
మంగళగిరిలో చంద్రబాబుకు సమైక్య సెగ
గుంటూరు జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంగళగిరిలో సమైక్యసెగ తగిలిగింది. చంద్రబాబు సభలో సమైక్యాంధ్ర ప్లకార్డులతో విద్యార్థులు నిరసన తెలిపారు. చంద్రబాబు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులను బలవంతంగా నెట్టివేశారు.
ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అడుగడుగునా సమైక్య సెగ తగులుతోంది. అంతకుముందు క్రోసూరులోనూ చంద్రబాబుకు సమైక్య ఉద్యమ వేడి తాకింది. ఆయనను అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. సమైక్యవాద ప్లకార్డ్స్‌తో నిరసన తెలిపారు.
రెడ్డిగూడెంలో ప్రసంగిస్తున్న సమయంలోనూ కొందరు యువకులు ముందుకు దూసుకువచ్చి సమైక్యవాదానికి మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. బాబు వ్యక్తిగత సిబ్బంది, రక్షణ వలయాన్ని దాటుకుంటూ బస్ వద్దకు చేరుకుని... సమైక్యవాదం వర్ధిల్లాలి, జై సమైక్యాంధ్ర అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపివేసి సత్తెనపల్లికి వెళ్లిపోయారు.