కొత్తగూడ, న్యూస్‌లైన్ : షెడ్యూల్డ్ ప్రాంతంలో ఆదివాసులకు సర్వాధికారాలు కల్పిస్తూ స్వయం పాలనా మండలి ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకుడు సాధినేని వెంకటేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. ఆది వారం మండలకేంద్రంలో నిర్వహించిన పోరు కేక బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
బ్రిటీష్ కాలంలో ఏజెన్సీ ప్రాం తానికి ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేస్తే వాటి అమలు చేయకుండా గ్రీన్‌హంట్, టైగర్ జోన్, ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను అడవికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ సంపదను బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేసేందుకు పాలకులు సిద్ధమయ్యూరని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే సుమారు 300 గ్రామాలు జల సమాధి అవుతాయన్నారు. దోపిడీ, అణచివేత ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుందని, ఎన్‌కౌంటర్లు, కేసులతో విప్లవాన్ని అడ్డుకోలేరన్నారు.
అరుణోదయ కళాకారుల ఆటాపాటా
పోరుకేకలో అరుణోదయ కళాకారుల ఆటాపాటా అందర్ని ఆకర్షించాయి. అమరులైన నక్సలైట్లకు జోహార్లు అర్పిస్తూ, ప్రజల కష్టాలపై పాడిన పాటలు అలరించారుు. కాగా, సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో మండల కేంద్రం ఎరుపుమయమైంది. సభలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్, ముక్తార్‌పాషా, తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షడు దబ్బకట్ల నర్సింగరావు, శాతావాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాత, నాయకులు కోడి సోమన్న, మండల వెంకన్న, తోటకూరి రాజు, లావుడ్యరాజు, అరుణోదయ కళాకారులు ఝాన్సీ, అంజయ్య, గుండె శ్రీను, పార్టీ సర్పంచులు పాల్గొన్నారు.
షెడ్యూల్డ్ ప్రాంతానికి మండలి ఏర్పాటు చేయూలి
Published Mon, Feb 24 2014 2:11 AM | Last Updated on Sat, Sep 15 2018 6:02 PM
Advertisement
Advertisement