రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించిన డిగ్రీ(బీఏ,బీకాం, బిఎస్సీ,బీబీఎం, బీసీఏ) కోర్సుల...
కర్నూలు(జిల్లా పరిషత్): రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించిన డిగ్రీ(బీఏ,బీకాం, బిఎస్సీ,బీబీఎం, బీసీఏ) కోర్సుల ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర పరీక్ష ఫలితాలను సోమవారం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వై. నరసింహులు తన ఛాంబర్‌లో విడుదల చేశారు. ఫలితాల వివరాలను ఆయన వెల్లడించారు. మొత్తంగా అమ్మాయిలే పై చేయని, వారే టాపర్లుగా నిలిచారని ఆయన వివరించారు. స్పాట్ వాల్యుయేషన్ ముగించిన మూడు రోజుల్లోపే తక్కువ సమయంలో ఫలితాలను విడుదల చేసిన డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ ఎన్‌టికె నాయక్, పరీక్షల విభాగ సిబ్బందిని ఆయన అభినందించారు.
ప్రొఫెసర్ ఎన్‌టికె నాయక్ మాట్లాడుతూ ఈ ఫలితాలను, రీ వాల్యుయేషన్‌కు సంబంధించిన వివరాలను, ఇన్‌స్టంట్ ఎగ్జామినేషన్‌కు సంబంధించిన వివరాలను www.rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ మార్కుల జాబితాను ఆయా కళాశాలలకు పంపిస్తామని తెలిపారు. ఇన్‌స్టంట్ పరీక్షల కోసం మే 10వ తేదీలోపు అపరాధ రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్‌యూ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఐఈ చక్రవర్తి, పరీక్షల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
ప్రథమ సంవత్సరంలో...
బీఏ, బీబీఎం, బీసీఏ, బీకాం, బిఎస్సీ, బీఏ(ఓఎల్) కోర్సుల్లో మొత్తం 14,215 మంది విద్యార్థులకు 7760 మంది(54.59శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఇందులో బాలురు 8,709 మందికి గాను 4,068(46.71శాతం) మంది, బాలికల్లో 5,506 మందికి గాను 3,692(67.05శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు.
ద్వితీయ సంవత్సరంలో...
ద్వితీయ సంవత్సరంలో 11,679 మంది విద్యార్థులకు గాను 6,062(51.91శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 7,385 మందికి గాను 2,986(40.43శాతం) మంది, బాలికల్లో 4,294 మందికి గాను 3,076(71.63శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ వివరించారు.
తృతీయ సంవత్సరంలో...
తృతీయ సంవత్సరంలో మొత్తం 9,687 మందికి గాను 6,24 మంది(64.97శాతం) ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలురల్లో 5,877 మందికి గాను 3,294 మంది(56.05శాతం) మంది, బాలికల్లో 3,810 మందికి గాను 3000 మంది(78.74శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు ఆయన వివరించారు.
బ్రాంచ్‌ల వారీగా టాపర్లు వీరే...
బీఏలో..వడ్డే శ్రీదేవి (వైష్ణవి కాలేజి, డోన్) 932మార్కు లు, ఎం. భాగ్యశ్రీ(కేవీఆర్ కాలేజి) 952, పీఎస్ ఆయేషాబేగం(కేవీఆర్ కాలేజి) 973, సంజపోగు సునీత(బసిరెడ్డి కాలేజి) 1011, ఎం. భాను(కేవీఆర్ కాలేజి) 1025, బి. భాగ్యశ్రీ(ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి) 1390, జి శిరీష(కేవీఆర్ కాలేజి) 869 మార్కులు సాధించారు.
బీబీఎంలో...
ఎం. అనూష(ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి) 1710 మార్కులు
బీసీఏలో...
తాడి ప్రమీల(నేషనల్ డిగ్రీ కాలేజి, నంద్యాల) 1448 మార్కులు
బీకాం కంప్యూటర్‌లో...
వి. రమ్యపావని(సెయింట్ జోసఫ్స్ కాలేజి, కర్నూలు) 1387, సి. మనస్సి(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శ్రీశైలం) 1252 మార్కులు సాధించారు.
బీఎస్సీలో...
కె. అరుణావతి(కేవీఆర్ కాలేజి)1524 మార్కులు, జె. స్రవంతి(సెయింట్ జోసఫ్ డిగ్రీ కాలేజి, కర్నూలు) 1600, స్వాతి కలింగిరి(నేషనల్ డిగ్రీకాలేజి, నంద్యాల) 1454, సి. శేషగిరి ఫణికృష్ణ(నేషనల్ డిగ్రీ కాలేజి, నంద్యాల) 1575, ఎస్. మహేశ్వరి(కేవీఆర్ డిగ్రీ కాలేజి) 1451, పి. తేజేశ్వరాచారి(నేషనల్ డిగ్రీ కళాశాల, నంద్యాల) 1650, పి. వెంకటరమణమ్మ(ఎస్‌పీవై రెడ్డి కాలేజి, నంద్యాల) 1642, జి. శ్రావణి(కేవీఆర్ డిగ్రీ కాలేజి) 1685, జి. పద్మావతి(శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల) 1679, బి. హరికుమార్(సెయింట్ జోసఫ్ డిగ్రీ కాలేజి, కర్నూలు) 1471, యు. మనోజ్ఞ రత్న(కర్నూలు డిగ్రీ కళాశాల) 1459, కె. కిరణ్‌కుమార్(శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల, కర్నూలు) 1378, కె. రాజేశ్వరి(వాసవి మహిళా కళాశాల, కర్నూలు) 1636, జి. సుజాతయాదవ్(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శ్రీశైలం)1591, డి. జ్యోతి(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నందికొట్కూరు) 1394 మార్కులు సాధించారు.
బీఏఓఎల్‌లో...
ఎస్. సామినా ఫాతిమా 1083, షేక్ నౌషద్ బేగమ్ 1066(ఇస్లామియా అరబిక్ కాలేజి, కర్నూలు) మార్కులు సాధించారు.