
ప్రాణం తీసిన చీర..
గరుగుబిల్లి: విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం దలైపేట గ్రామం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. గంగడేగవలస గ్రామానికి చెందిన అరసడ జయలక్ష్మి(29) అనే మహిళ బైక్ మీద వెళుతుండగా చీర బైక్ చక్రానికి చుట్టుకుంది. అమాంతం కింద పడిపోయి ఆమె తల రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్రరక్తస్రావపై అక్కడికక్కడే మృతిచెందింది.
చీర చక్రంలో చుట్టుకోవడం గమనించక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.