- కుప్పం మీదుగా ఇసుక అక్రమ రవాణా
- ప్రతిరోజు తమిళనాడు నుంచి బెంగళూరుకు 50కి పైగా లారీల రవాణా
- పలమనేరులో నుంచి యథేచ్ఛగా కర్ణాటకకు తరలింపు
- చిత్తూరు నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగు తమ్ముళ్ల పాలిట ఇసుక బంగారంగా మారింది. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్న ధనం అభిస్తుండడంతో అక్రమ రవాణాకు అడ్డే లేకుండా పోయింది. మాఫియాను తలపించే రీతిలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకొని ఏకంగా రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు. తమిళనాడు టు కర్ణాటక వయా ఆంధ్రప్రదేశ్ మీదుగా యథేచ్చగా తరలిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ దందాలో కొందరు అధికారులను భాగస్వాములుగా చేసుకోవడంతో నియంత్రించే నాథుడే కరువయ్యారు. వెరసి కోట్లాది రూపాయల విలువైన ప్రజా సంపద పచ్చ చొక్కాల జేబుల్లోకి వెళ్తోంది.
కుప్పం కేంద్రంగా దందా
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం అక్రవు రవాణాకు రాచబాటగా వూరింది. తమిళనాడు, కర్ణాటకల నడువు ఉన్న ఈ ప్రాంతం ఇసుకాసురుల పాలిట కల్పతరువుగా వూరింది. దీంతో తమిళనాడు సరిహద్దుల్లోని క్రిష్ణగిరి నుంచి ప్రతి రోజు రాత్రి 50కి పైగా లారీల్లో ఇసుక కుప్పం, గుడుపల్లి, శాంతిపురం వుండలాల మీదుగా కర్ణాటక రాజధానికి తరలిస్తున్నారు. బెంగళూరులో ఇసుక నాణ్యతను బట్టి ఒక్కో లోడ్డుకు రూ.90 వేల వరకు ధర పలుకుతుండడంతో ఇసుకాసురుల పంట పడుతోంది. తమిళనాడు నుంచి బియ్యుం రవాణాపై ఆంక్షలు తీవ్రం కావడంతో గతంలో చౌకబియ్యూన్ని కర్ణాటకకు తరలించిన ముఠాలు ఇప్పుడు ఇసుకపై కన్నేశాయి. దీంతో క్రిష్ణగిరి ప్రాంతంలోని పెన్నార్ నది, దానికి అనుబంధంగా ఉన్న ఏరుల నుంచి ఇసుకను లారీలకు నింపుతున్నారు. వీటిని నేరుగా హొసూరు మీదుగా బెంగళూరుకు చేర్చే అవకాశం ఉంది. అయితే ఈ వూర్గంలో టోల్ గేటు, అంతర్రాష్ట తనిఖీ కేంద్రం, వాణిజ్య పన్నుల తనిఖీ కేంద్రం ఉన్నారుు. ఈ సవుస్యను అధిగమించేందుకు కుప్పం, బంగారుపేట, కోలారు, హెచ్ క్రాసు, విజయుపురం మీదుగా బెంగళూరుకు చేరుతున్నారు. అరుుతే ఉన్నతస్థారుులోని అధికారులు, కొందరు అధికార పార్టీ నాయుకుల ఆశీస్సులతో సాగుతున్న ఈ వ్యవహారంలో వేలు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు.
రవాణా ఇలా
తమిళనాడు నుంచి నడివుూరు చెక్‌పోస్టు మీదుగా అర్ధరాత్రి తరువాత ఒక్క సారిగా కనీసం 50 లారీలు వస్తున్నారుు. కుప్పం తర్వాత కర్ణాటక సరిహద్దు వరకు ఉన్న దారుల్లో రోజుకో వూర్గాన్ని ఎంచుకొంటున్నారు. ఏడో మైలు, రాళ్లబూదగూరు లేదా సోవూపురం, గెసికపల్లి మీదుగా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇసుక లారీల వుుందు, వెనుక నిత్యం ఆరు వాహనాలతో స్మగ్లర్లు ఎస్కార్టు నిర్వహిస్తున్నట్టు ఈ వూర్గంలోని ఉన్న ప్రజలు చెబుతున్నారు.
రాళ్లబూదగూరు పోలీసు స్టేషన్ ముందు నుంచి వేళ్లే రోడ్డును స్మగ్లర్లు ఎంచుకోవడం ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై అనువూనాలకు ఊతమిస్తోంది. వున అధికారులు చూడనట్టు వదిలేస్తే కర్ణాటక పోలీసులు వూత్రం వారి సరిహద్దుల్లో కాపు కాచి వురీ లారీలను సాగనంపుతున్నారు. ఈ వ్యవహారంలో కుప్పం ప్రాంతంలోనే నెల వారీగా లక్షల్లో చేతులు వూరుతున్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారాన్ని కట్టడి చేయుకపోతే తమిళ వుుఠాలు కుప్పం ప్రాంతంలో వేళ్లూనుకుని భవిష్యత్తును భయూనకం చేసే ప్రవూదం ఉంది.
పలమనేరు, చిత్తూరు నుంచి...
పలమనేరు, గంగవరం మండలాల నుంచి నుంచి ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇక్కడ లారీ ఇసుక *13000 ఉంటే కర్ణాటకలో దాని ధర *30,000 నుంచి 50,000 పలుకుతోంది.
దీంతో ఇసుకాసురులు అధికారుల అండతో తెగబడుతున్నారు. చిత్తూరు నుంచి భారీగా తమిళనాడు, కర్ణాటకలకు తెలుగు తమ్ముళ్లు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. వీరి ధాటికి తట్టుకోలేక అక్కడ ఏకంగా 15 రీచ్‌లను అధికారులు మూసివేయడం గమనార్హం.
దొంగదారిలో రైట్‌రైట్
Published Fri, May 1 2015 5:58 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement