
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఒక కారు చోరీకి గురైంది. దొంగతనానికి గురైంది అషామాషీ కారు కాదండోయ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారునే గురువారం దుండగులు దొచుకెళ్లారు. అత్యంత పటిష్ట భద్రత కలిగిన సెక్రటేరియట్ నుంచి దొంగలు కారును ఎత్తుకెళ్లడం అందరికీ విస్మయాన్ని కలిగిస్తోంది. దొంగిలించబడిన బ్లూ కలర్ వాగన్ ఆర్ కారుతో కేజ్రీవాల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. తన కారు చోరీకి గురవడంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి కారు చోరీకి గురవడంపై సెక్రటేరియట్ భద్రతాధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే సీఎం కారు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మాత్రం ప్రకటించారు.