరిట మరో భారీ అవినీతికి తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండువేల ప్రభుత్వ స్కూళ్లలో ఈ తరగతుల ఏర్పాటు పేరుతో పెద్ద స్కెచ్చే వేశారు. ఒక్కో యూనిట్ కేవలం రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల మేర మాత్రమే విలువ చేసే ఈ పరికరాల ఏర్పాటుకు రేటును మూడు రెట్ల మేర రూ.6.19లక్షలకు అమాంతం పెంచేసి సెల్కాన్ ఇంప్లెక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీగా ముడుపులు దండుకుని ఆర్డర్లు ఇచ్చారు. ప్రముఖ కంపెనీల నుంచి వీటిని తీసుకున్నా అంతకూడా కాదని.. పైగా అది సెల్కాన్ కంపెనీ కాబట్టి పరికరాలు ఇంకా తక్కువ ధరే ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే.. మొత్తం రూ.50కోట్లలోపే విలువచేసే పరికరాలకు దాదాపు రూ.124కోట్లు చెల్లిస్తున్నారు. కాగా, మెలూహ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ద్వారా ఈ కథను నడిపించారు. పనిచేయని పరికరాలు ఇదిలా ఉంటే.. 90 రోజుల్లోగా వీటిని ఏర్పాటుచేయించాలని ఒప్పందంలో షరతు విధించారు. కానీ, గడువు ముగిసినా కేవలం 780 స్కూళ్లకు మాత్రమే అందించారు. ప్రస్తుతం ఈ పరికరాలు పనిచేయకపోవడంతో అవన్నీ వృధాగా పడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. అవినీతి రహిత పాలన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఈ డిజిటల్ పరికరాల బాగోతం వెలుగుచూసింది. దీంతో ఈ ఆర్డర్‌ను నిలిపివేయాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీగా బాధ్యతలు స్వీకరించిన వాడ్రేవు చినవీరభద్రుడు జులై 4న ఆదేశాలిచ్చారు. ఇది పసిగట్టిన టీడీపీ పెద్దలు రద్దు ఉత్తర్వులు రాకముందే సెల్కాన్, మెలూహ కంపెనీల ద్వారా హడావుడిగా మిగిలిన స్కూళ్లకు కూడా డిజిటల్ పరికరాలను ఆఘమేఘాల మీద డంప్ చేయించారు. పరికరాలు పంపిణీ పూర్తయినందున రూ.124 కోట్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో సర్వశిక్ష అభియాన్ దీనిపై నివేదికను ఇటీవల ప్రభుత్వానికి పంపింది. నిధుల కేటాయింపు లేకుండానే ఆర్డర్ నిజానికి వర్ట్యువల్, డిజిటల్ పరికరాల పంపిణీ ఒప్పందం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని స్పష్టమవుతోంది. ఎస్ఎస్ఏ ద్వారా ఏ పని చేపట్టాలన్నా అందుకు సంబంధించి ఆ సంస్థ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) నివేదికలో పొందుపరిచి ఉండాలి. కానీ, అలా జరగకపోవడమే కాక నిధుల కేటాయింపు కూడా లేకుండానే పంపిణీ ఆర్డర్ ఇచ్చేశారు. ఈ పరికరాల రేటు కూడా నిబంధనల ప్రకారం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాక.. పేద పిల్లలకు వినియోగించాల్సిన ఇతర కార్యక్రమాల నిధులనూ దీనికోసం దారిమళ్లించేలా అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఎస్ఎస్ఏ ఎస్పీడీ చేసినట్లు సమాచారం. చంద్రబాబు అధికారంలోకి రాగానే.. కాగా, 2014లో చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఈ సంస్థ ఏర్పాటైంది. ఇది లోకేశ్‌కు బినామీ కంపెనీ అన్న ఆరోపణలున్నాయి. ఈ సంస్థకు డిజిటల్, వర్ట్యువల్ తరగతుల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అనుభవమూ, సాంకేతిక పరిజ్ఞానమూ లేదు. దీంతో సెల్కాన్ ఇంప్లెక్స్ సంస్థను ముందు పెట్టి ఈ కంపెనీతో ఒప్పందాన్ని చేయించారు. రెండువేల స్కూళ్లలో ఈ డిజిటల్ తరగతుల పరికరాల ఏర్పాటు ఆర్డర్‌ను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ఒకరోజు ముందు మార్చి 9న అప్పటి ఎస్ఎస్ఏ ఎస్పీడీ జి. శ్రీనివాస్ ఇచ్చారు. -
గంటాను భీమిలి నుంచి తప్పించేందుకు స్కెచ్
-
విజయనగరం జిల్లా టీడీపీలో కుమ్ములాటలు
-
మంత్రి అయ్యన్నకు చేదు అనుభవం
అమరావతి: ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ప్రారంభోత్సవంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడుకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసు సిబ్బంది లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. మంత్రిననే విషయం ఆయనే స్వయంగా చెప్పినా బారికేడ్లు తొలగించేందుకు నిరాకరించారు. దీంతో ఆయన ఆగ్రహంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ...రాజకీయ నాయకులకు అవమానాలు, గౌరవాలు సహజమేనన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ కోన శశిధర్ ...మంత్రి అయ్యన్నకు ఫోన్ చేశారు. తిరిగి కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రిని కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. అయ్యన్నతోపాటు పలువురు అతిథులను.. ప్రముఖులను కూడా లోపలికి వెళ్లకుండా గుంటూరు పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావే ఇలా చేయించారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు. విశాఖ భూ కబ్జాల వ్యవహారంలో మంత్రులు గంటా, అయ్యన్న మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. -
పాఠ్యాంశంగా గౌతు లచ్చన్న జీవితం?
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ.. పీడిత జన పక్షపాతి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని పాఠశాలల పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కోర్టు సమీపంలో బీసీ యువజన సంఘం నిర్వహించిన గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో మంత్రి గంటా మాట్లాడారు. లచ్చన్న లాంటి మహోన్నత వ్యక్తిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకవి వంగపండు ప్రసాదరావు విప్లవ గీతాలను ఆలపించారు. -
'రిషితేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది'
విశాఖపట్నం: పెండింగ్‌లో ఉన్న 92 ప్రాజెక్ట్‌లపై చర్చించడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో గురువారం సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, 2 రోజులుగా యూనివర్సిటీలోనే ప్రభుత్వం నియమించిన కమిటీ ఉండి ఆధారాలు సేకరించే పనిలో ఉందన్నారు. యూనివర్సిటీల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. హాస్టళ్లలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు అమలు పరిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. హాస్టళ్లలో ఉన్న ఔటర్స్ను నిరోధించేందుకు చర్యలు చేపడుతామన్నారు. -
భూ సంతర్పణ
-
టి బిల్లు చర్చ గడువు ఇంకా పెంచాల్సిందే: గంటా
-
వరద ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పసుపులేటి బాలరాజు, ఎమ్మెల్యేలు ఆదివారం పర్యటించారు. చోడవరం మండలం పీఎస్‌పేటలో పర్యటించినప్పుడు రైతులు నిలదీశారు. పరిశీలించి వెళ్లడం తప్ప సమస్యను పరిష్కరించడం లేదంటూ మంత్రుల కాన్వాయ్‌ను రైతులు, మహిళలు అడ్డుకున్నారు. ఎంతకీ రైతులు కదలకపోయేసరికి బొత్స సత్యనారాయణ కారులోంచి దిగి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆయన్ని కూడా మహిళా రైతులు నిలదీశారు. ఈ సందర్భంగా కొంతమంది బొత్సకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. అంతకు ముందు అనకాపల్లి మండలం దేవీనగర్ ప్రాంతాన్ని బ్రిడ్జిపై నుంచి మాత్రమే పరిశీలించారు. ఏటా వరదలొచ్చినా సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదని, ఏమాత్రం ఆదుకోవడం లేదని ఒక మహిళ మంత్రి గంటాను నిలదీశారు. అనంతరం ఏఎంఏఎల్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు గాజువాక, పెందుర్తిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.57వ వార్డులోని ఉప్పరకాలనీ యాతపాలెం, హరిజనకాలనీలో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. అనంతరం వడ్డపూడి పునరావాస కాలనీ, షీలానగర్ ప్రాంతాలలో పర్యటించి ముంపు ప్రభావాన్ని పరిశీలించారు. ఇదే సందర్భంలో పెందుర్తి జీవీఎంసీ కల్యాణ మండపంలో ఆశ్రయం పొందుతున్న ఏకలవ్య కాలనీ వాసులను పరామర్శించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, యూ.వి.రమణమూర్తిరాజు, అధికారులు ఉన్నారు. -
రచ్చబండపెడదామా? మంత్రి, ఎమ్మెల్యేలతో సీఎం చర్చలు
విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి ఉద్యోగులు తప్పుకున్నందువల్ల రచ్చబండ కార్యక్రమం జరిపి ప్రజాగ్రహం తగ్గిద్దామని మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సూర్య నారాయణరాజుతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పిచ్చా పాటిగా చర్చించారు. శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను బాధిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎం విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణానికి గంటన్నర సమయం ఉండడంతో వీఐపీ లాంజ్‌లోనే ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో వివిధ అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో పార్టీ పట్ల ఆగ్రహం వ్యక్తమవుతున్న విషయం ఆయన అంగీకరించారని తెలిసింది. పరిస్థితులు కుదుట పడినందువల్ల వచ్చే నెల తొలి లేదా రెండో వారంలో జిల్లాలో రచ్చబండ కార్యక్రమం పెడదామా? అని ఆయన అడిగారు. ఇందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే రచ్చబండ జరిపేస్తే మంచిదని స్పందించగా, మిగిలిన వారు మౌనంగా కూర్చున్నారని సమాచారం. రచ్చబండలో పింఛన్లు, రేషన్ కార్డులు అందించడం వల్ల ప్రజల నుంచి సమైక్యాంధ్ర సెగ ఉండదని సీఎం చెబుతూ, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆరోఖ్యరాజ్‌కు సూచించారు. సమైక్యాంధ్రకు సంబంధించి కొందరు కేంద్ర మంత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నా అసెంబ్లీ తీర్మానం అయ్యాక పార్టీ హై కమాండ్ మెత్తబడక తప్పదని ఎమ్మెల్యేలకు సీఎం ధైర్యం చెప్పినట్టు తెలిసింది. పై-లీన్ తుపాను వల్ల శారదా, తాండవ రిజర్వాయర్లకు నష్టం జరిగిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటని ఆయన ఆరా తీశారు. విశాఖ నగరానికి తాగునీటి సరఫరా ఎలా ఉందంటూ, నీటి కొరత గురించి కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతానికి తాగునీటి సమస్యేమీ లేదని అధికారులు సమాధానం ఇచ్చారని తెలిసింది. సీఎం పర్యటకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మశ్రీ హాజరు కాలేదు. కె.కోటపాడు మండలంలో సమైక్యాంధ్ర పాదయాత్రలో ఉన్నందువల్లే ఆయన సీఎం పర్యటనకు రాలేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, రమణమూర్తి రాజు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఉదయం సీఎంను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కలెక్టర్ ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సీఎంను కలిసి ఆయనకు వీడ్కోలు పలికారు.