
శుక్ర, శనివారాల్లో మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపనున్నారు.
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న విభజన వివాదాల పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. శుక్ర, శనివారాల్లో మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపనున్నారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. కాగా, అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. గురువారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశానికి హాజరైన కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా నానక్‌రామ్‌గూడలోని కృష్ణా నివాసానికి చేరుకున్నారు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..