వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ :
మాజీ ఉప ప్రధాని, దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం దేశవ్యాప్తంగా చేపట్టిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. చిన్నారుల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నా రు. జిల్లా కేంద్రంలో చిన్నారుల స్కేటింగ్ విన్యాసం అందరినీ ఆకట్టుకొంది. నిజామాబా ద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో ఉదయం 8 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో పటేల్ పాత్ర మరువలేనిదన్నారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి, విశాల భారతాన్ని నిర్మించిన ఘనత ఆయనదే అన్నారు. నిజాం పాలకుల కబంధ హస్తాలనుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించేందుకు ఆయన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు.
రైతు బాంధవుడు
స్వాతంత్య్రానికి పూర్వం గుజరాత్ రాష్ట్రంలోని బార్డోలీ ప్రాంతంలోని వ్యవసాయ భూముల ను బ్రిటిష్ పాలకులు తమ అధీనంలోకి తీసుకొ ని రైతులను ఇబ్బందులకు గురి చేసిందని యెండల పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా వల్లభాయ్ పటేల్ ఉద్యమించారని, రైతుల కష్టాలను దూరం చేశారని కొనియాడారు. దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రం లో నిర్మిస్తున్నామన్నారు. రైతబాంధవుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్ర హ నిర్మాణంలో వ్యవసాయ పరికరాలనే వినియోగిస్తున్నామన్నారు. అందరూ సహకరించాలని కోరారు.
కలెక్టరేట్‌నుంచి..
ఐక్యత కోసం పరుగు కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైంది. బస్టాండ్, గాంధీచౌక్ మీదుగా సాగింది. గాంధీ చౌక్‌లోని మహాత్ముడి విగ్రహానికి నేతలు పూల మాలలు వేశారు. వర్ని చౌరస్తాలోని సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఏకతా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ సామగ్రిని తీసుకువెళ్లడానికి త్వరలోనే జిల్లాకు గుజరాత్ రాష్ట్రం నుంచి బాక్సులు రానున్నాయన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి ఒక వ్యవసాయ ఇనుప పరికరాన్ని, కొంత మట్టిని సేకరిస్తున్నామన్నారు. వీటితోపాటు సర్పంచ్ వివరాలు, ఫొటో సేకరించి ఆ పెట్టెలో ఉంచి గుజరాత్ పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏకతా ట్రస్ట్ జిల్లా చైర్మన్ సోమానీ, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జె.బాపురెడ్డి, సభ్యులు సీనియర్ న్యాయవాది కృపాకర్‌రెడ్డి, రాజ్‌కుమార్‌సుబేదార్, పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుల్గం మోహన్, బీజేపీ నాయకులు కాటిపల్లి సురేశ్‌రెడ్డి, జయభరత్‌రెడ్డి, జాలిగం గోపాల్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాంచారి శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఐక్యత కోసం పరుగు
Published Mon, Dec 16 2013 2:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement