Sardar Vallabhai Patel
-
మోతీ షాహీ మహల్ : ఐరన్ మ్యాన్ మెమోరియల్
మోతీ షాహీ మహల్... చారిత్రక నిర్మాణం. అహ్మదాబాద్ నగరంలో షాహీభాగ్లో ఉంది. ఇప్పుడది సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి దర్పణం. వల్లభాయ్ పటేల్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను వివరించే డిజిటల్ స్టూడియో అద్భుతం. డిజిటల్ స్టూడియో జైలు గదుల రూపంలో విభజించి ఉంటుంది. గదులకు ఉన్న ఊచలను పట్టుకుంటే ఒక్కొక్క ఘట్టం ఆడియోలో వినిపిస్తుంది. జాతీయోద్యమంలో భాగంగా పటేల్ జైలు జీవితం గడిపిన సంఘటనలతో పాటు ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో వినవచ్చు. వీటన్నింటినీ లేజర్ షోలో చూడవచ్చు. ఇక మ్యూజియంలో ఒక్కో గది ఒక్కో రకమైన వస్తువులతో అలరిస్తుంది. వర్తమానం, ఆహ్వానపత్రాలను పంపించిన ట్యూబ్‌లాంటి వెండి పెట్టెలున్నాయి. ఐరన్ మ్యాన్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేయించుకోవడానికి సిద్ధం చేసిన వెండితాపీలు లెక్కలేనన్ని ఉన్నాయి. మెమోరియల్ మ్యూజియం అంటే ఆ వ్యక్తి ఉపయోగించిన చెప్పులు, పెన్నులు, భోజనం చేసిన ప్లేట్లు, దుస్తులను మాత్రమే చూస్తుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్‌లో భారత జాతీయోద్యమం కనిపిస్తుంది. గాంధీ, నెహ్రూలతో పటేల్ కలసి ఉన్న ఫొటోలతోపాటు ఆయా సందర్భాల వివరణ కూడా ఉంటుంది. పటేల్ జీవితంలో ఉపయోగించిన వస్తువులు ఏయే సందర్భంగా ఉపయోగించారనే వివరాలు ఉండడంతో ఫ్రీడమ్ మూవ్మెంట్ క్షణక్షణమూ గుర్తుకు వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు పదిహేడేళ్ల వయసులో కొంత కాలం ఈ మహల్లో బస చేశాడు.ఇదీ చదవండి: వెళ్లిపోకు నా ప్రాణమా! బోరున విలపించిన సృజన షాజహాన్ విడిది వల్లభాయ్ పటేల్ మెమోరియల్ ఉన్న భవనం మోతీ షాహీ మహల్... మొఘలుల నిర్మాణాలను తలపిస్తుంది. ఈ షాహీ మహల్‌ని 17వ శతాబ్దంలో షాజహాన్ కట్టించాడు. షాజహాన్ యువరాజుగా ఈ ప్రదేశానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు దీనిని నిర్మించాడు, రాజ్యపర్యటనకు వచ్చినప్పుడు అతడి విడిది కూడా ఇందులోనే. ఆ తర్వాత బ్రిటిష్ ఉన్నతాధికారుల నివాసమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ భవనం రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్. గవర్నర్ నివాసానికి కొత్త భవనం కట్టిన తర్వాత 1978లో ఈ భవనాన్ని పటేల్ మొమోరియల్‌గా మార్చారు. నరేంద్రమోదీ గుజరాత్‌కి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2013లో ఈ మెమోరియల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటలైజ్ అయింది. మ్యూజియం అంతా తిరిగి చూసిన తర్వాత అదే ప్రాంగణంలో ఉన్న పటేల్ విగ్రహం దగ్గరకు వచ్చినప్పుడు ‘ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ ఇండియా’ అనే ఆత్మీయ ప్రశంసను గుర్తు చేసుకుంటూ ఓ నమస్కారం పెడతాం.ఆదివారం ఆటవిడుపుమోతీ షాహీ మహల్ చుట్టూ అందమైన గార్డెన్ మొఘలుల చార్భాగ్ నమూనాలో ఉంటుంది. దట్టమైన చెట్ల మధ్య పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి. రంగురంగుల వాటర్ఫౌంటెయిన్ పిల్లలను అలరిస్తుంది. అహ్మదాబాద్ వాసులకు వీకెండ్ పిక్నిక్ ప్లేస్ ఇది. దాదాపుగా నగరంలోని స్కూళ్లన్నీ విద్యార్థులను ఏటా ఈ మ్యూజియం సందర్శనకు తీసుకువస్తుంటాయి. అహ్మదాబాద్ పర్యటనలో మిస్ కాకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. ఈ మెమోరియల్ భవనం లోపల మాత్రమే కాదు భవనం బయట పరిసరాలను కూడా ఆస్వాదించాలి. పచ్చటి ఉద్యానవనంలోని చెట్ల కొమ్మల మీద నెమళ్లు సేదదీరుతుంటాయి. చెట్ల మధ్య విహరిస్తూ తినుబండారాలను రుచి చూడాలంటే అనుమతించరు. చాటుగా తినే ప్రయత్నం చేసినా కోతులు ఊరుకోవు. మెరుపువేగంతో వచ్చి లాక్కెళ్తాయి. మ్యూజియం పర్యటనకు అనువైన కాలం అని ప్రత్యేకంగా అక్కరలేదు, కానీ అహ్మదాబాద్‌లో పర్యటించడానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనువుగా ఉంటుంది. కాబట్టి క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్లాన్ చేసుకోవచ్చు. అహ్మదాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్‌కు దూరం ఐదు కిలోమీటర్లు మాత్రమే. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా YS జగన్ నివాళి
-
గెలిపిస్తే లైసెన్స్ ఇచ్చినట్లు కాదు..
సాక్షి, ముంబై: అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం పేరు మార్పుపై శివసేన తమ సామ్నా పత్రికలో స్పందించింది. ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే అది ఇష్టారీతిన వ్యవహరించడానికి లైసెన్స్ ఇచ్చినట్లు కాదని కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యానించింది. పటేల్ పేరును చరిత్ర నుంచి తొలగించడానికి గాంధీ–నెహ్రూ కుటుంబాలు కుట్రలు చేస్తున్నాయని గత ఐదేళ్లుగా ఆరోపణలు వస్తున్నాయని, కానీ వాస్తవంగా ఆ కుట్రలు ఎవరు చేస్తున్నారో స్టేడియం పేరు మార్పుతో ఇప్పుడు స్పష్టమైందని మండిపడింది. ఈ మేరకు శివసేనకు చెందిన పత్రిక సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. పెద్దవన్నీ గుజరాత్‌లోనే ఉండాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతోందని పేర్కొంది. అందులో తప్పు లేనప్పటికీ తాము దేశాన్ని పాలిస్తున్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని చురకలంటించింది. ఇన్నాళ్లూ ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఉండేదని, ఇప్పుడు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం పేరును మోదీ పేరుతో మార్చాక నరేంద్ర మోదీ స్టేడియమే ప్రపంచంలో పెద్దదని తెలిపింది. మోదీ గొప్ప నాయకుడే.. కానీ.. ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని, కానీ మహాత్మ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఇందిరా గాంధీల కంటే గొప్ప నాయకుడని అంధ అనుచరులు భావిస్తే అది మరో స్థాయి గుడ్డి నమ్మకం అవుతుందని పేర్కొంది. మొతేరా స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టడం ద్వారా ఆయన స్థాయిని తగ్గించారని అభిప్రాయం వ్యక్తం చేసింది. మోదీ చాలా ప్రజాదరణ గల నాయకుడని, ఆయనకు ప్రజల నుంచి మంచి మద్దతుందని రాసుకొచ్చింది. పటేల్, నెహ్రూలకు కూడా జనాల నుంచి మంచి మద్దతు లభించిందని, దాంతో వారు దేశాభివృద్ధికి పునాది వేశారని వివరించింది. ఐఐటీలు, బార్క్, భాక్రానంగల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను నెహ్రూ జాతికి అంకితం చేశారని, కానీ మోదీ పాలనలో ఏం చేశారని ప్రశ్నించింది. సర్దార్ పటేల్ పేరిట ఉన్న స్టేడియం పేరును ప్రధాని మోదీ పేరు మీదకు మార్చుకున్నారని ఎద్దేవా చేసింది. ఇప్పుడు పటేల్.. రేపు నేతాజీ.. నిన్న మొన్నటి వరకు పటేల్‌ను ప్రశంసించినవారు ఇప్పుడు స్టేడియం పేరు మార్పు విషయానికి వచ్చేసరికి వ్యతిరేకిస్తున్నారని సామ్నా పత్రిక తమ సంపాదకీయంలో దుయ్యబట్టింది. నేటి రాజకీయాల్లో పటేల్ ప్రాముఖ్యతను ఎలా తగ్గించారో, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు కూడా ఇలానే చేస్తారని మండిపడింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఛత్రపతి శివాజీ పేరును కూడా వాడుకున్నారని గుర్తుచేసింది. సర్దార్ పటేల్ తీసుకొచ్చిన ఏ పాలసీలను ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోందో చెప్పాలని ప్రశ్నించింది. రైతుల హక్కుల కోసం పటేల్ బార్దోలి సత్యాగ్రహం ముందుండి నడిపించారని, కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటని అడిగింది. బార్దోలి సత్యాగ్రహం ముగిసిన రెండేళ్ల తర్వాత కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పటేల్ తాను రైతునని ప్రకటించుకున్నారని తెలిపింది. బహుశా అందుకేనేమో.. గత నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు సర్దార్ పటేల్‌ను ప్రశంసిస్తున్నారని పేర్కొంది. బహుశా అందుకే మొతేరా క్రికెట్ స్టేడియం పేరును మార్చి పటేల్ పేరును తుడిచేద్దామని చూస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేసింది. కానీ ప్రజలు కోరుకున్నది ఇదేనని, గుజరాత్ పౌరులు ఈ మార్పును అంగీకరించారని వ్యాఖ్యానించింది. గుజరాత్ ప్రజలకు వల్లభ్‌భాయ్ పటేల్ పట్ల గౌరవం లేకపోతే, ఈ నిర్ణయాన్ని విమర్శించాల్సిన అవసరం ప్రతిపక్షాలకు కూడా లేదని అభిప్రాయపడింది. -
ఉక్కుమనిషికి ఘన నివాళి..
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్కుమనిషి, దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని నర్మదా నది తీరాన గల పటేల్ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సాంస్క్రతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీలోని ఆయన స్మారకం వద్ద రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, హోంమంత్రి అమిత్ షా నివాళి అర్పించారు. పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జాతీయ మైదానంలో అమిత్ షా సమైక్యత పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం పటేల్‌ను స్మరించుకున్నారు. ‘సంఘటితత్త్వంతోనే శాంతి, అభివృద్ధి సాధ్యమని నమ్మి 565 గణరాజ్యాలను ఒక్కటి చేసి సువిశాల భారతదేశాన్ని నిర్మించిన ఆధునిక భారతదేశ రూపశిల్పి, ఐక్య భారత నిర్మాత సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ ఉక్కు మనిషి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. -
సంకీర్ణ ప్రభుత్వాలంటే భయమేల?
సుస్థిరమైన, పూర్తి మెజారిటీ ప్రభుత్వాలు ముగిసిన తర్వాతే, దేశంలో ఆర్థిక సంస్కరణలు స్పష్టమైన రూపం తీసుకోవడం కాకతాళీయం. కాంగ్రెస్ పార్టీ పతనం తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం స్వల్పకాలం మాత్రమే మనగలగడంతో సంస్కరణల పరీక్షలో పాస్ కాలేకపోయింది. కానీ అతిపెద్ద సంస్కరణల ప్రభంజనం పీవీ నరసింహారావు అస్థిర ప్రభుత్వం ద్వారానే సాకారమైంది. తర్వాత వచ్చిన చంద్రశేఖర్, వాజపేయి ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలే అయినా నాటి, నేటి సుస్థిర ప్రభుత్వాలు కూడా చేపట్టలేని సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నాయి. అందుకే మన భవిష్యత్తుకు సుస్థిర ప్రభుత్వాలు అవసరం అంటున్న అజిత్ దోవల్ ప్రతిపాదన వాస్తవ సమ్మతం కాదు. రాబోయే పదేళ్ల కాలానికి భారత్‌కు కఠిననిర్ణయాలు తీసుకోగలిగే, సుస్థిరమైన, మెజా రిటీ ప్రభుత్వం అవసరం ఎంతైనా ఉందంటూ, ఈ గురువారం సర్దార్ పటేల్ స్మారకోపన్యాసం సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్ చేసిన వ్యక్తీకరణపై అన్యాయంగా దాడి చేస్తున్నారు. ఆయనపై ఈ రకమైన దాడి అభ్యంతరకరమైనది. జాతీయ భద్రతా సలహాదారు ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఆ పదవి రాజకీయ నియామకంతో కూడినది. కాబట్టి తన ఓటింగ్ ప్రాధాన్యతలను ఆయన దాచుకోవలసిన అవసరం లేదు. అలాంటి నిర్ణయాత్మకమైన ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ మాత్రమే అందించగలరని దోవల్ పేర్కొన్నా.. నేను ఆయనతో ఘర్షణకు దిగను. దోవల్ చేసిన రాజకీయ ప్రతిపాదనపై కాకుండా ఆయన ప్రాథమిక వాదనపైనే నేను చర్చిస్తాను. సుస్థిరమైన, బలమైన, పూర్తి మెజారిటీ కలిగిన ప్రభుత్వాలు మాత్రమే భారత్‌కు మంచి చేస్తాయని, సంకీర్ణ ప్రభుత్వాలు అస్థిరమైనవని, అయోమయంతో కూడినవని, అస్పష్టమైనవని, అనిశ్చితమైనవని, అవినీతికరమైనవని, బ్లాక్‌మెయిల్‌కి వీలు కల్పిస్తాయని అజిత్ దోవల్ మౌలిక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదన.. వాస్తవాల నిర్ధారణలో నిలబడటం లేదు. ముందుగా ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిద్దాం. ఎందుకంటే ఈ రంగంలో డేటాకు పక్షపాతం ఉండదు. మన రాజకీయ చరిత్రను రెండు సుస్థిర దశలుగా విభజించవచ్చు. ఒకటి 1952–89 కాలానికి చెందింది. ఈ 37 సంవత్సరాల్లో దేశం దాదాపుగా సుస్థిరతను చవిచూసింది. 1970ల చివర్లో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి కానీ సాధారణంగా ఒకే పార్టీ అటు కేంద్రం లోనూ, చాలా రాష్ట్రాల్లోనూ పాలన సాగించిన కాలమది. ఆ దశలో దశాబ్దాలు గడిచే కొద్దీ ప్రభుత్వాలు సుస్థిరతను సాధిం చాయి. ఒక పార్టీ నియంత్రణలో శక్తిమంతంగా అవతరించాయి. అది కూడా తిరుగులేని ఒకే కుటుంబం అంటే గాంధీల కుటుంబ యాజమాన్యంలోనే ప్రభుత్వాలు నడిచేవి. 1984–89లో లోక్‌సభలో గాంధీల పాలన దాదాపు 80 శాతం మెజారిటీని సాధించింది. ఇప్పుడు సరికొత్తగా ప్రతిపాదిస్తున్న సుస్థిరమైన, బలమైన, నిర్ణయాత్మకమైన ‘దోవల్ సిద్ధాంతం’ సరైందే అయితే, ఆ నాలుగు దశాబ్దాల కాలంలో భారత్ అత్యుత్తమ అభివృద్ధిని సాధించి ఉండాలి. కానీ వాస్తవానికి అది 3.5 శాతం కంటే తక్కువ ‘హిందూ అభివృద్ధి రేటు’నే అందివ్వగలిగింది. ఇక రెండోది అస్థిరమైన యుగం. 1989లో రాజీవ్ గాంధీ పరాజ యంతో ఇది మొదలైంది. 2014 వరకు అంటే 25 ఏళ్ల పూర్తికాలం ఈ అస్థిర పాలనా దశ కొనసాగింది. సుస్థిరమైన, పూర్తి మెజారిటీ ప్రభుత్వాలు ముగిసిన తర్వాతే, దేశంలో ఆర్థిక సంస్కరణలు స్పష్టమైన రూపం తీసుకోవడం కాకతాళీయం. కాంగ్రెస్ పార్టీ పతనం తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం స్వల్పకాలం మాత్రమే మనగలగడంతో సంస్కరణల పరీక్షలో పాస్ కాలేకపోయింది. కానీ అతిపెద్ద సంస్కరణల ప్రభంజనం పీవీ నరసింహారావు అస్థిర ప్రభుత్వం ద్వారానే సాకారమైంది. 1996లో పీవీ హయాం ముగిశాక, తదుపరి ఎనిమిదేళ్ల కాలంలో భారత్ అయిదుగురు సంకీర్ణ కూటమి ప్రధానులను, నాలుగు సార్వత్రిక ఎన్నికలను చవి చూసింది. అయిదుగురు ప్రధానులు అని అంటున్నామంటే.. దేవేగౌడ, ఎల్కే గుజ్రాల్ స్వల్పకాలిక ప్రభుత్వాలతోపాటు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా మొదట 13 రోజులపాటు తర్వాత సంవత్సరం పాటు, చివరగా పూర్తికాలం పాలన చేశారు కదా. ఇప్పుడు చూద్దాం. 1991లో మన్మోహన్ సింగ్ తర్వాత రెండవ అత్యంత సంస్కరణాత్మక బడ్జెట్ ఏదంటే 1997 నాటి పి. చిదంబరం ‘డ్రీమ్ బడ్జెట్’ అని చెప్పాలి. ఈ డ్రీమ్ బడ్జెట్లోనే పన్నులు, వడ్డీరేట్లు తగ్గించారు. ఆదాయాన్ని స్వచ్చందంగా వెల్లడించే పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ కాలంలోనే జాతీయ పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ని కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు స్టాక్ మార్కెట్లో ప్రవేశించడానికి తలుపులు తెరిచారు. తద్వారా ప్రైవేటీకరణకు నాంది పలికారు. దేవేగౌడ–గుజ్రాల్ ప్రభుత్వాలను ‘రోజు కూలీ’పై పనిచేసే ప్రభుత్వాలుగా వ్యంగ్యంగా పేర్కొనేవారు. తమాషా ఏమిటంటే మన దేశ చరిత్రలో వామపక్ష భావజాలం అధికంగా కలిగిన ప్రభుత్వాలు ఇవే మరి. మొట్టమొదటిసారిగానే కాదు.. చివరిసారిగా కూడా ఇద్దరు కమ్యూనిస్టు మంత్రులను కలిగిన కేంద్ర ప్రభుత్వాలు ఇవే. వాజ్‌పేయి స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారులను ప్రారంభించడానికి, ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలను ప్రైవేటీకరించడానికి, 11 ప్రభుత్వరంగ సంస్థలను, రెండు డజన్ల ఐటీడీసీ హోటళ్లను అమ్మేయడానికి తగిన శక్తిని కలిగి ఉండేవారు. అయితే గత నాలుగున్నర ఏళ్లలో అత్యంత శక్తివంతమైన మోదీ ప్రభుత్వం కనీసం ఒక్కటంటే ఒక్క పీఎస్‌యూని అమ్మలేకపోయింది. చివరకు ఎయిర్ ఇండియా వంటి అసమర్థ సంస్థను కూడా అది వదిలించుకోలేకపోయింది. 1989–2004 మధ్యలో సాగిన 15 ఏళ్ల అస్థిర శకంలో అతిస్పల్పకాలం మనగలిగిన ప్రభుత్వం చంద్రశేఖర్ ప్రభుత్వంగా చెప్పాలి. ఇది కేవలం నాలుగు నెలలు మాత్రమే పాలన సాగించింది. దీన్ని ‘క్యాష్ అండ్ క్యారీ’ ప్రభుత్వంగా అపహాస్యం చేసేవారు. ఎందుకంటే కేవలం 50 మంది సొంత ఎంపీలను మాత్రమే కలిగిన చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ బయటనుంచి ఇచ్చే మద్దతుపైనే ఆధారపడ్డారు. కానీ విదేశీ చెల్లింపుల సంక్షోభాన్ని అధిగమించడానికి ఈయన ప్రభుత్వమే భారత్ బంగారు నిల్వలను విదేశాలకు తరలిం చింది. సంపూర్ణ మెజారిటీ కలిగిన ప్రభుత్వం, చివరకు మోదీ ప్రభుత్వం కూడా దీనికి సాహసించేదని నేను భావించలేను. యశ్వంత్ సిన్హాను తన ఆర్థికమంత్రిగా తీసుకొచ్చిన చంద్రశేఖర్ మరోవైపు డాక్టర్ మన్మో హన్ సింగ్‌ని శక్తివంతమైన ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించారు. ఆ హోదాలో మన్మోహన్ కేబినెట్ సమావేశాలకు హాజరు కాగలిగేవారు. తదనంతర సంవత్సరాల్లో ఈ ఇద్దరే మన సంస్కరణల రూపశిల్పులుగా అవతరించారు. బలహీనమైన సంకీర్ణ కూటముల హయాంలోనే ఇది చోటుచేసుకుంది. స్థిరంగా 37 ఏళ్లపాటు మన అభివద్ధి రేటును పరిశీలిస్తే అది సగటున 3.5శాతంకు తక్కువే. తర్వాత పాతికేళ్లలో అది 5కు చేరుకుంది. ప్రస్తుతం 7కంటే ఎక్కువే నమోదవుతోంది. పాతదానికంటే రెట్టింపు అయ్యింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు స్థిరమైన ప్రభుత్వాలకు, వృద్ధిరేటుకు మధ్య గ్రాఫ్ వ్యతిరేకంగా ఉంటుంది. కానీ, జాతీయ భద్రత విషయానికి వస్తే సంకీర్ణ ప్రభుత్వాలు అసమర్థమైనవని భావిస్తారు. 1989–90 మధ్య వీపీ సింగ్ హయాంలో మినహాయిస్తే, జాతీయభద్రత విషయంలో మన ప్రభు త్వాలు బలహీనంగా ఎప్పుడూ లేవు. ఆ ప్రభుత్వంలోనూ దోవల్ పని చేశారు. పంజాబ్, కశ్మీర్‌లలో పరిస్థితులు చేయిదాటి పోతుంటే చూస్తూ ఊరుకున్నారు. తర్వాత అవకాశం వచ్చింది. తన సత్తా నిరూపించుకున్నారు. ఇంతకు ముందు నేను రాసినట్టు, పంజాబ్‌లో చంపేసిన ప్రతి ‘ఏ’ కేటగిరీ ఖలిస్తానీ చొరబాటుదారుడినీ ‘గిల్ పట్టుకున్నాడు, దోవల్ పని పట్టాడు’అనే అభివర్ణించారు. చొరబాట్లను రూపుమాపడంలో ఐబీ, పంజాబ్ పోలీస్ మధ్య అది ఓ చక్కని ఆపరేషన్. ఇదే పద్ధతిలో 1991–96మధ్య అస్తవ్యస్థంగా వున్న çకశ్మీర్‌ని అదుపులోకి తీసుకొచ్చారు. దోవల్ కెరీర్ ఎదుగు దలకు ఇవన్నీ దోహదపడ్డాయంటే, అందుకు ఏమాత్రం చరిష్మాలేని ప్రధాని ఆధ్వర్యంలోని బలహీనమైన మైనార్టీ ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. అత్యంత శక్తిమంతురాలిగా వున్నప్పటికీ పోఖ్రాన్–1 పరీక్షలను అణుబాంబు ప్రయోగంగా చెప్పు కోడానికి ఇందిర సాహసించలేదు. శాంతి యుత ప్రయోజనాలకే అణు ప్రయోగాలు అనే ముసుగు కప్పుకోక తప్పలేదు. 24ఏళ్ల తర్వాత బల హీనమైన వాజ్‌పేయి హయాంలోని సంకీర్ణ ప్రభుత్వం అటువంటి ముసుగులు వేసుకోలేదు. వాజ్‌పేయి ప్రభుత్వం ఎంత బలహీనమైన దంటే పోఖ్రాన్–2 పరీక్షలు జరిగిన 11 నెలలకే ఒక్క ఓటు తక్కువ కావడంతో కూలిపోయింది. పోఖ్రాన్–2 పరీక్షలు సాహసోపేతమైన విధాన నిర్ణయం అను కుంటే, యూపీఏ–1 హయాంలో మన్మోహన్ సింగ్ కుదుర్చుకున్న భారత్–అమెరికా అణు ఒప్పందాన్ని ఏమనాలి? మన్మోహన్ ప్రభుత్వం వామపక్ష పార్టీలపై ఆధారపడి ఉంది. పార్లమెంట్లో తన ప్రభుత్వం ప్రమాదంలో వున్నప్పటికీ ప్రపంచం దృష్టిలో భారత్ వ్యూహాత్మక దృక్పథాన్ని మార్చివేశారు. యూపీ ఏ–2 హయాంలో కూడా ఇలాగే రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలను ఆహ్వానిం చారు. మోదీ ప్రభుత్వం అణు ఒప్పందాన్ని అప్పనంగా స్వీకరించింది. కానీ, రిటైల్ రంగంలో ఎఫ్డీ ఐల వ్యవహారాన్ని ముందుకు తీసుకుపోలేకపోయింది. ఇందులో దృక్ప థానికి సంబంధించిన విభేదాలేమీ లేవు. ఆర్థిక వ్యవస్థ, అంతర్గత భద్రత, విధానాలకు సంబంధించిన అంశాల్లో స్థిరమైన ప్రభుత్వాలకంటే అస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాలు చాలా నిర్ణయాత్మకంగా, ధైర్యంగా వ్యవహరించాయని దీన్నిబట్టి మనకుఅర్థమవుతుంది. మన నేతలు పరిపూర్ణులేమీ కాదు. కానీ, వాళ్లకు ఏది మంచో వాళ్లకు తెలుసు. ప్రతి ఎన్నికల్లో గెలవాలనుకుంటారు. ఒకసారి అధికారంలోకి వచ్చాక వదులుకోడానికి ఇష్టపడరు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంటే, శాంతిభద్రతలు కొనసాగుతుంటే ప్రజలు వారిని మళ్లీ ఎన్నుకుంటారు. సంకీర్ణ ప్రభుత్వం అస్థిరమైనది. దాంతో నేతలు సంప్రదింపులు జరుపుతారు. అవకాశాలు వెతుక్కుంటారు. ఇతరులు చెప్పేది వింటారు. స్థిరమైన ప్రభుత్వాలు నేతలను సుఖంగా, పొగరుగా, వ్యక్తిగత రాగద్వేషాలతో ఉండేలా చేస్తాయి. ఇందిర, రాజీవ్ నుంచి మోదీ వరకు రాజకీయ చరిత్ర చెబుతున్న పాఠం ఇదే. అందుకే మనం సంకీర్ణ ప్రభుత్వాలకు భయపడాల్సిన అవసరం లేదు. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
పటేల్ చాటున పండిట్జీపై నింద
మోదీ తలపెట్టిన మరొక ప్రచారం– ‘పదిహేను కాంగ్రెస్ కమిటీలలో పన్నెండు ప్రధాని అభ్యర్థిత్వానికి పటేల్‌కు ఓటు వేయడం’. ఆధారాలేమిటో చెప్పకుండానే ఆయన ఈ వాదనను ముందుకు తెచ్చారు. అంటే పటేల్‌కు మెజారిటీ ఉన్నా, ఆయన్ను పక్కన పెట్టారన్నది మోదీ ఆరోపణ. కానీ గాంధీజీని గాడ్సే పొట్టన పెట్టుకున్న తరువాత కూడా నెహ్రూ, పటేల్ పొరపొచ్చాలు లేకుండానే సాగారు. 565 స్వదేశీ సంస్థానాలను ఇండియన్ యూనియన్‌లో అంతర్భాగం చేసేదాకా ఆ ఇరువురు కూడా సంయుక్తంగా శ్రమించినవారే! ‘స్వాతంత్య్రం వచ్చాక ఆనాటికి ఉన్న పదిహేను కాంగ్రెస్ కమిటీలలో పన్నెండు సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌ను ప్రధానిని చేయాలంటూ ఓటు వేశాయి. కానీ పటేల్‌ను పక్కన పెట్టి పండిట్ నెహ్రూకు పగ్గాలు కట్టబెట్టిన విషయాన్ని మరువరాదు. పటేల్ ప్రధాని అయి ఉంటే కశ్మీర్ సమస్య ఉండేది కాదు. రాజకీయ స్వలాభం కోసమే కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసింది.’ – ప్రధాని నరేంద్ర మోదీ (5–2–2018 నాటి పార్లమెంట్ ప్రసంగం నుంచి) ‘తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాటు తేలిన, అపార అనుభవం కలిగిన స్వాతంత్య్ర సమరయోధుడు. దేశ మహా నాయకులలో ఒకరు. దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థనీ, సచేతనమైన పత్రికా వ్యవస్థనూ ప్రసాదించిన నేత నెహ్రూ.’ – మోదీ మంత్రిమండలిలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (2015 నవంబర్‌లో సింగ్ చేసిన ఈ ప్రసంగం వీడియోను 9–2–18న రాహుల్ విడుదల చేశారు) పార్లమెంట్ సహా, వివిధ వేదికల నుంచి నరేంద్ర మోదీ ఇటీవల పండిట్ నెహ్రూ మీద చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యానాలు గుడ్డొచ్చి పిల్లను వెక్కిరిం చిన రీతిలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గుడ్డెద్దు చేలో పడిన చందంగా ఉంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ‘దేశాభ్యుదయం’ కంటే; కాంగ్రెస్‌నూ, ఆ పార్టీ పూర్వ నాయకులనూ, వారితో పాటు కొందరు స్వాతంత్య్ర యోధులనూ ఆడిపోసుకోవడం బీజేపీ–పరివార్ ప్రధానికి పరిపాటైంది. అందరితో పాటు కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్‌లో ఎన్ని తప్పులు కనిపించినా, అది దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ నాయకత్వంలో పనిచేసిన అగ్రగామి దళం. గాంధీ నాయకత్వంలో ఒక్కతాటిపైకి వచ్చి కడదాకా పనిచేసిన వారు నెహ్రూ, పటేల్. ఉద్యమ నిర్వహణ, ఉధృతి సమయాలలో నాయకులలో అభిప్రాయభేదాలు సహజం. వీటిని మాత్రమే ఆసరా చేసుకుని, కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసిందనీ, అందుకే కాంగ్రెస్ నుంచి భారత్‌కు విముక్తి కల్పించాలనీ మోదీ అనడంలో ఔచిత్యం లేదు. పైగా గాంధీజీయే కోరుకున్నారనీ, ఆయన మాటనే తాను ఉటంకించాననీ, ఇది కొత్త మాటేమీ కాదనీ ఆయన సమర్థించుకోజూస్తున్నారు. జాతీయ కాంగ్రెస్ అగ్రదళంగా భారత్ స్వాతంత్య్రం సాధించింది. కానీ విభిన్న సిద్ధాంతాలకు, పాయలకు చెందిన పక్షాలు కూడా తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాయి. అందుకే తొలినాటి స్వతంత్ర భారతదేశానికి ఆ శక్తులన్నింటితో కూడిన జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కావాలని గాంధీజీ అభిలషించిన సంగతిని మోదీ విస్మరించడమూ సరికాదు. ఇలాంటి దృష్టితో పాటు, కాంగ్రెస్ నిర్వహించిన చరిత్రాత్మక పాత్రకు గుర్తింపుగా, ఆ సంస్థ నేతృత్వంలోనే ఒక ఉమ్మడి పాలనా వ్యవస్థ ఆవిర్భవించాలని గాంధీజీ ఆశించారు. అంతేగానీ, మోదీ వక్రీకరించినట్టు కాంగ్రెస్ నుంచి భారత్‌కు విముక్తి కలగాలన్న వ్యతిరేక భావన గాంధీ ఉద్దేశం కాదు. గాంధీజీయే కాదు, ఆనాటి నేతలు, మేధావులు ఊహించని మరొక పరి ణామం ఉంది. అలనాటి కాంగ్రెస్, కాంగ్రెస్–యూపీఏల హయాములలోనే గాంధీజీ ఆశయాలకు తూట్లు పడినాయి. గాంధీజీ హత్యానంతరం కొత్త వేషంతో, హిందూరాష్ట్ర బ్యానర్లతో దూసుకొచ్చి, కాలక్రమేణా ఢిల్లీ అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ–ఆరెస్సెస్–పరివార్ కూడా గాంధీ ఆశయాలకు భంగం వాటిల్ల చేసినదే. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి భిన్నంగా, తరువాత రాసుకున్న రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా పాలనా వ్యవస్థను ఆ రెండు పార్టీలూ, వాటి కూటములూ కూడా మార్చేశాయి. ‘బహుజన హితాయ’ అన్న హితోక్తిని ‘బడావర్గాల హితాయ’గా వికృతం చేశాయి. మోదీ తలపెట్టిన మరొక ప్రచారం– ‘పదిహేను కాంగ్రెస్ కమిటీలలో పన్నెండు ప్రధాని అభ్యర్థిత్వానికి పటేల్‌కు ఓటు వేయడం’. ఆధారాలేమిటో చెప్పకుండానే ఆయన ఈ వాదనను ముందుకు తెచ్చారు. అంటే పటేల్‌కు మెజారిటీ ఉన్నా, ఆయన్ను పక్కన పెట్టారన్నది మోదీ ఆరోపణ. కానీ గాంధీజీని ఆరెస్సెస్–హిందూ మహాసభ కార్యకర్త గాడ్సే పొట్టన పెట్టుకున్న తరువాత కూడా నెహ్రూ, పటేల్ పొరపొచ్చాలు లేకుండానే సాగారు. 565 స్వదేశీ సంస్థానాలను రద్దు చేసి ఇండియన్ యూనియన్‌లో అంతర్భాగం చేసేదాకా ఆ ఇరువురు కూడా సంయుక్తంగా శ్రమించినవారే! మోదీ అర్ధంతరంగా వచ్చి ఈ చరిత్రను తుడిచివేద్దామనుకుంటే చెల్లదు. ‘నెహ్రూ కోసం పటేల్‌ను కాదని పక్కన పెట్టా ర’న్న మోదీ చెబుతున్న వ్యాఖ్య ఎవరో చేసింది కాదు. గాంధీ జయంతికి ఇండోర్‌లో జరిగిన బహిరంగ సభలో సర్దార్ పటేల్ స్వయంగా చెప్పిందే: ‘మాకు నాయకుడు పండిట్ నెహ్రూ. గాంధీజీ నెహ్రూను తన వారసుడిగా ప్రకటించారు. బాపు సైనికదళంగా ఆయన ఆదేశాన్ని పాటించడం మా ధర్మం. ఆ భావంతో గాంధీజీ ఆదేశాన్ని ఎవరు మనఃపూర్వకంగా పాటించరో వారంతా దేవుడి ముందు పాపం చేసిన వారవుతారు. నేను బాపూ సైనికుణ్ణి’ (ఇండోర్: 2.10.1950 : ప్యారెలాల్ ‘మహాత్మా: ది లాస్ట్ ఫేజ్’) అన్నారాయన. కశ్మీర్ విభజనానంతర సమస్య పటేల్‌నే ప్రధానమంత్రిగా ప్రకటించి ఉంటే కశ్మీర్ సమస్యే ఉత్పన్నమయ్యేది కాదని కూడా మోదీ భాష్యం చెప్పారు. తన విధానాలతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడల్లా మోదీ వారి దృష్టి నుంచి మళ్లించేందుకు ఇలాంటి ‘దారి మళ్లింపు’ ప్రకటనలు చేస్తూంటారు. కశ్మీర్ సమస్య విభజనానంతర భారతంలో సంస్థానాల విలీనీకరణతో ముడిపడిన సమస్య. హిందువులు మెజారిటీగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేస్తున్నప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉన్న సంస్థానాలను పాకిస్తాన్లో కలపాలా, లేదా భారత యూనియన్లోనే ఉంచాలా అన్న సమస్య ఉత్పన్నమయింది. ఆ సమయంలో హిందువులు మెజారిటీగా ఉన్న జునాఘడ్, హైదరాబాద్‌లను భారత యూనియన్‌లో విలీనం కావడానికి పాకిస్తాన్ ఒప్పుకుంటే, కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇచ్చేయడానికి హోంమంత్రి పటేల్ ఒప్పుదలయ్యారు డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్: ఏజీ నూరాని పే: 160 (2013). జునాఘడ్, హైదరాబాద్‌లు భారత యూనియన్‌లో విలీనమైనా ముస్లిం మెజారిటీతో ఉన్న కశ్మీర్ ఎటూ కాకుండానే ఉండిపోయింది. 70 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య సమస్యగానే మిగిలి ఉంది. తన ఈ ప్రతిపాదనను పాకిస్తాన్ ‘దురదృష్టవశాత్తు’ ఆమోదించలేదనీ, ఫలితంగా జునాఘడ్, హైదరాబాద్, కశ్మీర్లనే గాక, తూర్పు పాకిస్తాన్‌ను కూడా కోల్పోయిందని పటేల్ అన్నారు. మోదీ భావిస్తున్నట్టు పటేల్ ప్రధాని అయినా, కశ్మీర్ కాష్టం తొలిగేది కాదు. కశ్మీర్ ప్రజల బాధలు అనంతం. బ్రిటిష్ అధికారులు రకరకాల సంధుల ద్వారా (లాహోర్–అమృత్సర్ సంధి 1846 మార్చి 9–11) బ్రిటిష్ సామంత ప్రాంతంగా ఏలుతూ ఉన్న గులాబ్‌సింగ్‌ను, సిక్కులను మోసగించి ఒకటిన్నర కోట్ల రూపాయలకు ఈస్టిండియా కంపెనీకి ధారాదత్తం చేశారు. అమృత్సర్ సంధి ద్వారానే బ్రిటిష్ వాళ్లు బియాస్, సింధు నదుల మధ్య కశ్మీర్, హజారా ప్రాంతాలనూ అమ్మేశారు. వారానికి రూ. 75 లక్షల పరి హారం చూపించి కులూ, మనాలీ ప్రాంతాలను కూడా కంపెనీ స్వాహా చేసింది. అలా బ్రిటిష్ కుట్రల ద్వారా ఏర్పడిందే జమ్మూ–కశ్మీర్. గాంధీజీ (1947 ఆగస్టు) శ్రీనగర్‌లో పర్యటించిన తర్వాత ఒక చారిత్రిక సత్యాన్ని ప్రకటించారు: ‘‘నా పర్యటనానుభవంలో తేలింది– కశ్మీర్–జమ్మూలలో కశ్మీరీల మనోవాంఛ మాత్రమే అంతిమ శాసనంగా ఉండాలని చెప్పడానికి నేను సంకోచించడం లేదు. ఈ వాస్తవాన్ని ప్రస్తుత హిందూ మహారాజూ, మహారాణీ కూడా గుర్తించి, అంగీకరించారు. అమృత్సర్ సంధి అనేది కశ్మీర్‌ను అమ్మేసిన విక్రయ దస్తావేజు...’’. అలాగే, తాను హత్యకు గురి కావడానికి నెల ముందు ఢిల్లీలో ప్రార్థనా సమావేశంలో (1947 నవంబర్ 27న) గాంధీజీ మాట్లాడుతూ జమ్మూలోని హిందూ మైనారిటీ ప్రభుత్వ పాలనలో పెద్ద ఎత్తున అత్యాచారాలు జరగడానికి కారణం ఎవరో కాదు, మహారాజా హరిసింగ్‌ను బాధ్యుడిగా ప్రకటించారు (1947 డిసెంబర్ 25). అంతేగాదు, గాంధీజీ తన ఆరోపణను విశదీకరించే క్రమంలో ‘‘మహారాజా హరిసింగ్ తానిక ఎంత మాత్రమూ కశ్మీర్ పాలకుడ్ని కాననీ, కశ్మీర్ నిజమైన పాలకులు కశ్మీర్ ముస్లిం ప్రజలేనని వారికి నచ్చిన పద్ధతిలో కశ్మీర్‌ను పరిపాలించుకోవచ్చుననీ తనకు తానై హరిసింగ్ ప్రకటించాలని’’ 1947 డిసెంబర్ 25న గాంధీజీ అభిప్రాయపడ్డారని చరిత్రకారుడు, రాజ్యాంగ నిపుణుడు నూరానీ తన గ్రంథంలో నమోదు చేశారు. నిజాం సంస్థానం విలీనంలోనూ... హైదరాబాద్ సంస్థాన విమోచనకు పటేల్ ‘ఆపరేషన్ పోలో’ పేరిట ప్రారంభించిన సైనిక చర్య సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంధానకర్తగా పనిచేసిన కె. ఎం. మున్షీ పటేల్ కనుసన్నల్లో ఉన్నవారే. నాటి హైదరాబాద్ స్టేట్‌లో పటేల్ పంపిన యూనియన్ సైన్యం ప్రారంభించిన సైనిక చర్యల్లో ఘటిల్లిన పరిణామాల గురించి, ఆ గందరగోళాన్ని అవకాశంగా తీసుకుని మున్షీ హైదరాబాద్‌లోని బొల్లారం కేంద్రంగా ‘ఉండంతలు కొండంతలు’గా చిత్రించి నివేదికలు పంపడానికి కారణం, వాటిని పటేల్ నమ్మడానికి మూలం–మున్షీ, పటేల్ పూర్వరంగం ఆరెస్సెస్‌తో ఉన్న సంబంధాలేనని, పటేల్ మెతకతనానికి ఇదే కారణమని నూరానీ (అదే గ్రంథం: పే. 179) రాశాడు. గాంధీజీ హత్యకు ఆరెస్సెస్‌పైన నిషేధం విధించినా, క్రమంగా ఒత్తిళ్ల ఫలితంగా రద్దు చేసింది కూడా పటేల్ అని విస్మరించరాదు. పటేల్‌ను గాంధీ దేశ ప్రధానిని చేయకపోయినా, పటేల్ ఉప ప్రధానిగానే ఉన్నా హైదరాబాద్ విమోచన సందర్భంగా క్షేత్ర స్థాయిలో జరిగిన అనేక దుర్ఘనలపై విచారించిన కాంగ్రెస్ ప్రతినిధులు పద్మజానాయుడు (సరోజినీ నాయుడు కూతురు), ఖాజీ మహ్మద్ అబ్దుల్ గఫార్ఖాన్లు సమర్పించిన నివేదికలను పరిశీలించవలసిం దిగా ప్రధాని నెహ్రూ కోరినా, పటేల్ తోసి పుచ్చడమూ ఆనాడొక సంచలనంగా మారింది. ప్రధానమంత్రి కాకపోయినా నెహ్రూ క్యాబినెట్లో పటేల్ ‘ప్రధాని’గానే చెలామణి అవుతూ ప్రజల దృష్టికి రాని ‘బేఖాతరు’తనాన్ని చెలాయించుకుంటూనే వచ్చారని గమనించాలి. పైగా, గాంధీజీ హత్యానంతరం దేశ వ్యాప్తంగా ఆరెస్సెస్ వారు ఆనందంతో స్వీట్లు పంచడంతో ప్రతిపక్షాలు మరింత రెచ్చిపోయిన సందర్భంగా ఆరెస్సెస్‌పైన నిషేధం విధించక తప్పలేదని కూడా ఆరెస్సెస్ నేత గోల్వాల్కర్‌కు రాసిన లేఖలో పటేల్ (11.9.1948) హెచ్చరించవలసి వచ్చింది. ఈ లేఖ ఉద్దేశం ఆరెస్సెస్‌లో పునరాలోచన కోసం, హృదయ పరివర్తన కోసమేనని పటేల్ రాయడం గమనార్హం. మోదీ ఎంత ప్రయత్నించినా చారిత్రక ఆధారాలను మూసివేయలేరు, నిజాల్ని దాచలేరు. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అదంతా పటేల్ కృషి వల్లే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కేంద్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 114వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియంలో జెండా ఊపి ‘రన్ ఫర్ యూనిటీ’ మారదాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ఏక్ భారత్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే సాధ్యమైందని, దేశ ప్రజలందరినీ ఒకే తిరంగా జెండా కింద ఉంచడానికి పటేల్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. దేశం బలోపేతం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అయితే అది సాధ్యం కావాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉండాలని మోదీ అన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి పటేల్ చేసిన కృషి శ్లాఘనీయమని, దానిని ఎప్పటికీ మరచిపోరాదని మోదీ అన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రతిజ్ఞ చేయించిన ప్రధాని, దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటానికి మరింత శ్రమించాలని పిలుపునిచ్చారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ డిజిటల్ మ్యూజియమును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. కాగా అంతకు ముందు ప్రధాని మోదీ... మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. -
అదంతా పటేల్ కృషి వల్లే: ప్రధాని మోదీ
-
రేపు జాతీయ సమైక్య దినోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్య దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశ సమైక్యత, సమగ్రత, భద్రతకు ఎదురవుతున్న సవాళ్ల పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు జాతీయ సమైక్య దినోత్సవాన్ని నిర్వహించాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా సమైక్యత పరుగు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులందరితో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. -
జాతీయ సమైక్యతా యుగపురుషుడు
సందర్భం గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడైన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్వతంత్ర భారత నిర్మాతలలో ఒకరుగా గణుతికెక్కారు. స్వాతంత్య్రానంతరం సంస్థానా లను శర వేగంగా ఏకీకరణం చేసి భారత దేశ ముఖచిత్రాన్ని తిరగరాశారు. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరు కెక్కిన సర్దార్ పటేల్. 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు నాడియాద్‌లో పుట్టారు. ఆయన తండ్రి ఝవేరీ భాయ్ పటేల్ ఒక సామాన్య రైతు. తల్లి లాడ్‌బాయి ఒక సామాన్య మహిళ. బాల్యం నుంచే పటేల్‌ది ఎంతో కష్టపడే తత్వం. పెట్లోద్ లోని ఎన్.కె. స్కూల్లో చదువుకున్నాడు. 1896లో ఉన్నత విద్య పరీక్ష పాసయ్యాడు. 1897లో వల్లభ్ భాయ్ హైస్కూల్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. 1910లో పటేల్ న్యాయ శాస్త్రాన్ని అభ్యసించడం కోసం ఇంగ్లండుకు వెళ్లాడు. న్యాయ శాస్త్రంలో ప్రవీణుడైన పటేల్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని, బ్రిటిష్ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. గుజరాత్‌లోని ఖేడా, బోర్ సద్, బార్ డోలీలలో పౌర సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కర్షకులను సమీకరించి గుజరాత్ లోకెల్లా విశిష్ట నేతగా పేరు తెచ్చుకొన్నారు. 1931లో కరాచీలో జరి గిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో ఆయన నాయకత్వ స్థాయికి ఎదిగారు. 1934, 1937లలో పార్టీ ఎన్నికలను నిర్వ హించారు. పటేల్, గాంధీ ఇరువురూ స్వాతంత్య్ర పోరాటంలో భుజం భుజం కలిపి పనిచేశారు. భారతదేశ తొలి హోంమంత్రిగా పటేల్ అనేక సంస్థానాలను భారత సమాఖ్యలోకి విలీనపరచడంలో ముఖ్యమైన భూమికను వహించారు. దేశ విభజన నేపథ్యంలో స్వతంత్ర సంస్థానాలను ఏకీకరణం చేయవలసిన అవసరం గుర్తించి తన ఉక్కు పిడికిళ్లతో ఈ విధానాన్ని అమలులో పెట్టారు. భారతదేశంలో ఉన్న ఏ భూభాగానికైనా వేరుగానో, ఒంటరిగానో ఉండిపోవాలనుకునే హక్కును తాను గుర్తించబోనని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రాల సమీకరణ, కేంద్రీకరణ, ఏకీకరణ అనే మూడు విధాల ప్రక్రియను ఆచరణలో పెట్టారు. 1947 ఆగస్టు 15 నాటికి హైదరాబాద్, జునా గఢ్, కశ్మీర్ మాత్రం భారత్‌లో కలవడానికి సమ్మతించలేదు. జునా గఢ్, హైదరాబాద్ సంక్షోభాలను పటేల్ తలపండిన రాజనీతి జ్ఞతతో పరిష్కరించారు. జునాగఢ్ నవాబు తొలుత పాకి స్తాన్‌తో కలవాలని కోరుకున్నాడు. ప్రజలు తిరగబడడంతో పటేల్ జోక్యం చేసుకొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించి ఆ సంస్థా నాన్ని పటేల్ భారతదేశంలో కలిపివేశారు. నిజాం భారత వ్యతిరేక భావనలను వ్యక్తం చేస్తే, రజాకార్లు రక్తపుటేర్లను ప్రవహింపజేశారు. పటేల్ పోలీసు చర్య పట్ల మొగ్గు చూపారు. సైన్యాన్ని జన రల్ చౌదరి నాయకత్వాన హైదరాబాద్‌కు కదలాలని ఆయన ఆదేశించారు. సేనలు 1948 సెప్టెంబర్ 17నాడు హైదరాబాద్‌లో అడుగుపెట్టాయి. నిజాం లొంగిపోవడంతో, హైదరాబాద్ భారత దేశంలో భాగమైంది. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం పటేల్‌ను ప్రథమ ఉప ప్రధానిని చేశారు. కేంద్ర తొలి హోం మంత్రిగాను, తొలి సమా చార–ప్రసార శాఖ మంత్రిగాను కూడా పటేల్ సేవలు అందిం చారు. 1947 అక్టోబర్‌లో పాక్ సేనలు కశ్మీర్ పైకి దండెత్తి వచ్చాయి. కశ్మీర్ రాజా హరిసింగ్ తాను ఆపదలో చిక్కుకొన్నా నంటూ సర్దార్ పటేల్‌కు కబురు పంపారు. చేయూతనిమ్మని, విలీన ఒప్పందంపై సంతకం చేస్తూ ఒక పత్రాన్ని పంపారు. భారతీయ సేనలు జమ్మూ కశ్మీర్ రక్షణకు రంగప్రవేశం చేశాయి. అలా జమ్మూ కశ్మీర్‌ను భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. అంతర్యుద్ధానికి తావు లేకుండానే, ఆయన దేశంలో సంఘీ భావాన్ని ఏర్పరచగలిగారు; ఆధునిక భారతదేశ నిర్మాతగా ప్రఖ్యాతి పొందారు. ‘బిస్మార్క్ ఆఫ్ ఇండియా’ అని కూడా గుర్తింపు పొందారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధి కారులకు శిక్షణ నిచ్చే హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సంస్థ అయిన జాతీయ పోలీస్ అకాడమీకి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అని పేరు పెట్టి జాతి పటేల్‌ను గౌరవించు కొంది. భారత్‌లోని అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ ను పటేల్ మరణానంతరం 1991లో ఆయనకు ప్రకటించారు. రాష్ట్రీయ ఏకతా దివస్: సర్దార్ పటేల్ జన్మదినమైన అక్టోబరు 31ని ఏటా రాష్ట్రీయ ఏకతా దివస్ పేర జాతీయ స్థాయి ఉత్స వంగా పాటించాలని 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ 2014లో రాష్ట్రీయ ఏకతా దివస్‌ను ప్రారం భించారు. అలాగే వల్లభ్ భాయ్ పటేల్‌కు స్మారకంగా గుజరాత్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న విగ్రహానికి ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పేరును పెట్టారు. 182 మీటర్ల (597 అడుగుల) ఎత్తున నిర్మించనున్న ఈ అతి భారీ విగ్రహం నర్మదా ఆనకట్టకు ఎదు రుగా కొలువుదీరుతోంది. ఇది పూర్తి అయితే, ప్రపంచంలో కెల్లా అత్యంత పొడవైన విగ్రహంగా పేరు తెచ్చుకోగలదు. దేశభక్తిపరుడు, గొప్ప పరిపాలనాదక్షుడు, వజ్ర సంకల్పుడు, దార్శనికుడైన సర్దార్ పటేల్ భారతగడ్డపై పుట్టిన అరుదైన నాయ కులలో ఒకరు. ఆయన చూపిన ఉన్నత ఆదర్శాలు భావి తరాల యువతకు చిరస్మరణీయాలూ, అనుసరణీయాలూను. (అక్టోబర్ 31న సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా) వ్యాసకర్త డా: పీజే సుధాకర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, హైదరాబాద్ ఈ–మెయిల్ : pibhyderabad@gmail.com -
'ఐపీఎస్ లు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి'
-
మోడీ ఓ హిట్లర్: రాహుల్
గుజరాత్ పర్యటనలో నిప్పులు రైతుల భూములు లాక్కొని కార్పొరేట్లకు పంచారని ధ్వజం దేశ ఖజానాకు ఆయన ‘చౌకీదారు’గా అక్కర్లేదని విమర్శ బాలాసినోర్ (గుజరాత్): గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. మోడీని ఒకప్పటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తూ దుయ్యబట్టారు. కార్పొరేట్ల కోసం ఆయన ప్రభుత్వం రైతుల భూములను లాక్కుందని ఆరోపించారు. దేశవ్యాప్త ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మోడీ స్వరాష్ట్రం గుజరాత్లో రాహుల్ పర్యటించారు. ఖేడా జిల్లాలోని బాలాసినోర్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీతోపాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్లను తూర్పారబట్టారు. బీజేపీకి సొంత సిద్ధాంతమంటూ ఏదీ లేదని...అందుకే దివంగత కాంగ్రెస్ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని లాక్కునేందుకు ఆయన జ్ఞాపకార్థం పేరుతో భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. తమ పార్టీ ఎన్నటికీ ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ నేతలను అనుసరించబోదని హామీ ఇచ్చారు. నాయకుల్లో రెండు రకాల వారు ఉంటారని...వారిలో ఒకరు గాంధీజీలా ప్రజల వద్దకు వెళ్లి వారిని అర్థం చేసుకుంటారని చెప్పారు. వారిలో గర్వం ఉండదన్నారు. ఇక రెండో రకం నాయకులు హిట్లర్‌లా ప్రజల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని భావిస్తుంటారని...యావత్ ప్రపంచ విజ్ఞానమంతా తన మెదడులోనే ఉందని విర్రవీగుతుంటారని పరోక్షంగా మోడీని ఉద్దేశించి విమర్శించారు. ఇదేం ‘చౌకీదారీ’?: ప్రధాని పదవి చేపడితే అవినీతి నుంచి దేశ ఖజానాను కాపాడేందుకు తాను చౌకీదారుగా (కాపలాదారు) ఉంటానంటూ మోడీ చేసిన ప్రకటనను రాహుల్ ఎద్దేవా చేశారు. ‘‘గుజరాత్లో ఎలాంటి ‘చౌకీదారీ’ నడుస్తోంది? రైతుల నుంచి లక్షలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకొని పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు. ‘చౌకీదారీ’ అంటే రైతుల భూములను దొంగిలించడమేనా? అలాంటి వారి ‘చౌకీదారీ’ మనకు అక్కర్లేదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. మోడీ ముందు పటేల్ గురించి తెలుసుకోవాలి గుజరాత్లో బీజేపీ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించడం మంచిదే అయినా మోడీ తొలుత పటేల్ గురించి తెలుసుకోవాలని రాహుల్ సూచించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం విషపూరితమని, అది దేశాన్ని నాశనం చేస్తుందని పటేల్ చెప్పేవారని రాహుల్ గుర్తుచేశారు. కానీ బీజేపీ నేతలు వారి జీవితమంతా ఆర్ఎస్ఎస్లోనే గడిపారన్నారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని మాట్లాడుతున్న బీజేపీ నేతలు...గాంధీజీ, పటేల్ నిర్మించిన పార్టీని (కాంగ్రెస్) నాశనం చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. -
బీసీలు మోడీని వ్యతిరేకించాలి
ఆయన ప్రధానైతే రిజర్వేషన్లు పోతాయి: కంచ ఐలయ్య సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోడీ ప్రధాని అయినపక్షంలో బీసీలకు ఇపుడున్న రిజర్వేషన్లు పోతాయని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి బీసీ మోడీని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారమిక్కడ ఆంధ్రా సారస్వత పరిషత్‌లో ‘బహుజన సెక్యులర్ మూవ్మెంట్’(బీఎస్ఎం) ఆధ్వర్యంలో ‘సెక్యులరిజానికి జీవం పోద్దాం.. భిన్నత్వాన్ని కాపాడుకుందాం.. మోడీని ఓడిద్దాం.. దేశాన్ని రక్షిద్దాం’ అన్న అంశంపై మహాచర్చ నిర్వహించారు. ఐలయ్య మాట్లాడుతూ.. మోడీ ప్రధాని అయితే ముస్లింలకు, క్రిస్టియన్లకు ప్రమాదం ఉండదని, బీసీలకు మాత్రమే ప్రమాదమని అన్నారు. మోడీ ఇప్పటివరకు ఏనాడూ తాను బీసీనని చెప్పుకోలేదని, ప్రధాని పదవి దక్కించుకునేందుకే ఇప్పుడు బీసీనని చెప్పుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెడుతున్న మోడీ.. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టేందుకు మాత్రం సుముఖంగా లేరన్నారు. బ్రాహ్మణ పెట్టుబడిదారులకు రిజర్వేషన్లపై వ్యతిరేకత ఉందని, బ్రాహ్మణీయుల బానిసైనమోడీని ప్రధానిని చేసి రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తారని ఐలయ్య ఆరోపించారు. ఢిల్లీలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే భారీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని బీఎస్ఎం తరపున ప్రతిపాదించారు. సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ భంగ్యా భూక్యా, జమీలా నిషాత్, ఖాదర్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యత కోసం పరుగు
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : మాజీ ఉప ప్రధాని, దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం దేశవ్యాప్తంగా చేపట్టిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. చిన్నారుల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నా రు. జిల్లా కేంద్రంలో చిన్నారుల స్కేటింగ్ విన్యాసం అందరినీ ఆకట్టుకొంది. నిజామాబా ద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో ఉదయం 8 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో పటేల్ పాత్ర మరువలేనిదన్నారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి, విశాల భారతాన్ని నిర్మించిన ఘనత ఆయనదే అన్నారు. నిజాం పాలకుల కబంధ హస్తాలనుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించేందుకు ఆయన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతు బాంధవుడు స్వాతంత్య్రానికి పూర్వం గుజరాత్ రాష్ట్రంలోని బార్డోలీ ప్రాంతంలోని వ్యవసాయ భూముల ను బ్రిటిష్ పాలకులు తమ అధీనంలోకి తీసుకొ ని రైతులను ఇబ్బందులకు గురి చేసిందని యెండల పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా వల్లభాయ్ పటేల్ ఉద్యమించారని, రైతుల కష్టాలను దూరం చేశారని కొనియాడారు. దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రం లో నిర్మిస్తున్నామన్నారు. రైతబాంధవుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్ర హ నిర్మాణంలో వ్యవసాయ పరికరాలనే వినియోగిస్తున్నామన్నారు. అందరూ సహకరించాలని కోరారు. కలెక్టరేట్‌నుంచి.. ఐక్యత కోసం పరుగు కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైంది. బస్టాండ్, గాంధీచౌక్ మీదుగా సాగింది. గాంధీ చౌక్‌లోని మహాత్ముడి విగ్రహానికి నేతలు పూల మాలలు వేశారు. వర్ని చౌరస్తాలోని సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఏకతా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ సామగ్రిని తీసుకువెళ్లడానికి త్వరలోనే జిల్లాకు గుజరాత్ రాష్ట్రం నుంచి బాక్సులు రానున్నాయన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి ఒక వ్యవసాయ ఇనుప పరికరాన్ని, కొంత మట్టిని సేకరిస్తున్నామన్నారు. వీటితోపాటు సర్పంచ్ వివరాలు, ఫొటో సేకరించి ఆ పెట్టెలో ఉంచి గుజరాత్ పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏకతా ట్రస్ట్ జిల్లా చైర్మన్ సోమానీ, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జె.బాపురెడ్డి, సభ్యులు సీనియర్ న్యాయవాది కృపాకర్‌రెడ్డి, రాజ్‌కుమార్‌సుబేదార్, పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుల్గం మోహన్, బీజేపీ నాయకులు కాటిపల్లి సురేశ్‌రెడ్డి, జయభరత్‌రెడ్డి, జాలిగం గోపాల్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాంచారి శైలజ తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం, కొత్తగూడెంలో ‘రన్‌ఫర్ యూనిటీ’
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: సర్దార్ వల్లబాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఖమ్మంనగరంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెవీలియన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ రన్ టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పెవీలి యన్ గ్రౌండ్ నుంచి బయలుదేరిన ఈ రన్ మయూరిసెంటర్, బస్టాండ్, వైరా రోడ్, జడ్పీ సెంటర్, కలెక్టరేట్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు మీదుగా సర్దార్ పటేల్ స్టేడియం వరకు సాగింది. తొలుత సర్దార్ వల్లబాయ్ పటేల చిత్ర పటానికి రంగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం తర్వాత ముక్కలు చెక్కలుగా ఉన్న భారతావనిని ఒక్కటి చేసిన మహనీయుడు పటేల్ అని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలనకు తెరదించి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛావాయువులు ప్రసాదించారని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కో ఆర్డినేటర్ దొడ్డా రమేష్, నాయకులు జయచంద్రారెడ్డి, గెంటెల విద్యాసాగర్, డి. సత్యనారాయణ, పుల్లేశ్వరావు,కొండి ప్రభాకర్, నంద్యాల శ్రీనివాసరావు, కీసర జైపాల్‌రెడ్డి, పిట్టల లక్ష్మీనారాయణ, కృష్ణలత, కటేపల్లి లక్ష్మీనారాయణ, రవీందర్, పద్మావతి, ఉపేందర్, రెజోనెన్స్ నాగేందర్, ఆర్జేసి కృష్ణ, దరిపల్లి కిరణ్, శేషగిరి, కృష్ణవేణి, ఎం. నారాయణ, వెంకటేశ్వరగుప్త పాల్గొన్నారు. కొత్తగూడెంలో.. లక్ష్మీదేవిపల్లి: మన దేశ ప్రథమ హోం శాఖామంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా ఆదివారం కొత్తగూడెం మండలలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీలో ఏక్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ జరిగింది. విశ్వరూప థియేటర్ నుంచి సూపర్‌బజార్ సెంటర్ వరకు ఇది సాగింది. ప్రదర్శకులు అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏక్తా ట్రస్ట్ నాయకులు జివికె.మనోహర్, కంచర్ల చంద్రశేఖర్‌రావు, జెవిఎస్.చౌదరి మాట్లాడుతూ.. వల్లభాయ్ పటేల్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో నిర్మించేందుకు దేశవ్యాప్తంగా పాత ఇనుము సేకరణ సాగుతోందన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు తొగరు రాజశేఖర్, కనకరాజు, బండి రాజ్‌గౌడ్, టి.నరేంద్రబాబు, సంగం చందర్, పిట్టల కమల, ఇలిగాల మొగిలి, పి.కాశీహుస్సేన్, వి.మల్లేష్, మోరె భాస్కర్, గుమలాపురం సత్యనారాయణ పాల్గొన్నారు. -
సీమాంధ్రులకూ హక్కులుంటాయి: వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్: దేశ సమైక్యత, సమగ్రతను కాపాడాల్సిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల విభజనలో తన ఇష్టానుసారం వ్యవహరిస్తోందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేస్తే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కులాలు, మతాలు, జాతుల పేరిట దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటోందని మండిపడ్డారు. గుజరాత్లో తలపెట్టిన సర్దార్ పటేల్ విగ్రహ ఏర్పాట్లపై ఆదివారమిక్కడ జరిగిన దక్షిణాది రాష్ట్రాల అధ్యయన గోష్టిలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘రాష్ట్రాన్ని విభజించమంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. పోవాల్సిన వాళ్లు ఎలాగూ పాకిస్థాన్ వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లంతా భారతీయులే. వాళ్లందరికీ సమాన హక్కులుంటాయి. ఈ దేశంలో వాళ్లూ (సీమాంధ్రను ఉద్దేశించి)భాగమే. పక్షపాతం చూపకండి. స్నేహితుల్లా మెలిగేలా రాష్ట్రాన్ని విభజించండి’ అని హితవు పలికారు. ఈ సమావేశం సమైక్యతా విగ్రహ దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. ఇందులో గుజరాత్ రాష్ట్ర మంత్రులు సౌరభ్ పటేల్, ప్రదీప్ జడేజా, రజనీకాంత్ పటేల్, బాబూ భాయ్ బుఖారియా, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధన్కడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీహెచ్ విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పెన్నార్ గ్రూపు సంస్థల నేత నృపేందర్‌రావు, సినీ నిర్మాత నారా జయశ్రీదేవి, నటి జీవిత, రిటైర్డ్ ఐజీ గోపీనాథ్‌రెడ్డి, పారిశ్రామికవేత్త లక్ష్మీరాజం, రచయిత భారవి, సీహెచ్ హనుమంతరావు పాల్గొన్నారు. బీసీల్లో చేర్చాలని కాపు నేతల వినతి కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతలు విష్ణుమూర్తి, సోము వీర్రాజు తదితరులు కిషన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. -
కాశ్మీర్‌కు బలగాలు పంపవద్దన్న నెహ్రూ: అద్వానీ
తాజాగా బ్లాగులో అద్వానీ కామెంట్లు న్యూఢిల్లీ: అప్పట్లోప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ‘పచ్చి మతతత్వవాది’ అని అన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ అగ్రనేత అద్వానీ మరో ఆసక్తికర అంశం వెల్లడించారు. 1948లో పాకిస్థాన్ సేనలు కాశ్మీర్ వచ్చేసినప్పటికీ.. వాటిని ప్రతిఘటించేందుకు సైన్యాన్ని పంపడానికి నెహ్రూ విముఖత వ్యక్తంచేశారని తెలిపారు. కానీ నాటి హోం మంత్రి ఆయన్ను ఒప్పించి సైన్యాన్ని పంపారని వెల్లడించారు. సీనియర్ జర్నలిస్టు ప్రేమ్ శంకర్ ఝాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్యామ్ మానెక్షా(అప్పట్లో కల్నల్) ఇచ్చిన ఇంటర్వ్యూను ఉటంకిస్తూ అద్వానీ గురువారం తన బ్లాగ్‌లో ఈ విషయం పేర్కొన్నారు. ‘‘పాకిస్థాన్ దళాల తోడ్పాటుతో గిరిజనులు పెద్ద ఎత్తున శ్రీనగర్ దగ్గరకు వచ్చేశారు. అక్కడికి భారత బలగాలను పంపే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే నెహ్రూ మాత్రం దానికి విముఖత వ్యక్తంచేశారు. ఈ అంశాన్ని ఐక్య రాజ్య సమితి దృష్టికి తీసుకుపోదామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు’’ అని మానెక్షా అన్నట్లు అద్వానీ పేర్కొన్నారు. -
పటేల్ ప్రధాని అయివుంటే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఉండేవి కావు
లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుధ్దం జోరుగా సాగుతోంది. దేశ ప్రథమ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అయుంటే దేశ పరిస్థితి ప్రస్తుతం మరోలా ఉండేదని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. పటేల్ ప్రధాని అయివుంటే నేడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉనికిలో ఉండేవి కావని ఘాటుగా స్పందించారు. గుజరాత్లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలో మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'జవహర్లాల్ నెహ్రూ స్థానంలో పటేల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినట్టయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ప్రస్తుతం ఉండేవి కావు. ఈ విషయంలో నాకు ఏమాత్రం సందేహం లేదు' అని దిగ్విజయ్ అన్నారు. మతహింసను ప్రేరేపించిన ఆర్ఎస్ఎస్పై పటేల్ నిషేధం విధించిన విషయాన్ని మోడీ మరచిపోరాదని వ్యాఖ్యానించారు.