తిరుమల క్రైమ్ (తిరుపతి): మాయమాటల చెప్పి కారులో ఉన్న 30 లక్షల రూపాయలను చోరీ చేసిన సంఘటన తిరుమలలో బుధవారం జరిగింది. సారంగి హోటల్‌కు చెందిన మోహన్ రూ. 30లక్షలు తీసుకుని తిరుమలలోని శ్రీదేవి కాంప్లెక్స్‌కు అతని అసిస్టెంట్ భానుప్రకాష్‌తో కలిసి వచ్చాడు. భాను ప్రకాష్‌ను కారులో కూర్చోబెట్టి ఆయన శ్రీదేవి కాంప్లెక్స్‌లోకి వెళ్లాడు.
కారులో ఉన్న భాను ప్రకాష్‌ను ఓ అగంతకుడు కింద చేతి రుమాలు పడిపోయింది అందులో పది రూపాయలు ఉన్నాయని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన భాను కిందికి దిగి చూస్తుండగానే కారులోని 30లక్షల రూపాయలను అగంతకుడు చోరీ చేసి తీసుకెళ్లాడు. ఈ విషయంపై పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తిరుమల క్రైమ్ ఏఎస్పీతోపాటు ఐదుగురు సీఐలు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కారులో 30లక్షల చోరీ
Published Wed, Dec 30 2015 2:59 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM
Advertisement
Advertisement