అండర్–19 స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ తైక్వాండో పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు.
2017 జనవరి 4 నుంచి 8వ తేదీ వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ పోటీల్లో చరణ్‌తేజ పాల్గొననున్నాడు. 70 కేజీల విభాగంలో షేక్ ఫరూక్ కాంస్య పతకాన్ని, 66 కేజీల విభాగంలో సాయితేజ కాంస్య పతకాన్ని సాధించారు. వీరు శనివారం జిల్లా అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఓ రమేష్‌బాబు, అండర్–19 స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎం.హరనాథబాబు విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన తైక్వాండో జిల్లా కార్యదర్శి అబ్దుల్ సలాం, టీం కోచ్ అఖిల్‌ను అభినందించారు.