సాక్షి ఇండియా స్పెల్‌బీ-2014 రెండో దశ పోటీలు ఆదివారం ఒంగోలులో ప్రశాంతంగా జరిగాయి. ప్రతికూల వాతావరణం జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ మొత్తం నాలుగు కేటగిరీల్లో 186 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులకు మేలు చేసేలా ‘సాక్షి’ మీడియా చక్కటి కార్యక్రమం చేపట్టిందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.
ఒంగోలు వన్‌టౌన్: సాక్షి ఇండియా స్పెల్‌బీ-2014 రెండో దశ పోటీలు ఆదివారం స్థానిక రామ్‌నగర్ 7వలైనులోని భాష్యం పబ్లిక్ స్కూలులో ప్రశాంతంగా జరిగాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నప్పటికీ రెండో దశ పోటీలకు అర్హత సాధించిన విద్యార్థులందరూ పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 5 గంటల నుంచే జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నా జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు అనేక వ్యయప్రయాసలకోర్చి ఒంగోలు వచ్చారు.
మొత్తం నాలుగు కేటగిరీల్లో 186 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పోటీలను సాక్షి బ్రాంచ్ మేనేజర్ డీవీఎస్ రెడ్డి ప్రారంభించారు. కేటగిరీ-1లో 1,2 తరగతులు చదువుతున్న విద్యార్థులు 23 మంది, కేటగిరీ-2లో 3,4,5 తరగతుల వారు 42 మంది, కేటగిరీ-3లో 6,7 తరగతుల వారు 56 మంది, కేటగిరీ-4లో 8,9,10 తరగతుల వారు 65 మంది పరీక్షకు హాజరయ్యారు.
కేటగిరీ-1 విద్యార్థులకు ఉదయం 10.15 గంటలకు, కేటగిరీ-2కు మధ్యాహ్నం 12.15 గంటలకు, కేటగిరీ-3 కి మధ్యాహ్నం 2.15 గంటలకు, కేటగిరీ-4కు సాయంత్రం 4.15 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. ఈ పోటీలకు సంబంధించిన హైదరాబాద్‌లోని సాక్షి స్టూడియో నుంచి నేరుగా లైవ్‌లో ప్రశ్నలను అడగగా విద్యార్థులు ఆ పదాలకు స్పెల్లింగ్‌లను రాశారు. ఒక్కో పదానికి 40 సెకన్లు కేటాయించి ఒక్కో ప్రశ్నను మూడుసార్లు రిపీట్ చేశారు. రామ్‌నగర్ భాష్యం హైస్కూలు ప్రిన్సిపాల్ వెంకటరమణ పరీక్షను పర్యవేక్షించారు.
దూర ప్రాంతాల నుంచి...
జిల్లా నలుమూలల నుంచి సాక్షి ఇండియా స్పెల్‌బీ-2014 రెండో దశ పరీక్షకు విద్యార్థులు హాజరయ్యారు. గిద్దలూరులోని వినూత్న విద్యానికేతన్, కనిగిరిలోని ఆల్ఫా హైస్కూలు, కందుకూరులోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూలు, దర్శిలోని భాష్యం హైస్కూలు, గౌతమి హైస్కూలు నుంచి, అద్దంకిలోని బెల్ అండ్ బెన్నెట్ పబ్లిక్ స్కూలు, శ్రీసాయి పబ్లిక్ స్కూలు, చీరాలలోని విజ్ఞానభారతి, సెయింట్ ఆన్స్, ఒంగోలులోని భాష్యం పబ్లిక్ స్కూలు, శ్రీ శారదా బాలకుటీర్, ఆంధ్రా హైస్కూలు, నారాయణ పబ్లిక్ స్కూలు తదితర పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులకు మేలు చేసేలా సాక్షి మీడియా చక్కటి కార్యక్రమం చేపట్టిందని వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.
స్పెల్‌బీ పోటీలు విజయవంతం:
సాక్షి స్పెల్‌బీ రెండో దశ పోటీలు విజయవంతమైనట్లు స్థానిక రామ్‌నగర్ భాష్యం పబ్లిక్ స్కూలు ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. ఉదయం నుంచి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జిల్లా నలుమూలల నుంచి ఈ పరీక్షకు విద్యార్థులు హాజరయ్యారంటే దీని పట్ల విద్యార్థులకున్న మక్కువ ఎంతో అర్థమవుతోందన్నారు. ఈ పోటీల వల్ల విద్యార్థులకు ఆంగ్లభాష మీద అవగాహన పెరుగుతుందని తెలిపారు.
ధనుష్ అభిరామ్, భాష్యం, ఒంగోలు
సాక్షి స్పెల్‌బీ-2014 ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. స్పెల్‌బీ వల్ల ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించవచ్చు.
జె.రాగవర్షిణి, ఆల్ఫా పబ్లిక్ స్కూల్, కనిగిరి
సాక్షి స్పెల్‌బీ-2014 పరీక్ష మా భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. కష్టమైన పదాలకు స్పెల్లింగ్‌లు, అర్థాలను స్పెల్‌బీ వల్ల నేర్చుకున్నాం. వివిధ పదాలను ఎలా పలకాలో కూడా తెలుసుకున్నాం. దీని వలన ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.
స్పెల్ బీ ప్రశాంతం
Published Mon, Nov 10 2014 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM
Advertisement
Advertisement