హైదరాబాద్: సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 7న ఎల్బి స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. సభ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందనరాలేదన్నారు. సభకు అనుమతిపై రేపు పోలీసులు చెప్పకుంటే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
సమైక్యరాష్ట్రంకోరుకునే ప్రతిఒక్కరూ ఈ సభకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాజకీయ అజెండా లేకుండావస్తే పార్టీ నేతలనూ ఆహ్వానిస్తామని అశోక్‌బాబు చెప్పారు.
సమైక్యాంధ్ర డిమాండ్ చేస్తూ లక్ష మందితో హైదరాబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఏపీఎన్జీవోల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే రోజు తాము కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలంగాణ జేఏసీ నేతలు చెప్పారు. దీంతో సెప్టెంబరు 7న హైదరాబాద్లో ఏం జరుగుతుందా ? అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇప్పటికే హైదరాబాద్లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విభజన కొట్టవచ్చినట్లు కనపడుతోంది. పోటాపోటీగా ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యమాలు నడుపుతున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో బహిరంగ సభకు పోలీసులు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు.
సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు ఏర్పాట్లు
Published Sun, Sep 1 2013 3:45 PM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement