శివస్వామి (పాత ఫొటో)
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి హిందూత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, జేఏసీ ద్వారా మహా పాదయాత్రను తలపెట్టనున్న శివస్వామిపై శనివారం కేసు నమోదైంది. శివస్వామి అనుచరులు కులం పేరుతో దూషించి దాడి చేశారని ఫిర్యాదు అందటంతో పోలీసులు జేఏసీ చైర్మన్ అయిన శివస్వామిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు హాజరుకావాలని శివస్వామికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
పాదయాత్రను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ కుట్ర పన్నుతోందని శివస్వామి ఆరోపించారు. రాత్రి నుంచి శైవ క్షేత్రంలో లేని తాను అసైన్డ్ రైతులపై ఎలా దాడి చేస్తానని ప్రశ్నించారు. ఏపీలో అరాచక పాలన నడుస్తోందని అన్నారు. కొంతమంది రైతులను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం సాయంత్రం పాదయాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment