సాక్షి, హైదరాబాద్ : వివిధ విభాగాల పనితీరును సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ హోదాతో విజయసాయిరెడ్డిని ఏపీ సర్కార్ నియమించింది. ఏపీ భవన్ కార్యాలయంగా విజయసాయిరెడ్డి విధులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన గ్రామ వాలంటీర్ ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ కోసం జీవో విడుదల చేసింది. ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా నియామక ప్రక్రియ చేపట్టనుంది. మరోవైపు సంప్రదాయకంగా వస్తున్న ‘హల్వా’ తయారీతో 2019 -20 కేంద్ర బడ్జెట్ పత్రాల ముద్రణా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..
Comments
Please login to add a commentAdd a comment