సాక్షి, గుంటూరు:
కొండపై కార్మెల్ మాత ఆలయం... కొండ పక్కనే ఎస్టీ కాలనీ... ఎదురుగా బాలయేసు కేథడ్రల్ చర్చి, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్.. ఆ పక్కనే గుంటూరు–కర్నూలు ప్రధాన రహదారి. ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలో క్వారీయింగ్‌కు మైనింగ్ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. ఫిరంగిపురంలో క్వారీయింగ్, బ్లాస్టింగ్‌ల వల్ల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని 2016 డిసెంబర్ 18వ తేదీన ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది.
(ఫిరంగిపురంలో క్వారీయింగ్‌తో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని 2016 డిసెంబర్ 18వ తేదీన ‘సాక్షి’ ప్రచురించిన కథనం)
అప్పట్లో ఈ కథనంపై అధికార పార్టీ నేతలు అక్కసు వెళ్లగక్కారు. ఫిరంగిపురంలో క్వారీని నిలిపివేయాలంటూ స్థానికులు ఎన్నిసార్లు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఇదే కొండచుట్టూ మొత్తం 12 క్వారీలకు మైనింగ్ అనుమతులు ఇచ్చారు. 24 గంటలూ యథేచ్ఛగా ఇక్కడ బ్లాస్టింగ్‌లు, తవ్వకాలు జరుగుతున్నాయి. ఎప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందోనని ఫిరంగిపురం వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
Published Sun, May 28 2017 3:15 AM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM
Advertisement