
సాక్షి, కృష్ణా: జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నాంటాయి. రంగురంగుల ముగ్గులు, సాంస్కృతిక కార్యక్రమాలు, జన జాతరతో బుధవారం ఈడుపు గళ్లు కోలాహలంగా మారింది. ఉత్కంఠభరితంగా సాగిన కోడిపందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. కాగా తెలంగాణ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మల్లేష్ ఈ సంబరాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.