పీకల్లోతు నష్టాల్లో నెక్ | RTC Loss in Vizianagaram | Sakshi
Sakshi News home page

పీకల్లోతు నష్టాల్లో నెక్

Published Sun, Sep 21 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

పీకల్లోతు నష్టాల్లో నెక్

పీకల్లోతు నష్టాల్లో నెక్

 విజయనగరం అర్బన్: ఆర్టీసీ విజయనగరం జోన్ పరిధిలోని నార్త్‌ఈస్ట్ కోస్ట్ (నెక్) రీజియన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుకు మూడడుగులు వెనుకకు ఆరడుగులు అన్న చందం గా తయారైంది. ప్రతీనెలా డీజిల్ ధర పెంపు విధానం, ప్రైవేటు వాహనాల జోరు వంటి పలు అంశాలు ఆయా డిపోలను పూర్తిగా నష్టాల ఊబిలోకి నెడుతున్నాయి. అదే విధం గా సర్వీసుల్లో సమయపాలన పాటించకపోవ డం, కాలం చెల్లిన బస్సులు నడపడం, కొన్ని బస్సులను రద్దు చేయడం, అద్దె బస్సుల ను తీసుకోవడం, నిర్వహ ణ వ్యయం తడిసిమోపెడవడం తదితర సమస్యలతో ఆర్టీసీ కొట్టుమిట్టాడుతోంది. నెక్ రీజియన్‌లో మొత్తం తొమ్మిది డిపోలకు కలిపి రోజుకు రూ. 49.45 లక్షల మేర నష్టం వస్తోంది. మరోవైపు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు నాలుగు నెలలుగా అందకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది.
 
 నష్టాలకు సవాలక్ష కారణాలు...
 నెక్ రీజియన్ పరిధిలోని విజయనగరం జిల్లాలో విజయనగరం, ఎస్‌కోట, సాలూరు, పార్వతీపురం డిపోలు, శ్రీకాకుళం జిల్లాలో ని శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2, పాలకొండ, పలాస, టెక్కలి డిపోలున్నాయి. ఈ డిపోల్లో 839 సర్వీసుల్లో 908 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో  213 అద్దెబస్సులున్నాయి. మిగిలిన సర్వీసులన్నింటిలో సంస్థ సొంత బస్సులు నడుస్తున్నాయి. అన్ని డిపోల్లో ఆ యా కేటగిరీల్లో మొత్తం 4,411 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపు రోజుకు 6.65 లక్షల మంది కి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నా రు. రీజయన్‌లోని అన్ని డిపోల బస్సులు కలిపి రోజు కు 2.75 లక్షల కిలోమీటర్లమేర తిరుగుతున్నాయి. కనీసం 5 కిలోమీటర్లకు ఒక లీటరు చొప్పున తీసుకున్నా  రోజుకు సుమారు 55 వేల లీటర్ల డీజిల్ విని యోగమవుతోంది.
 
 తాజాగా ఉన్న లీటరుకు రూ.60 ధర వేసుకున్నా డీజిల్ కొనుగోలు కోసం రోజుకు సుమారు రూ.33 కోట్ల వరకూ వెచ్చించాలి. రోజులో నిర్వహించిన సర్వీసులల్లో కిలోమీటరుకు దాదాపు రూ. 33 ఆదాయం రావాల్సి ఉండగా,కేవలం రూ.21 లు మాత్రమే వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు ఆయిల్ కంపెనీతో జరుపుకొన్న ఒప్పం దం మేరకు ప్రతి నెల లీటరుకు  60 పైసల ధర పెం చాల్సి ఉంది. ఈ రూపంలో నెలదాటిన ప్రతిసారీ డీజిల్ పెరగడం మూలంగా ఏడాదికి సుమారు మూ డు లక్షల రూపాయలు అధనపు భారం పడుతోంది. మరోవైపు ప్రైవేటు వాహనాల  జోరు  ఆర్టీసీకి మరిం త ఇబ్బందిగా మారింది. దీంతో నెక్ పరిధిలో రోజు కు సరాసరిన రూ.49.65 లక్షలమేరకు నష్టం వస్తోంది.
 
 ప్రైవేటు వాహనాల జోరు
 నెక్ పరిధిలోని రెండు జిల్లాలో ఏప్రిల్ నెలఖరు లెక్క ల మేరకు ప్రైవేటు వాహనాలు 10,077 వరకు ఉన్నా యి. వీటిలో డీలక్స్ సర్వీసులపై ప్రభావం చూపే హైదరాబాద్, విజయవాడ వంటి  దూరప్రాంతాల రాకపోకలు సాగించే బస్సులు 10 వరకు మాత్రమే ఉ న్నాయి. కానీ  పల్లెవెలుగు బస్సులపై రూట్లలో తిరిగే  మాక్సీ క్యాబ్స్, జీపులు 2,260 వరకు ఉన్నాయి. అదే విధంగా ఆటోలు అత్యధికంగా 7,809 వరకు ఉన్నా యి. ప్రైవేటు వాహనాలు డిపోలు, బస్టాండ్‌ల ముం దుకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నా ఆర్టీసీ అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు వాహనాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
 
 అకారణంగా బస్సు సర్వీసుల రద్దు
 సరిపడా ప్రయాణికులు ఉండడం లేదని, అవసరం మేరకు డ్రైవర్లు, కండక్టర్లు లేరన్న సాకుతో నెల రోజు ల కిందట కొన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేశారు.  నష్టాల బాటన నడుస్తున్నాయన్న సాకుతో మరికొన్ని బస్సులను రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు రూట్లలో పల్లెవెలుగు బస్సులను నపడం లేదు. ఆ మార్గాల్లో ఆటోలు, జీపులు ఎక్కువగా తిరుగుతుం డంతో ఓ.ఆర్.తగ్గిందని సాకుగా చూపిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement