firangipuram
-
ఏసీబీ వలలో ఎస్ఐ
ఫిరంగిపురం(తాడికొండ): ఓ కేసులో రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఫిరంగిపురం ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్, డ్రైవర్లు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం .. గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన షేక్.ఖాసిం వినుకొండలో నివాసం ఉంటున్నాడు. గతేడాది కె.జాషువా అనే వ్యక్తి మోటారు సైకిల్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ కేసులో జాషువా, అతని స్నేహితుడు ఖాసిం ప్రమాదానికి ముందు కలిసి మద్యం సేవించారు. దీని ఆధారంగా పోలీసులు ఖాసింపై అనుమానితుడిగా కేసు నమోదు చేశారు. మృతుడు జాషువా కుటుంబ సభ్యులు ఖాసింపై ఎటువంటి అనుమానం వ్యక్తం చేయకపోయినా కేసు నుంచి తప్పించాలంటే రూ. లక్ష ఇవ్వాలని ఎస్ఐ అజయ్‌బాబు డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ. 80 వేలకు మాట్లాడుకున్నారు. చివరకు ఖాసిం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం ఎస్ఐ అజయ్బాబుకు రూ.40 వేలను ఇచ్చేందుకు ఖాసిం వెళ్లాడు. దీంతో ఎస్ఐ స్టేషన్‌లోని హెడ్‌కానిస్టేబుల్ రామకోటేశ్వరరావుకు అందజేయాలని చెప్పాడు. వాటిని తమ డ్రైవర్ షఫీకి ఇవ్వమని రామకోటేశ్వరరావు తెలిపాడు. నగదు చేతులు మారుతున్న సమయంలో ఏసీబీ అధికారులు వలపన్ని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్, డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. -
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం
పేరేచర్ల(ఫిరంగిపురం)/యడ్లపాడు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ శివారులో సోమవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను సెంట్రింగ్ మెటీరియల్‌తో వెళ్తున్న ట్రాలీ ఆటో అతి వేగంతో ముందు వైపునుంచి ఢీకొట్టటంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు నల్లచెరువుకు చెందిన తమ్మిశెట్టి గోవిందు మాచవరం మండలం మల్లబోలు గ్రామ జాతరలో బొమ్మలు విక్రయించి సోమవారం వేకువజామున తన సొంత ఆటోపై స్వగ్రామానికి బయలుదేరాడు. సాతులూరు వద్ద ఏడుగురు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. ఆటో ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ సమీపానికి వచ్చేసరికి గుంటూరు నుంచి నరసరావుపేట వైపు సెంట్రింగ్ మెటీరియల్‌తో వెళుతున్న ట్రాలీ ఆటో మితిమీరిన వేగంతో ఆటోను ఢీకొట్టింది. మృతుల్లో యడ్లపాడు మండలం పుట్టకోటకు చెందిన తల్లీబిడ్డలు కాకాని రమాదేవి (32), చిన్నారులు బాల మణికంఠ (5), యశస్విని (11 నెలలు) తోపాటు సాతులూరుకు చెందిన విద్యుత్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ కొండ్రాతి అశోక్‌కుమార్ (32), నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన ఆవుల యువరాజ్ (22), చిరుమామిళ్లకు చెందిన పొగర్తి మరియమ్మ (40) ఉన్నారు. వీరితో పాటు ఆటో డ్రైవర్ తమ్మిశెట్టి గోవింద్, ప్రయాణికుడు గుంటుపల్లి సుధాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నరసరావుపేట డీఎస్పీ ఎం.వీరారెడ్డి, సీఐ అచ్చయ్య, ఫిరంగిపురం ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రాలీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కళ్లెదుటే భార్య, బిడ్డల మృత్యువాత భార్యాబిడ్డలు మృత్యువాత పడటంతో కొత్తపాలెం (పుట్టకోట) గ్రామానికి చెందిన కాకాని బ్రహ్మయ్య గుండెలవిసేలా రోదిస్తున్నాడు. బ్రహ్మయ్యకు కారంపూడి మండలం కొదమగుండ్ల గ్రామానికి చెందిన రమాదేవితో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే బ్రహ్మయ్య, రమాదేవి దంపతులకు చాలాకాలం వరకు పిల్లలు పుట్టకపోవడంతో ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నారు. ఎట్టకేలకు బాలమణికంఠ (5), యశస్విని (11 నెలలు) పుట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. అయితే, బ్రహ్మయ్యకు ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో అతనికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల 8వ తేదీన రమాదేవి పుట్టిల్లయిన కొదమగుండ్ల గ్రామంలో వెంకటేశ్వరస్వామి గుడి ప్రతిష్ట మహోత్సవం ఉండటంతో బ్రహ్మయ్య భార్యబిడ్డలతో కలిసి బైక్‌పై అక్కడకు వెళ్లాడు. సోమవారం ఇంటికి అదే బైక్‌పై తిరిగివస్తుండగా.. సాతులూరు వద్దకు వచ్చేసరికి వర్షం కురిసింది. భార్య, పిల్లలు తడిసిపోతారన్న ఉద్దేశంతో వారిని ఆటో ఎక్కించి బ్రహ్మయ్య బైక్‌పై ఆటోను అనుసరిస్తూ వచ్చాడు. వారిని ఆటో ఎక్కించిన 15 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోరం జరిగింది. ఒకవైపు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మృతి చెందిన భార్య.. కన్నతల్లి పొత్తిళ్లలోనే ఊపిరొదిలిన చిన్నారి, నాన్నా.. నాన్నా అంటూ తీవ్ర గాయాలను భరించలేక తల్లడిల్లుతున్న పసివాడిని చూస్తూ బ్రహ్మయ్య కొయ్యబారిపోయాడు. ఏం చేయాలో పాలుపోక గుండెలు బాదుకుంటూ అతడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. -
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, గుంటూరు : జిల్లాలోని ఫిరంగిపురం మండలం రేపుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పసికందు ఉన్నారు. నర్సారావు పేట నుంచి పుట్టకోట గ్రామానికి వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరంతా కూడా నర్సరావుపేట సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురిని పుట్టకోట గ్రామానికి చెందిన రమాదేవి, మణికంఠ, యశస్వినిగా గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బెదిరించిన భార్యను కాల్చేసిన భర్త
ఫిరంగిపురం(తాడికొండ): వ్యసనాలకు బానిసైన భర్త తాగొచ్చి నిత్యం వేధిస్తుండటంతో విసిగి పోయిన ఆ ఇల్లాలు అతన్ని బెదిరించేందుకు ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఆ దుర్మార్గుడు నన్నే బెదిరిస్తావా అంటూ అగ్గిపుల్ల గీసి నిప్పంటించడంతో మంటలకు ఆహుతైంది. ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నుదురుపాడు రైల్వే స్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నండూరి మురళీకృష్ణకు గుంటూరు ఏటుకూరుకు చెందిన శివాలశెట్టి శివశంకర్ సోదరి రాజేశ్వరి (33)తో 12 ఏళ్ల కిందట వివాహమైంది. కొన్నేళ్ల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి కుమార్తె కావ్య, కుమారుడు వంశీకృష్ణ సంతానం. వ్యసనాలకు బానిసగా మారిన మురళీకృష్ణ నిత్యం మద్యం తాగి భార్యను డబ్బు కోసం వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లి భార్యతో ఘర్షణకు దిగాడు. వేధింపులు భరించలేని రాజేశ్వరి భర్తను బెదిరించేందుకు ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. మద్యం మత్తులో ఉన్న మురళీకృష్ణ నన్ను బెదిరిస్తావా..నిన్ను తగులబెడతానంటూ అగ్గిపుల్ల గీసి నిప్పంటించి పరారయ్యడు. ఘటనను చూస్తున్న పిల్లలు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు మంటలార్పి రాజేశ్వరిని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. -
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
సాక్షి, గుంటూరు: కొండపై కార్మెల్ మాత ఆలయం... కొండ పక్కనే ఎస్టీ కాలనీ... ఎదురుగా బాలయేసు కేథడ్రల్ చర్చి, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్.. ఆ పక్కనే గుంటూరు–కర్నూలు ప్రధాన రహదారి. ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలో క్వారీయింగ్‌కు మైనింగ్ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. ఫిరంగిపురంలో క్వారీయింగ్, బ్లాస్టింగ్ల వల్ల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని 2016 డిసెంబర్ 18వ తేదీన ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. (ఫిరంగిపురంలో క్వారీయింగ్‌తో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని 2016 డిసెంబర్ 18వ తేదీన ‘సాక్షి’ ప్రచురించిన కథనం) అప్పట్లో ఈ కథనంపై అధికార పార్టీ నేతలు అక్కసు వెళ్లగక్కారు. ఫిరంగిపురంలో క్వారీని నిలిపివేయాలంటూ స్థానికులు ఎన్నిసార్లు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఇదే కొండచుట్టూ మొత్తం 12 క్వారీలకు మైనింగ్ అనుమతులు ఇచ్చారు. 24 గంటలూ యథేచ్ఛగా ఇక్కడ బ్లాస్టింగ్లు, తవ్వకాలు జరుగుతున్నాయి. ఎప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందోనని ఫిరంగిపురం వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.