నంగునూరు/పటాన్‌చెరు రూరల్, న్యూస్‌లైన్: రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క, సారక్క జాతర జిల్లాలోనూ నిర్వహిస్తున్నారు. నంగునూరు మండలం అక్కెనపల్లి, పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లోని గద్దెల వద్ద ఉత్సవాలు చేపడుతున్నారు. మేడారం వెళ్లలేని వారు ఇక్కడికొస్తుంటారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ బుధవారం నుంచి పూజలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడికి వచ్చినా మేడారం వెళ్లిన తృప్తి కలుగుతుందని భక్తులు భావిస్తుంటారు.
నంగునూరు మండలం అక్కెనపల్లిలో సమ్మక్క, సారక్క గద్దెలను ముస్తా బు చేశారు. ఇక్కడ రెండు దశాబ్దాల క్రితం గద్దెలను ఏర్పాటు చేశారు. అప్ప టి నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడ జాతర నిర్వహిస్తుంటారు. ఈ ప్రాంతం మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులో ఉండడంతో ఆయా జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు చెందిన భక్తు లు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
బుధవారం సారక్కను, గురువారం సమ్మక్కను గద్దెపైకి తీసుకురానున్నారు. శుక్రవారం ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకోవచ్చు. భక్తులు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తారు. అమ్మవార్లకు ఒడి బియ్యం పోసి పూజలు చేస్తారు. అక్కడే భోజనాలు చేసి తిరుగు ప్రయాణమవుతారు. భక్తులకోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మంచి నీటి వసతి, ఉచిత వంట చెరకు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
జిల్లాలోనూ సమ్మక్క-సారక్క జాతర
Published Tue, Feb 11 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
Advertisement