
కొత్తపట్నం బీచ్ (ఫైల్ ఫొటో)
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం బీచ్‌కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటన జిల్లాలోని కొత్తపట్నం బీచ్‌లో గురువారం వెలుగుచూసింది. పది మంది విద్యార్థులు నేటి ఉదయం కొత్తపట్నం బీచ్‌లో విహారయత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి గల్లంతయ్యారు.
గల్లంతయిన ఇద్దరిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మహ్మద్ అక్బర్ అల్తాఫ్ మృతదేహం లభించగా, ఒంగోలు ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న నాగ పవన్ ఆచూకీ లభ్యంకాలేదు. నాగ పవన్ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.