ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: సర్దార్ వల్లబాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఖమ్మంనగరంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెవీలియన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ రన్ టీఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పెవీలి యన్ గ్రౌండ్ నుంచి బయలుదేరిన ఈ రన్ మయూరిసెంటర్, బస్టాండ్, వైరా రోడ్, జడ్పీ సెంటర్, కలెక్టరేట్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు మీదుగా సర్దార్ పటేల్ స్టేడియం వరకు సాగింది. తొలుత సర్దార్ వల్లబాయ్ పటేల చిత్ర పటానికి రంగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం తర్వాత ముక్కలు చెక్కలుగా ఉన్న భారతావనిని ఒక్కటి చేసిన మహనీయుడు పటేల్ అని కొనియాడారు.
నిజాం నిరంకుశ పాలనకు తెరదించి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛావాయువులు ప్రసాదించారని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కో ఆర్డినేటర్ దొడ్డా రమేష్, నాయకులు జయచంద్రారెడ్డి, గెంటెల విద్యాసాగర్, డి. సత్యనారాయణ, పుల్లేశ్వరావు,కొండి ప్రభాకర్, నంద్యాల శ్రీనివాసరావు, కీసర జైపాల్‌రెడ్డి, పిట్టల లక్ష్మీనారాయణ, కృష్ణలత, కటేపల్లి లక్ష్మీనారాయణ, రవీందర్, పద్మావతి, ఉపేందర్, రెజోనెన్స్ నాగేందర్, ఆర్‌జేసి కృష్ణ, దరిపల్లి కిరణ్, శేషగిరి, కృష్ణవేణి, ఎం. నారాయణ, వెంకటేశ్వరగుప్త పాల్గొన్నారు.
కొత్తగూడెంలో..
లక్ష్మీదేవిపల్లి: మన దేశ ప్రథమ హోం శాఖామంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా ఆదివారం కొత్తగూడెం మండలలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీలో ఏక్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ జరిగింది. విశ్వరూప థియేటర్ నుంచి సూపర్‌బజార్ సెంటర్ వరకు ఇది సాగింది. ప్రదర్శకులు అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏక్తా ట్రస్ట్ నాయకులు జివికె.మనోహర్, కంచర్ల చంద్రశేఖర్‌రావు, జెవిఎస్.చౌదరి మాట్లాడుతూ.. వల్లభాయ్ పటేల్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తై సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో నిర్మించేందుకు దేశవ్యాప్తంగా పాత ఇనుము సేకరణ సాగుతోందన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు తొగరు రాజశేఖర్, కనకరాజు, బండి రాజ్‌గౌడ్, టి.నరేంద్రబాబు, సంగం చందర్, పిట్టల కమల, ఇలిగాల మొగిలి, పి.కాశీహుస్సేన్, వి.మల్లేష్, మోరె భాస్కర్, గుమలాపురం సత్యనారాయణ పాల్గొన్నారు.
ఖమ్మం, కొత్తగూడెంలో ‘రన్‌ఫర్ యూనిటీ’
Published Mon, Dec 16 2013 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement