పశ్చిమగోదావరి, తణుకు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా తణుకులో శనివారం నిర్వహించనున్న జిల్లా మహిళా సదస్సులో పాల్గొంటారని ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కారుమూరివెంకట నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మధ్యాహ్నం 2.30 గంటలకు సదస్సు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సభాస్థలి వద్ద పనులను కారుమూరి స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ ఛైర్మన్ బలగం సీతారామం, పార్టీ నాయకులు ఉన్నారు.సదస్సులో పాల్గొన్న అనంతరం ఆర్‌కే రోజా సాయంత్రం 6 గంటలకు తణుకు క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి విజయవాడ బయల్దేరి వెళతారు.
సదస్సుకు భారీగా తరలిరండి
అత్తిలి: తణుకు పట్టణంలో జరిగే జిల్లా స్థాయి మహిళా సదస్సుకు పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబీబుద్దీన్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment